JioHotstar plans: ఇవే జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్; మీకు ఏది సూట్ అవుతుందో చూడండి..
JioHotstar plans: కొత్త జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ కు సంబంధించిన వివిధ ప్లాన్స్, ఆ ప్లాన్స్ ధరలు, ప్రయోజనాలు, తదితర వివరాలను సమగ్రంగా ఇక్కడ చూడండి.

JioHotstar plans: రీ బ్రాండింగ్ తరువాత జియో-హాట్ స్టార్ లో ఇప్పుడు డిస్నీ + హాట్ స్టార్, జియోసినిమా రెండింటి నుండి కంటెంట్ లభిస్తుంది. డిస్నీ + హాట్ స్టార్ యాప్ ఇప్పుడు జియో హాట్ స్టార్ యాప్ గా మారింది. జియోసినిమా కూడా దీనికి రీ డైరెక్ట్ అవుతుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ లలో అందుబాటులో ఉన్న ఈ యాప్ ను వెబ్ సైట్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. జియో హాట్ స్టార్ తో వినియోగదారులు డిస్నీ + హాట్ స్టార్, జియోసినిమా అనే రెండు ప్లాట్ ఫామ్ ల నుండి కంటెంట్ ను ఒకే చోట ఆస్వాదించవచ్చు. అందువల్ల ఇది చాలా మందికి మరింత ఆకర్షణీయమైన ఎంపికగా మారుతుంది.
జియో హాట్ స్టార్ కంటెంట్ ఏంటి?
జియో హాట్ స్టార్ లో డిస్నీ హాట్ స్టార్ స్పెషల్స్, హెచ్ బీఓ, పీకాక్, పారామౌంట్ ప్లస్, మార్వెల్, పిక్సర్, స్టార్ వార్స్, నేషనల్ జియోగ్రాఫిక్ సహా వివిధ సేవల కంటెంట్ లభిస్తుంది. ఇది డబ్బుకు మంచి విలువను అందించే కంటెంట్-రిచ్ సబ్స్క్రిప్షన్ గా మారుతుంది. జియో హాట్ స్టార్ లాంచ్ అయిన తరువాత చాలా మంది వినియోగదారుల్లో దీని ప్లాన్స్, వ్యాలిడిటీ, ధరలు.. తదితర విషయాలపై ఆనుమానాలు ప్రారంభమయ్యాయి. అయితే, ఇప్పటికే, డిస్నీ + హాట్ స్టార్, జియో సినిమా ల సబ్ స్క్రిప్షన్ ఉన్నవారు.. ఆయా సబ్ స్క్రిప్షన్ ల కాల వ్యవధి ముగిసే వరకు జియో హాట్ స్టార్ సేవలను ఉచితంగా పొందవచ్చు. అలాగే, ఇతరులు ఇప్పుడు కొత్తగా సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ యాక్టివ్ సబ్ స్క్రిప్షన్ లను తనిఖీ చేయడానికి, జియో హాట్ స్టార్ యాప్ లోకి లాగిన్ అవ్వండి. మై స్పేస్ విభాగానికి వెళ్లి, మీ యాక్టివ్ సబ్ స్క్రిప్షన్ లను వీక్షించడానికి ఎగువ ఎడమ మూలలో ఉన్న ప్లాన్ నేమ్ ఆప్షన్ మీద తట్టండి.
జియో హాట్ స్టార్ ప్లాన్స్
ప్రస్తుతం జియో హాట్ స్టార్ కోసం మూడు సబ్ స్క్రిప్షన్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.
- జియో హాట్ స్టార్ మొబైల్ ప్లాన్ అనేది బేసిక్ ప్లాన్. ఇది మొబైల్ డివైజెస్ కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మూడు నెలలకు రూ.149 ఖరీదు చేసే ఈ ప్లాన్ ను కేవలం ఒక డివైజ్ లో మాత్రమే వాడుకోవచ్చు. ఏడాది వెర్షన్ కూడా రూ.499కే లభిస్తుంది.
- జియో హాట్ స్టార్ సూపర్ ప్లాన్ ధర మూడు నెలలకు రూ.299 లేదా ఏడాదికి రూ.899. ఇది ఒకేసారి రెండు పరికరాలలో స్ట్రీమింగ్ ను అనుమతిస్తుంది. దీని ద్వారా జియో హాట్ స్టార్ కంటెంట్ ను మొబైల్, వెబ్, టీవీ ల్లో ఏదేని రెండు డివైజెస్ లో యాక్సెస్ చేయవచ్చు.
- జియో హాట్ స్టార్ ప్రీమియం ప్లాన్ ధర నెలకు రూ.299. మూడు నెలలకు రూ.499, ఏడాదికి రూ.1,499. ఇది ఒకేసారి నాలుగు పరికరాలలో స్ట్రీమింగ్ ను సపోర్ట్ చేస్తుంది. క్రీడలు, లైవ్ మ్యాచ్ ల వంటి లైవ్ కంటెంట్ మినహా యాడ్-ఫ్రీ అనుభవాన్ని అందిస్తుంది.
సంబంధిత కథనం