Jio news: ఇక ఆ జియో యూజర్లకు యూట్యూబ్ ప్రీమియం ఫ్రీ-jioairfiber and jiofiber users to enjoy youtube premium at no extra cost ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jio News: ఇక ఆ జియో యూజర్లకు యూట్యూబ్ ప్రీమియం ఫ్రీ

Jio news: ఇక ఆ జియో యూజర్లకు యూట్యూబ్ ప్రీమియం ఫ్రీ

Sudarshan V HT Telugu

Free YouTube Premium: జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు గుడ్ న్యూస్. వారు ఇకపై ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా యూట్యూబ్ ప్రీమియమ్ సేవలను పొందవచ్చు. ఈ సేవలను వారు ఈ రోజు, అంటే జనవరి 11, 2025 నుంచే పొందవచ్చు.

యూట్యూబ్ ప్రీమియం ఫ్రీ

Free YouTube Premium to Jio users: 2025 జనవరి 11 నుండి, రిలయన్స్ జియో తన జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన ఆఫర్ ను అందిస్తోంది. ఇందులో భాగంగా అర్హులైన వినియోగదారులు 24 నెలల పాటు యూట్యూబ్ ప్రీమియమ్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్రయోజనాలను పొందుతారు. జియో, యూట్యూబ్ మధ్య కుదిరిన ఈ ముఖ్యమైన భాగస్వామ్యం, భారతదేశ వ్యాప్తంగా ఉన్న సబ్‌స్క్రైబర్ల కోసం డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడింది.

యూట్యూబ్ ప్రీమియమ్ ప్రత్యేకతలు

యూట్యూబ్ ప్రీమియమ్ ద్వారా జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఈ కింది ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు.

1. అడ్వర్టైజెంట్ బ్రేక్ లేకుండా వీక్షణ: ఇష్టమైన వీడియోలను, సినిమాలను ఎలాంటి యాడ్ బ్రేక్స్ లేకుండా, నిరంతరాయంగా చూడవచ్చు.

2. ఆఫ్ లైన్ వీడియోలు: ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఎప్పుడైనా ఆస్వాదించడానికి కంటెంట్‌ను ముందే డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం.

3. బ్యాక్‌గ్రౌండ్ ప్లే: ఇతర యాప్స్ ఉపయోగిస్తూనే వీడియోలు చూడవచ్చు. లేదా స్క్రీన్ ఆఫ్ అయినప్పటికీ సంగీతం వినవచ్చు.

4. యూట్యూబ్ మ్యూజిక్ (music) ప్రీమియమ్: 100 మిలియన్ల కంటే ఎక్కువ పాటల అడ్-ఫ్రీ లైబ్రరీ, వ్యక్తిగత ప్లే లిస్ట్‌లు, గ్లోబల్ చార్ట్-టాపర్లను హ్యాప్పీగా ఆస్వాదించవచ్చు.

అర్హత గల ప్లాన్లు

ఈ ఆఫర్ జియో (Reliance Jio) ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఆ ఆఫర్ పొందడానికి జియో (jio) ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు రూ. 888, రూ. 1199, రూ. 1499, రూ. 2499, రూ. 3499 ల్లో ఏదైనా ప్లాన్ కు సబ్ స్క్రైబ్ చేసి ఉండాలి.

యూట్యూబ్ ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్‌ని ఎలా యాక్టివేట్ చేయాలి?

యూట్యూబ్ ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్‌ని యాక్టివేట్ చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.

1. ముందుగా మీరు యూట్యూబ్ ప్రీమియం ను ఫ్రీగా పొందే అర్హత గల ప్లాన్‌కు సబ్ స్క్రిప్షన్ ఉందో లేదో చెక్ చేసుకోండి.

2. మై జియో యాప్‌లో మీ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి.

3. పేజీలో కనిపించే యూట్యూబ్ (youtube) ప్రీమియమ్ బ్యానర్‌పై క్లిక్ చేయండి.

4. మీ యూట్యూబ్ ఖాతాతో లాగిన్ అవ్వండి. లేదా కొత్త అకౌంట్ ను క్రియేట్ చేయండి.

5. అదే వివరాలతో జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ సెట్ టాప్ బాక్స్‌లో లాగిన్ అవ్వండి. యాడ్-ఫ్రీ కంటెంట్‌ను ఆస్వాదించండి.

మరింత సమాచారం కోసం www.jio.com ని సందర్శించండి.