క్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ నమ్మకమైన ఆటోమేకర్‌గా అవతరించింది. ఇది 2019లో సెల్టోస్ ఎస్‌యూవీ ఎంట్రీతో దేశీయ మార్కెట్లోకి వచ్చింది. 2021 డిసెంబర్‌లో అదే సెల్టోస్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించిన క్లారెన్స్ ఎంపీవీని ఆవిష్కరించారు. ఈ కారు సరిగ్గా 4 సంవత్సరాల తర్వాత అప్డేట్ అయింది. కారెన్స్ క్లావిస్ పేరుతో మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కియా కారెన్స్ క్లావిస్ గురించి తెలుసుకుందాం..
కియా కారెన్స్ క్లావిస్ ఎంపీవీ ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. పాత కారెన్స్ మోడల్‌తో పోలిస్తే ఇది మరింత ప్రీమియం లుక్‌తో ఉంటుంది. కొత్త ఎంపీవీలోని కొన్ని డిజైన్ అంశాలు కియా ఈవీ9 లాగానే ఉంటాయి. కియా కారెన్స్ క్లావిస్ ఎంపీవీ ముందు భాగంలో మంచి డిజైన్‌తో ఎల్ఈడీ హెడ్‌లైట్‌లను కలిగి ఉంది. గ్రిల్‌పై కదిలే లైట్‌బార్‌ను కూడా చూడవచ్చు. దీనికి ముందు, వెనుక వైపున వినూత్నమైన బంపర్లు ఇచ్చారు.
కొత్త కారులో డిజైన్ పరంగా 17 అంగుళాల డైమండ్-కట్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్ ఉన్నాయి. వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లకు కనెక్ట్ చేసే లైట్ బార్ ఉంటుంది. ఇది ప్యూటర్ ఆలివ్, గ్రావిటీ గ్రే, స్పార్క్లింగ్ సిల్వర్, అరోరా బ్లాక్ పెర్ల్, క్లియర్ వైట్, గ్లేసియర్ వైట్ పెర్ల్ అండ్ ఇంపీరియల్ బ్లూ వంటి కస్టమర్లను ఆకర్షించే వివిధ కలర్ ఆప్షన్స్‌తో వస్తుంది.
కొత్త కియా కారెన్స్ క్లావిస్ ఎంపీవీ లోపలి భాగంలో కూడా చాలా మార్పులు ఉన్నాయి. డాష్‌బోర్డ్ చాలా వినూత్నంగా ఉంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇచ్చే 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే అండ్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంది.
పనోరమిక్ సన్‌రూఫ్, 4-వే పవర్డ్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, 9-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ వంటి వివిధ ఫీచర్లను కియా కారెన్స్ క్లావిస్ కూడా కలిగి ఉంది. ఈ కారు టాప్-ఎండ్ వేరియంట్‌లో 360-డిగ్రీ కెమెరా, కనెక్ట్ చేసిన కార్ టెక్ సూట్ ఉన్నాయి.
కారెన్స్ క్లావిస్ ప్రయాణికులకు సేఫ్టీలోనూ తోపు. భద్రత పరంగా దీనికి 6 ఎయిర్‌బ్యాగులు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్, లెవల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు లభిస్తాయి.
ఈ కారు 7 విభిన్న వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. HTE, HTE(O), HTK, HTK ప్లస్, HTK ప్లస్(O), HTX, HTX ప్లస్ అనే వేరియంట్‌లను కలిగి ఉంది. కియా కారెన్స్ క్లావిస్ ఎంపీవీలో 6/7 సీట్ల ఆప్షన్స్ ఉన్నాయి. దీనివల్ల ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి ఇది పెద్ద బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది.
టాపిక్