ర్ణాటక ప్రభుత్వానికి చెందిన కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్‌కు ప్రముఖ నటి తమన్నా భాటియా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేఎస్‌డీఎల్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా భాటియా 2 సంవత్సరాల 2 రోజుల కాలానికి రూ.6.20 కోట్లు చెల్లిస్తున్నారు.
ఇక మైసూర్ శాండల్ సోప్ ప్రచారంలో కూడా తమన్నా భాగం కానుంది. కర్ణాటక ప్రభుత్వం మైసూర్ శాండల్ సబ్బు అమ్మకాలను పెద్ద ఎత్తున పెంచాలని భావిస్తోంది. దీని కోసం ప్రస్తుతం జాతీయ స్థాయిలో పేరు ఉన్న తమన్నా భాటియాను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకువచ్చింది.
అంతకుముందు మహేంద్ర సింగ్ ధోని 2006లో మొదటి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. కానీ కేఎస్‌డీఎల్ డిసెంబర్ 2007లో అతని ఒప్పందాన్ని రద్దు చేసింది. ప్రమోషన్ కోసం అంగీకరించిన సమయం ఇవ్వడం లేదని పేర్కొంది. దీనికి ధోనికి పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేసింది. కానీ ధోని 2012లో న్యాయ పోరాటంలో గెలిచాడు.
గతంలో 23 దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేసే కేఎస్‌డీఎల్.. ఇప్పుడు 80 దేశాలకు విస్తరించింది. మార్చి 2026 నాటికి ఈ దేశాలలో అమ్మకాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రత్యేకమైన సువాసనకు పేరుగాంచిన మైసూర్ శాండల్ సబ్బును మొదట 1918లో ప్రారంభించారు. ఈ బ్రాండ్ ఇప్పటికే వంద సంవత్సరాలు దాటింది. కేఎస్‌డీఎల్ దాని ఉత్పత్తులలో స్వచ్ఛమైన గంధపు నూనెను ఉపయోగించడంలో ప్రసిద్ధి చెందింది. సబ్బులు, సౌందర్య సాధనాలు, అగరుబత్తులు వంటి ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఇప్పటికే లాభాల్లో ఉన్న ఆ కంపెనీ ఇప్పుడు ఆదాయాన్ని పెంచుకోవడానికి దూకుడు మార్కెటింగ్ వ్యూహాలను ఆశ్రయించింది.
ఇప్పుడు మార్కెట్ 80 దేశాలకు విస్తరించింది. కొత్త సువాసనలతో కూడిన వివిధ రకాల సబ్బులతో సహా 19 కొత్త ఉత్పత్తులు ఈ సంస్థ నుంచి ఉన్నాయి. భారీ లాభాలు తెచ్చేలా కర్ణాటక ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. తమన్నా భాటియా బ్రాండ్ అంబాసిడర్‌గా మరింత అమ్మకాలు పెరుగుతాయని భావిస్తోంది.
అయితే చాలా మంది కన్నడిగులు మాత్రం తమన్నాను బ్రాండ్ అంబాసిడర్‌దా నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. శాండల్ వుడ్ ఇండస్ట్రీలో ఇందుకోసం ఎవరు లేరా? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు స్థానికంగా లభించే, ఉత్పత్తి చేసే వస్తువుల కోసం స్థానిక కళాకారులను ప్రోత్సహించడం లేదని విమర్శించారు. అసలు ఆమెకు కన్నడ తెలుసా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
అయితే మైసూర్ శాండల్ సబ్బు ప్రజాదరణ పొందిన కారణంగా కర్ణాటకలో దీనికి ఎటువంటి ప్రకటనలు లేదా ప్రముఖ ముఖాలు అవసరం లేదని కొందరు చెప్పుకొచ్చారు. బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నాను ఎంపిక చేసుకోవాలనే ప్రభుత్వం నిర్ణయం బయట రాష్ట్రాల్లో మార్కెట్ చేయడమేనని చెబుతున్నారు.
టాపిక్