కియా మోటార్స్ ఇండియాలోకి సరికొత్త క్యారెన్స్ క్లావిస్ ఎంపీవీని తీసుకొచ్చింది. ఇది సుపరిచితమైన కారెన్స్ ఎంపీవీకి మరింత ప్రీమియం వర్షెన్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు మోడల్స్ ఫ్యామిలీలకు బాగా సూట్ అవుతాయి. కాగా క్లావిస్ అదనపు లగ్జరీ, అధునాతన సాంకేతికతను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటిని పోల్చి, అసలు వీటి మధ్య ఉన్న తేడాలేంటి? అన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
విజువల్‌గా చూసుకుంటే, క్యారెన్స్ క్లావిస్ బోల్డ్‌గా, ట్రెడిషనల్‌కి విరుద్ధంగా ఉంటుంది. కియా యొక్క "అపొజిట్స్ యునైటెడ్" డిజైన్ ఫిలాసఫీ నుంచి తీసిన క్లావిస్ మరింత నిటారుగా ఉండే స్టైలింగ్, లైట్ బార్ ద్వారా కనెక్ట్ చేసిన ఎల్-ఆకారంలో ఉన్న ఎల్ఈడీ డిఆర్ఎల్స్, కియా గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాలను గుర్తుచేసే విలక్షణమైన 'ఐస్ క్యూబ్' హెడ్ ల్యాంప్లను కలిగి ఉంది. బంపర్లు మరింత స్కల్ప్ చేశారు. ఇది ఎస్యూవీ లాంటి వ్యూని ఇస్తుంది.
వెనుక భాగంలో 'స్టార్‌మ్యాప్' పేరుతో కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ లేఔట్‌తో కియా క్యారెన్స్ క్లావిస్ వస్తుది. మరోవైపు, క్యారెన్స్ సరళమైన రేఖలు- మృదువైన కర్వ్స్‌తో మరింత ఎంపీవీ-ఫోకస్డ్ డిజైన్ని కలిగి ఉంది. క్లావిస్ విభిన్న డిజైన్‌తో పెద్ద 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. స్టాండర్డ్ క్యారెన్స్ 16-ఇంచ్ యూనిట్లను పొందుతుంది.
కొత్త ఐవరీ సిల్వర్ షేడ్ క్లావిస్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది.
ఇంటీరియర్ విషయానికొస్తే, క్యారెన్స్ క్లావిస్ ప్రధాన సాంకేతిక అప్‌గ్రేడ్‌ని పొందింది. డ్యూయెల్ 26.6 ఇంచ్ డిస్ప్లే యూనిట్ డ్యాష్‌బోర్డులో ఉంటుంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్‌ని ప్యానెల్లో ఉంటాయి. ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్‌గా ఉండే ఈ ఎంపీవీ పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ ప్యూరిఫైయర్, ప్రీమియం బోస్ ఆడియో సిస్టెమ్ వంటి లగ్జరీ ఫీచర్లను కూడా కలిగి ఉంది. వీటిలో ఏవీ సాధారణ క్యారెన్స్‌లో అందుబాటులో లేవు.
ఎంపీవీ రెండొవ వరుస సీటు కోసం సెగ్మెంట్-ఫస్ట్ పవర్డ్, వన్-టచ్ ఫోల్డింగ్ మెకానిజం మరొక ప్రత్యేకత! ఇది మూడొవ వరుస యాక్సెస్‌ని మరింత సులభతరం చేస్తుంది. క్లావిస్లోని లెవల్ 2 ఏడీఏఎస్ సూట్‌తో భద్రతకు కూడా ఢోకా ఉండదు. అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, 360 డిగ్రీల కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా, క్యారెన్స్ రేర్ వ్యూ కెమెరా, ప్రామాణిక డ్రైవర్ ఎయిడ్స్ వంటి ప్రాథమిక భద్రతా పరికరాలతో వస్తుంది.
మెకానిక్స్ విషయానికొస్తే, క్యారెన్స్- కారెన్స్ క్లావిస్ ఇంజిన్ ఆప్షన్స్ ఒకేలా ఉన్నాయి. అవి.. 1.5-లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. క్లావిస్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ని మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందించడం మరో విశేషం.
ఇండియాలో కియా క్యారెన్స్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 10.60 లక్షలుగా ఉంది. ఇక కొత్తగా వచ్చిన క్యారెన్స్ క్లావిస్ ఎంపీవీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాగా ధర గురించి తెలియాల్సి ఉంది.
సంబంధిత కథనం