Kawasaki Ninja 650 : కవాసకి నింజా 650పై బంపర్ డిస్కౌంట్.. రూ. 45,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు
Kawasaki Ninja 650 Discounts : ఫిబ్రవరి 2025లో కవాసకి నింజా 650పై బంపర్ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ బైక్‌పై కస్టమర్లు రూ. 45,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందవచ్చు.

మీరు మంచి, స్టైలిష్ స్పోర్ట్స్ బైక్ కొనాలని ఆలోచిస్తుంటే కవాసకి నింజా 650 బాగుంటుంది. ఈ గొప్ప బైక్‌పై కంపెనీ రూ. 45,000 వరకు తగ్గింపు ప్రయోజనాలను అందిస్తోంది. మీరు బైక్ ఎక్స్-షోరూమ్ ధరపై దీనిని రీడీమ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఫిబ్రవరి చివరి వరకు మాత్రమే చెల్లుతుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ వివరాలను తెలుసుకుందాం..
కవాసకి నింజా 650 ఇంజిన్
కవాసకి నింజా 650 దాని విభాగంలో అత్యుత్తమ స్పోర్ట్స్ టూరింగ్ బైక్‌లలో ఒకటి. ఇది పవర్‌ఫుల్ బైక్. సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది 649cc సమాంతర-ట్విన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 67బీహెచ్‌పీ శక్తిని, 64ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. హైవేపై సాఫీగా ప్రయాణించడానికి, నగర ట్రాఫిక్‌లో అద్భుతమైన పనితీరును ఇస్తుంది.
ఫీచర్లు
ఫీచరల్లో నింజా 650 కూడా తక్కువేమీ కాదు. ఈ బైక్ TFT డిస్‌ప్లే(బ్లూటూత్ కనెక్టివిటీతో), ట్రాక్షన్ కంట్రోల్ కలిగి ఉంది. ఈ బైక్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, గొప్ప బ్రేకింగ్ అనుభవాన్ని కలిగి ఉంది. కవాసకి నింజా 650 మోడల్‌లో కొత్త రంగు ఆప్షన్స్ కూడా వస్తున్నాయి. దీంతో ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
కవాసకి నింజా 650 ధర
కవాసకి నింజా 650 బైక్ రూ.7.16 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది. దీనిపై కంపెనీ ప్రస్తుతం రూ. 45,000 వరకు తగ్గింపు వోచర్లను పొందవచ్చు. బైక్‌వేల్ నివేదిక ప్రకారం.. వోచర్‌ను బైక్ ధరపై నేరుగా తగ్గింపుగా ఉపయోగించవచ్చు. ఈ ఆఫర్ 28 ఫిబ్రవరి 2025 వరకు మాత్రమే చెల్లుతుంది. ఈ విషయాన్ని కవాసాకి సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
మీరు కవాసకి నింజా 650 బైక్ కొనాలని ఆలోచిస్తుంటే ఇదే మంచి అవకాశం. మీకు సమీపంలోని కవాసకి డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా మీరు ఈ అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు.
సంబంధిత కథనం