JioHotstar : జియోహాట్‌స్టార్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ లాంచ్- ఇక డబుల్ ఎంటర్టైన్మెంట్!
JioHotstar launch : జియోసినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌ని విలీనం చేస్తూ జియోహాట్స్టార్ని ప్రారంభించింది జియోస్టార్. ఇందులో 50 కోట్ల మంది వినియోగదారులు, 3 లక్షల గంటల కంటెంట్ ఉంటుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

జియోస్టార్ తన కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ "జియోహాట్‌స్టార్"ని లాంచ్ చేసింది. ఫలితంగా.. రెండు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ జియోసినిమా- డిస్నీ + హాట్స్టార్లు విలీనమైపోయాయి. 50 కోట్లకు పైగా యూజర్ బేస్, 3 లక్షల గంటలకు పైగా కంటెంట్‌తో ఈ కొత్త ప్లాట్‌ఫామ్.. భారత మార్కెట్లోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్‌గా నిలిచింది.
జియోహాట్‌స్టార్ ఫీచర్స్..
ఒరిజినల్ కంటెంట్‌తో పాటు డిస్నీ, ఎన్బీసీ యూనివర్సల్ పీకాక్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హెచ్‌బీ ఓ, పారామౌంట్ వంటి సంస్థల నుంచి అంతర్జాతీయ కంటెంట్‌కి కూడా ఈ కొత్త జియోహాట్‌స్టార్ నిలయంగా ఉంటుంది.
మరోవైపు ఈ జియోహాట్‌స్టార్‌లో క్రికెట్ స్ట్రీమింగ్కి అత్యధిక ప్రాధాన్యత లభించనుంది. అనేక ప్రధాన ఐసీసీ ఈవెంట్లు, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్, ఇతర దేశవాళీ టోర్నమెంట్లను ప్రేక్షకులు ఇందులో చూడవచ్చు. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్, వింబుల్డన్, ప్రో కబడ్డీ లీగ్, ఐఎస్ఎల్ సహా ఇతర క్రీడా ఈవెంట్లు కూడా ఈ జియోహాట్‌స్టార్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి.
కొత్త స్ట్రీమింగ్ యాప్‌లో అల్ట్రా హెచ్డీ 4కే స్ట్రీమింగ్, మల్టీ యాంగిల్ వ్యూయింగ్, ఏఐ ఆధారిత ఇన్సైట్స్, రియల్ టైమ్ స్టాట్స్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.
జియోహాట్‌స్టార్ ప్రైజింగ్..
జియోహాట్స్టార్ని ఫ్రీగా కూడా చూడవచ్చు. అయితే ఇందులో యాడ్స్ ప్లే అవుతాయి. పెయిడ్ వర్షెన్స్లోని కొన్ని కంటెంట్స్ చూడలేకపోవచ్చు. పెయిడ్ ప్లాన్లు రూ .149 నుంచి ప్రారంభమవుతాయి. మూడు నెలలకు రూ. 499 ప్లాన్ కూడా ఉంది. డిస్నీ+హాట్‌స్టర్, జియోసినిమా రెండింటి ప్రస్తుత యూజర్లు కొత్త ప్లాట్‌ఫామ్‌కి మైగ్రేట్ అవుతారు.
గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో డిస్నీ+హాట్‌స్టార్ యాప్ ఇప్పటికే కొత్త లోగోతో జియోహాట్‌స్టార్ పేరుకు ఇప్పటికే మారిపోవడం గమనార్హం. ప్రస్తుతానికైతే ఈ కొత్త యాప్.. డిస్నీ + హాట్‌స్టార్ యూజర్ ఇంటర్ఫేస్నే కలిగి ఉంది. కానీ భవిష్యత్తులో ఇది మారవచ్చు. Hotstar.com వెబ్‌సైట్‌ని సందర్శించినప్పుడు, జియోసినిమా నుంచి కంటెంట్ ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉందనే సందేశంతో యూజర్కు స్వాగతం పలుకుతోంది.
జియోసినిమా - డిస్నీ+ హాట్‌స్టార్ విలీనం:
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసఐ), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గత ఏడాది ఆగస్టులో డిస్నీ- రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య విలీనానికి ఆమోదం తెలిపాయి.
ఈ మర్జర్లో రిలయన్స్‌కి ప్రత్యక్షంగా 16 శాతం, వయాకామ్ 18 మీడియా వ్యాపారం ద్వారా 47 శాతం వాటా దక్కించింది. డిస్నీకి 37 శాతం వాటా ఉంది.
సంబంధిత కథనం