Kawasaki Ninja 1100 : దుమ్మురేపేందుకు స్టైలిష్ లుక్‌లో వస్తున్న కవాసాకి నింజా 1100.. అక్టోబర్ 1న లాంచ్!-kawasaki ninja 1100 may launch on october 1st in india know complete details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kawasaki Ninja 1100 : దుమ్మురేపేందుకు స్టైలిష్ లుక్‌లో వస్తున్న కవాసాకి నింజా 1100.. అక్టోబర్ 1న లాంచ్!

Kawasaki Ninja 1100 : దుమ్మురేపేందుకు స్టైలిష్ లుక్‌లో వస్తున్న కవాసాకి నింజా 1100.. అక్టోబర్ 1న లాంచ్!

Anand Sai HT Telugu
Sep 26, 2024 11:00 AM IST

Kawasaki Ninja 1100 : స్పోర్ట్స్ మోటార్ సైకిల్ మేకర్ కవాసాకి తన కొత్త మోటార్ సైకిల్‌ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అక్టోబర్ 1న ఈ బైక్ లాంచ్ కానుంది. నింజా 1100 మోటార్ సైకిల్ కావచ్చని భావిస్తున్నారు.

కవాసాకి నింజా 1100
కవాసాకి నింజా 1100

స్పోర్ట్స్ మోటార్ సైకిల్ తయారీ కంపెనీ కవాసాకి కొత్త మోటార్ సైకిల్‌ను విడుదల చేయనుంది. అక్టోబర్ 1న బైక్‌ను లాంచ్ చేయనుందని సమాచారం. నింజా 1100 మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ మోటార్ సైకిల్ కు సంబంధించిన కొన్ని వివరాలు కూడా బయటకు వచ్చాయి. కవాసాకి నింజా 1000 బైకును కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో భారత వెబ్ సైట్ నుంచి తొలగించింది. ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ స్థానంలో నింజా 1100 రానుంది.

నివేదికల ప్రకారం, ఈ మోటార్ సైకిల్ డిజైన్ ప్రస్తుత కవాసాకి నింజా 1000 మోడల్‌ను పోలి ఉంటుంది. అలాగే దీని ఎత్తు, పొడవు, వీల్ బేస్, బరువు కూడా దాదాపు దానికి సమానంగా ఉంటాయి. ఇందులో కంపెనీ కొన్ని మార్పులు చేయవచ్చు. తద్వారా కొత్త లుక్‌లో కనిపించనుంది ఈ స్పోర్ట్స్ బైక్. అలాగే పాత మోడల్ కంటే భిన్నంగా కనిపిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఎల్సిడి కన్సోల్‌ను కూడా ఈ మోటార్ సైకిల్ పొందే అవకాశం ఉంది. అదే సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా అందించవచ్చు. పాత మోడల్‌లో అది లేదు.

కవాసాకి నింజా 1100లో ఉన్న ఇంజన్ గురించి చూసినట్టైతే.. ఇది 1099 సీసీ, ఇన్లైన్, 4-సిలిండర్ ఇంజిన్‌ను పొందుతుంది. ప్రస్తుత 1043 సీసీ సామర్థ్యం గల ఇంజన్‌ను భర్తీ చేస్తుంది. దీని పవర్ అవుట్‌పుట్ ఇప్పటికే 142 బిహెచ్‌పీ నుండి 135 బిహెచ్‌పీలకు పడిపోయింది. టార్క్ 111 ఎన్ఎమ్ నుండి 113 ఎన్ఎమ్‌కు కొద్దిగా పెరుగుతుంది. కొత్త మోటార్ సైకిల్ కొంచెం పెద్ద స్ప్రాకెట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది యాక్సిలరేషన్‌లో కొద్దిగా మెరుగుదలతో వస్తుంది. అయితే భారత మార్కెట్‌లో నింజా 1100 ఎక్స్-షోరూమ్ ధర రూ .12.19 లక్షలకు దగ్గరగా ఉండే అవకాశం ఉంది.

కంపెనీ ఈ ఏడాది జూన్‌లో కొత్త నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్‌ను లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధరను రూ.9.10 లక్షలుగా నిర్ణయించారు. కొత్త కవాసాకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ నాలుగు సిలిండర్ల మోటార్లను కలిగి ఉంది. కొత్త నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్.. నింజా జెడ్ఎక్స్-4ఆర్ కంటే అప్‌గ్రేడ్‌తో వచ్చింది. పూర్తి సీబీయూ యూనిట్‌గా పరిమితంగానే వీటిని భారత్‌కు తీసుకువస్తున్నారు. ఇది 399 సిసి లిక్విడ్-కూల్డ్, ఇన్-లైన్ 4-సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. 14,500 ఆర్పీఎమ్ వద్ద 76 బిహెచ్పీ శక్తిని, 37.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో ర్యామ్, ఎయిర్ ఇన్ టేక్ కూడా ఉన్నాయి. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది.

టాపిక్