ఈ కారు లగ్జరీ రూమ్‌కంటే తక్కువేమీ కాదు.. మసాజ్ సీటు, ఎల్ఈడీ టీవీ, చల్లని వేడి నీరు!-kia carnival hi limousine to make india debut at auto expo 2025 with amazing features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఈ కారు లగ్జరీ రూమ్‌కంటే తక్కువేమీ కాదు.. మసాజ్ సీటు, ఎల్ఈడీ టీవీ, చల్లని వేడి నీరు!

ఈ కారు లగ్జరీ రూమ్‌కంటే తక్కువేమీ కాదు.. మసాజ్ సీటు, ఎల్ఈడీ టీవీ, చల్లని వేడి నీరు!

Anand Sai HT Telugu
Jan 15, 2025 12:31 PM IST

kia carnival hi limousine : ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్ పో 2025లో కియా ఇండియా కొత్త కార్నివాల్ హై లిమోసిన్ ను ఆవిష్కరించనుంది. కార్నివాల్ హై లిమోసిన్ విలాసవంతమైన సీటింగ్ లేఅవుట్, హై-రూఫ్ సెటప్ కలిగి ఉంది.

కియా కార్నివాల్ హై లిమోసిన్‌
కియా కార్నివాల్ హై లిమోసిన్‌

ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్ పో 2025లో కొత్త కొత్త కార్లు రానున్నాయి. కియా ఇండియా కొత్త కార్నివాల్ ఆధారంగా కార్నివాల్ హై లిమోసిన్‌ను తీసుకురానుంది. కార్నివాల్ హై లిమోసిన్ విలాసవంతమైన సీటింగ్ లేఅవుట్, హై-రూఫ్ సెటప్ కలిగి ఉంటుంది. కియా కార్నివాల్ హై లిమోసిన్ 4-సీటర్ కంఫర్ట్ స్థాయిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. దీని గురించి తెలుసుకోవాల్సిన విశేషాలు చాలా ఉన్నాయి.

yearly horoscope entry point

కార్నివాల్ హై లిమోసిన్ కూడా మంచి డిజైన్‌తో, ప్యాసింజర్ ఫోకస్డ్ ఇంటీరియర్‌ను కలిగి ఉంది. వెల్ఫైర్ మాదిరిగానే డెక్-అవుట్ కార్నివాల్ రెండో వరుసలో రెండు పెద్ద ప్రీమియం కెప్టెన్ కుర్చీలను కలిగి ఉంది. ప్రతి ఒక్కటి అధిక-నాణ్యత నాప్పా లెదర్ ఉపరితలంతో 3డి క్విల్టెడ్ డిజైన్‌తో ఉంటాయి. చాలా లిమోసిన్ సీట్ల మాదిరిగానే.. ఇవి కూడా పొడిగించిన లెగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటాయి.

లగ్జరీ ఫీచర్లు

ఈ సీట్లలో ప్రత్యేక పిక్నిక్ టేబుల్స్, వరుస సర్దుబాట్లు ఉన్నాయి. వీటిని టచ్‌స్క్రీన్ రిమోట్ డిస్‌ప్లే ద్వారా నియంత్రించవచ్చు. ఈ డిస్‌ప్లే ఏసీ, క్యాబిన్ లైట్లు, కర్టెన్లను కూడా సర్దుబాటు చేయగలదు. ముందు వరుస వెనుక పైకప్పుపై అమర్చిన 21.5 అంగుళాల పెద్ద ఎల్ఈడీ టీవీకి రిమోట్‌గా పనిచేస్తుంది.

ఇందులో రెండు సీట్లకు ఆర్మ్రెస్టులు, కన్సోల్లో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్లు, హీటెడ్ / కూల్డ్ కప్ హోల్డర్లు ఉన్నాయి. ఇది కాకుండా రెండో వరుస ప్రయాణికుడు తన కోసం ఫుట్ మసాజర్‌ను కూడా పొందుతాడు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించడానికి హెల్త్‌కేర్ కంపెనీ హు-టెక్ సహకారంతో ఈ ఫుట్ మసాజర్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు కియా తెలిపింది.

లగ్జరీ ఎమ్‌పీవీలో ఇద్దరు ప్రయాణికుల కోసం చల్లని లేదా వేడి నీటి కోసం ప్రత్యేక కప్పు హోల్డర్లు కూడా ఉన్నాయి. కార్గో హోల్డ్ పైకప్పు-మౌంటెడ్ హ్యాంగర్లు, ఫ్లోర్ కింద స్టోరేజ్ బాక్సులతో స్థలాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. భిన్నమైన అల్లాయ్ వీల్ డిజైన్ ఉంటుంది.

కార్నివాల్ హై లిమోసిన్ ఇంజన్

కార్నివాల్ హై లిమోసిన్ 4-సీటర్ 3.5-లీటర్ స్మార్ట్ స్ట్రీమ్ వి 6 పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 290 బిహెచ్‌పీ, 355 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్‌తో జతచేసి ఉంటుంది. స్టాండర్డ్ కార్నివాల్ కంటే మెరుగైన రైడ్ క్వాలిటీ కోసం సస్పెన్షన్‌ను తిరిగి జత చేసింది.

Whats_app_banner