Jio exclusive offer : ఐపీఎల్​ లైవ్​ స్ట్రీమింగ్​ ఫ్రీ- జియో కొత్త ఆఫర్​తో క్రికెట్​ లవర్స్​కి పండగే..-jio sim exclusive offer jiohotstar 4k cricket streaming jiofibre details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jio Exclusive Offer : ఐపీఎల్​ లైవ్​ స్ట్రీమింగ్​ ఫ్రీ- జియో కొత్త ఆఫర్​తో క్రికెట్​ లవర్స్​కి పండగే..

Jio exclusive offer : ఐపీఎల్​ లైవ్​ స్ట్రీమింగ్​ ఫ్రీ- జియో కొత్త ఆఫర్​తో క్రికెట్​ లవర్స్​కి పండగే..

Sharath Chitturi HT Telugu

Jio sim offer : ఐపీఎల్​ సీజన్​కి ముందు క్రికెట్​ లవర్స్​కి క్రేజీ ఆఫర్​ని తీసుకొచ్చింది రిలయన్స్​ జియో! ఈ ఆఫర్​తో ఐపీఎల్​ని ఉచితంగానే లైవ్​స్ట్రీమ్​ చూడవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..

జియో సిమ్​తో ఒక కస్టమర్​.. (Bloomberg)

ఐపీఎల్ 18వ​ సీజన్​కి ముందు క్రేజీ ఆఫర్​ని ప్రకటించింది రిలయన్స్​ జియో. ఈ ప్రత్యేక ఆఫర్​లో భాగంగా జియో కస్టమర్లు.. టీవీ/ ఫోన్​లో 90 రోజుల ఉచిత జియో హాట్​స్టార్, క్రికెట్ మ్యాచ్​ల 4కే స్ట్రీమింగ్, జియో ఫైబర్ / ఎయిర్​ఫైబర్​కు 50 రోజుల ఉచిత కనెక్షన్​ని పొందవచ్చు.

జియో సిమ్ కార్డు పాత, కొత్త కస్టమర్లకు ఈ కొత్త ఎక్స్​క్లూజివ్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని టెలికాం దిగ్గజం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. రూ.299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్​తో రీఛార్జ్ చేసుకుంటే చాలు ఈ క్రేజీ బెనిఫిట్స్ పొందొచ్చు. ఈ నేపథ్యంలో జియో లేటెస్ట్​ ఆఫర్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

జియో కస్టమర్స్​ 'అన్​లిమిటెడ్ ఆఫర్'ను ఎలా పొందవచ్చు:

  • జియో సిమ్ కొత్తగా తీసుకుంటున్న వారు లేదా ఇప్పటికే వినియోగిస్తున్న వారు "మునుపెన్నడూ లేని విధంగా అల్టిమేట్​ క్రికెట్ సీజన్​ని ఎక్స్​పీరియెన్స్​ చేసేందుకు " రూ .299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్​తో రీఛార్జ్ చేయాలి.
  • రీఛార్జ్ లేదా కొత్త సిమ్ కొనుగోలు మార్చ్​ 17 నుంచి మార్చి 31, 2025 మధ్య చేయాలి.
  • మార్చ్​ 17కి ముందు రీఛార్జ్ చేసుకున్న ప్రస్తుత జియో సిమ్ కస్టమర్లు రూ.100 యాడ్-ఆన్ ప్యాక్​ని ఎంచుకోవచ్చు.

జియో కస్టమర్స్ ఎక్స్​క్లూజివ్ ఆఫర్​లో ఏం పొందుతారు?

  • 4కేలో టీవీ/ మొబైల్​పై 90 రోజుల ఉచిత జియోహోట్ స్టార్: వినియోగదారులు ఈ సీజన్​లోని ప్రతి క్రికెట్ మ్యాచ్​ను తమ హోమ్ టెలివిజన్ లేదా మొబైల్ ఫోన్​లో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 4కేలో వీక్షించవచ్చు.
  • ఇళ్లకు 50 రోజుల ఉచిత జియో ఫైబర్ లేదా ఎయిర్​ఫైబర్ ట్రయల్ కనెక్షన్: వినియోగదారులు "అల్ట్రా-ఫాస్ట్ ఇంటర్నెట్, 4కేలో నిజంగా అద్భుతమైన క్రికెట్ ఎక్స్​పీరియన్స్​ కోసం ఉత్తమ హోమ్ ఎంటర్​టైన్మెంట్" పొందవచ్చు. 50 రోజుల ఉచిత జియో ఫైబర్ ట్రయల్​లో 800కు పైగా ఛానళ్లు, 11కి పైగా ఓటీటీ యాప్స్, అన్​లిమిటెడ్ వైఫై వంటి ఫీచర్లు ఉన్నాయి.
  • జియో హాట్​స్టార్​ ప్యాక్ 2025 మార్చ్​ 22 నుంచి (క్రికెట్ సీజన్ ప్రారంభ మ్యాచ్ రోజు) 90 రోజుల కాలానికి యాక్టివేట్ అవుతుంది.
  • కస్టమర్లు 60008-60008 నంబర్​కు మిస్డ్ కాల్ ఇచ్చి ఆఫర్ ప్రయోజనాలను తెలుసుకోవచ్చు. jio.com లేదా సమీపంలోని జియో స్టోర్​కి కూడా వెళ్లాలి.

ఐపీఎల్ 2025 సీజన్​..

మార్చ్​ 22న కోల్​కతా నైట్​రైడర్స్​ వర్సెస్​ రాయల్​ ఛాలెంజర్స బెంగళూరు మ్యాచ్​తో ఐపీఎల్​ 18 సీజన్​ ప్రారంభంకానుంది. ఇండియాలో ఐపీఎల్​కి ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. సరిగ్గా ఈ సమయంలో, జియో ఇలాంటి ఎక్స్​క్లూజివ్​ ఆఫర్​ని తీసుకురావడంతో క్రికెట్​ లవర్స్​కి పండగే అని చెప్పుకోవాలి.

మెగా మర్జర్​ అనంతరం జియో సినిమా- డిస్నీ హాట్​స్టర్​లు గత నెలలో ఒకే వేదికపైకి వచ్చిన విషయం తెలిసిందే.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం