Kalki 2898 AD : కల్కి చూశారా? మరి ఈ నాలుగు విషయాలను గుర్తించారా?
Kalki 2898 AD : కల్కి 2898 ఏడీ సినిమాను మీరు చూశారా? ఈ సినిమాలో కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. మరి ఈ నాలుగు విషయాలను గుర్తించారా?
పర్సనల్ ఫైనాన్స్, స్టాక్ మర్కెట్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇటీవలి కాలంలో ప్రజలు ఆసక్తి విపరీతంగా పెరుగుతోంది. ఫైనాన్షియల్స్ని పెంచుకునేందుకు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇండియన్ సినిమాలో అతిపెద్ద విషయంగా ఉన్న ప్రభాస్ కల్కి 2898 ఏడీలోని క్యారెక్టర్స్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆర్థికపరమైన సూత్రాలు, విషయాలను ఇక్కడ చూసేయండి..

భైరవ- ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ లాంటి వాడు..!
కల్కి 2898 ఏడీలో భైరవగా కనిపించాడు ప్రభాస్. అతనొక బౌంటీ హంటర్. క్రెడిట్స్‌ని సంపాదించడం కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడతాడు. ఆ క్రెడిట్స్‌తో ధనవంతులు ఉండే 'కాంప్లెక్స్'కి వెళ్లాలన్నది భైరవ ఉద్దేశం.
భైరవ ఒక మల్టీటాలెంటెడ్ వ్యక్తి. ఒక రోబోను సొంతంగా క్రియేట్ చేసుకుంటాడు. తన గోల్‌ని సాధించుకునేందుకు ఎంత దూరమైన వెళతాడు.
ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కూడా ఇలాంటివే! భైరవలాగే, ఈ తరహా మ్యూచువల్ ఫండ్స్ కూడా అవకాశం కోసం ఎదురుచూస్తుంటాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో సంబంధం లేదు. ఈ తరహ ఫండ్స్ ద్వారా మనకి ఎక్కువ రిటర్నులు వస్తాయి.
సుమతి- స్మాల్ క్యాప్స్‌కి ఉదాహరణ..!
కల్కి 2898 ఏడీలో దీపిక పదుకొణె నటించిన క్యారెక్టర్ పేరు సుమతి. ఆమె ప్రెగ్నెంట్. ఆమె కడుపులో దేవుడు ఉన్నాడని, మానవజాతిని ఆ బిడ్డ రక్షిస్తుందన్నది నమ్మకం. స్మాల్ క్యాప్ ఫండ్స్ కూడా ఇంతే!
ఏదో ఒక రోజు.. లార్జ్ క్యాంప్‌ని ఢీకొట్టేందుకు స్మాల్ క్యాప్ పనికొస్తుందనేది ఇన్వెస్టర్ల నమ్మకం. ఇందులోని గ్రోత్.. పెట్టుబడిదారులను అట్రాక్ట్ చేస్తుంది.
అయితే.. స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోని రిస్క్‌ని ముందే తెలుసుకోవాలి. అప్పుడే రక్షకుడు మనల్ని రక్షిస్తాడు!
అశ్వద్ధామ- లార్జ్ క్యాప్ ఫండ్స్..
కల్కి 2898 ఏడీలో అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. సమతికి రక్షకుడిగా, భైరవతో పెద్ద యుద్ధమే చేస్తాడు అశ్వద్ధామ. ప్రపంచానికి రక్షకుడు ఎప్పుడు కావాలో, అప్పటివరకు ఎదురుచూసి తన పని మొదలుపెడతాడు.
లార్జ్ క్యాప్స్ పని కూడా ఇదే! మనం కోరుకునే టార్గెట్స్ నెరవేరాలంటే, వాటి మీద మనకు నమ్మకం కలగాలంటే, లార్జ్ క్యాప్స్పైనే ఫోకస్ చేయాలి. వాటికి ఉన్న సహనం అంతా ఇంతా కాదు. కానీ ఒక్కసారి అనుకున్నట్టు జరిగితే.. మంచి సంపదను సృష్టించుకోవచ్చు.
కాంప్లెక్స్- ఇది మీ రిటైర్మెంట్ టార్గెట్!
కల్కి 2898 ఏడీలో కాంప్లెక్స్‌కి వెళ్లేందుకు భైరవ చాలా సాహసం చేస్తాడు. తన పర్సనల్ గోల్స్‌ని నెరవేర్చుకునేందుకు ఎంతైనా కష్టపడాడు. కాంప్లెక్స్‌లో సుఖంగా ఉండొచ్చు అనే ఇదంతా చేస్తాడు.
మనం కూడా ఇంతే! భవిష్యత్తులో సంతోషంగా ఉండాలని, రిటైర్మెంట్ ప్లాన్స్ వేస్తాము. అందుకు తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము. వాస్తవానికి మనందరం ఈ విషయంలో భైరవలాగే ఉండాలి. మన భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవలి.
- మనిషా లేఖి, ఫిల్మ్ క్రిటిక్
(గమనిక:- ఇవి రచయిత అభిప్రాయాలు మాత్రమే. హెచ్‌టీ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం