ఇండియాలోకి మరో ఫ్యామిలీ కారు అడుగుపెట్టింది. దాని పేరు కియా క్యారెన్స్ క్లావిస్. ఇదొక ఎంపీవీ. ఈ మోడల్ని తాజాగా ఇండియాలో లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్. రూ .25,000 టోకెన్ అమోంట్తో క్యారెన్స్ క్లావిస్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కొన్ని డీలర్షిప్ షోరూమ్స్ వద్ద, ఎంపీవీ ఇప్పుడు వినియోగదారులు వ్యక్తిగతంగా చెక్ చేయడానికి అందుబాటులో ఉంది. త్వరలోనే డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కియా క్యారెన్స్ క్లావిస్ ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
కియా కారెన్స్ క్లావిస్ ఫ్యామిలీ ఎంపీవీ ఏడు వేరియంట్లలో లభిస్తుంది. హెచ్‌టీఈ, హెచ్ టీఈ(ఓ), హెచ్ టీకే, హెచ్ టీకే+, హెచ్టీకే+(ఓ), హెచ్‌టీఎక్స్ , హెచ్‌టీఎక్స్ + ఉన్నాయి. ఏ వేరియంట్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? అన్నది తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
క్యారెన్స్ క్లావిస్ ధర రూ .11.49 లక్షల వద్ద ప్రారంభమై రూ .21.50 లక్షల వరకు ఉంటుంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. కియా క్యారెన్స్ అమ్మకాల్లో ఉంటుంది. దాని తర్వాత మోడల్‌గా ఈ క్లావిస్ కొనసాగుతుంది.
ఐవరీ సిల్వర్ గ్లాస్, ప్యూటర్ ఆలివ్, ఇంపీరియల్ బ్లూ, గ్లేసియర్ వైట్ పెర్ల్, గ్రావిటీ గ్రే, స్పార్క్లింగ్ సిల్వర్, అరోరా బ్లాక్ పెర్ల్, క్లియర్ వైట్ వంటి బహుళ రంగుల ఎంపికలను క్యారెన్స్ క్లావిస్ పొందుతుంది.
కియా క్యారెన్స్ క్లావిస్ ఇంటీరియర్‌ను 26.62 ఇంచ్ పానోరమిక్ డిస్ప్లేతో అప్‌గ్రేడ్ చేశారు. ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ని ఇంటిగ్రేట్ చేస్తుంది. అంతేకాకుండా ఆఫ్ సెట్ కియా లోగోతో కూడిన టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను కొత్తగా రూపొందించారు. ఈ మోడల్ దాని మూడు వరుసల కాన్ఫిగరేషన్‌ను నిలుపుకుంటుంది. ఇప్పుడు మూడొవ వరుసకు మెరుగైన యాక్సెస్ సులభతరం చేయడానికి రెండొవ వరుసలో వన్-టచ్ ఎలక్ట్రిక్ డంబ్లింగ్ ఫీచర్‌ని ఇచ్చారు.
అదనంగా, ఈ ఎంపీవీ రెండొవ వరుస సీట్లు ఇప్పుడు స్లైడింగ్, రిక్లైనింగ్ సామర్థ్యాలను అందిస్తాయి. ఫీచర్ల విషయానికొస్తే, క్లావిస్లో 8-స్పీకర్ల బోస్ ఆడియో సిస్టమ్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీల కెమెరా, అన్ని విండోలకు పనిచేయడానికి అనుమతించే స్మార్ట్ కీ సిస్టమ్, రూఫ్ మౌంటెడ్ వెంట్లతో సీట్ మౌంటెడ్ ఎయిర్ ప్యూరిఫైయర్, పానోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్లు, 4 వే ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెబుల్ డ్రైవర్ సీటు ఉన్నాయి.
ఈ కియా కారెన్స్ క్లావిస్లో 113 బీహెచ్పీ పవర్‌ని జనరేట్ చేసే 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 158 బీహెచ్పీ పవర్‌ని జనరేట్ చేసే టర్బో పెట్రోల్ వేరియంట్, 114 బీహెచ్పీని అందించే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి.
టర్బో పెట్రోల్- నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్లు రెండూ కొత్త మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి. టర్బో పెట్రోల్, డీజిల్ వేరియంట్లు కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలను కలిగి ఉంటాయి.
కియా కారెన్స్ క్లావిస్ లెవల్ 2 ఏడీఏఎస్‌తో వస్తుంది. ఇది ఎంపీవీలో 20కి పైగా డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లను తీసుకువస్తుంది. ఈ మోడల్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్సీ, రేర్ ఆక్యుపెంట్ అలర్ట్, మొత్తం 18 యాక్టివ్- పాసివ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
సంబంధిత కథనం