Free JioHotstar: ఉచితంగా జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్; కానీ, వీరికి మాత్రమే..!-jio offering free jio hotstar subscription to select users check your eligibility for seamless streaming ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Free Jiohotstar: ఉచితంగా జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్; కానీ, వీరికి మాత్రమే..!

Free JioHotstar: ఉచితంగా జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్; కానీ, వీరికి మాత్రమే..!

Sudarshan V HT Telugu
Published Feb 14, 2025 06:35 PM IST

Free JioHotstar: జియో తన జియో హాట్ స్టార్ ఓటీటీ సేవలను ప్రారంభించింది. ముందుగా, కొంతమంది ఎంపిక చేసిన వినియోగదారులకు జియో హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్ ను అందిస్తోంది. ఆ లిస్ట్ లో మీరు ఉన్నారో లేదో తెలుసుకోండి.

ఉచితంగా జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్
ఉచితంగా జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ (JioHotstar)

Free JioHotstar: హాట్ స్టార్ తో విలీనం తర్వాత జియో అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో హాట్ స్టార్ ఓటీటీ సేవలను ప్రారంభించింది. కంపెనీ అధికారిక వెబ్సైట్ కూడా ప్రారంభమైంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్, స్మార్ట్ టీవీలతో సహా అనేక ప్లాట్ ఫామ్ లలో తన యాప్ ను రీబ్రాండ్ చేసింది. రీబ్రాండింగ్ తో పాటు, జియో హాట్ స్టార్ కోసం సబ్స్క్రిప్షన్ ప్లాన్లను కూా జియో ఆవిష్కరించింది. వీటిని జియో హాట్ స్టార్ అధికారిక వెబ్సైట్ లో చెక్ చేయవచ్చు. అయితే, కొంతమంది అదృష్టవంతులైన వినియోగదారులు జియో హాట్ స్టార్ కు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ పొందారు.

కాంప్లిమెంటరీ జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఎవరికి?

జియో హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్ పొందడానికి కొందరు ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అవకాశం లభిస్తుంది. వారు ఎవరంటే..

  • యాక్టివ్ డిస్నీ+ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్: మీకు ప్రస్తుతం యాక్టివ్ డిస్నీ+ హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంటే, మీరు ఆటోమేటిక్ గా జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ను అందుకుంటారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ ప్రస్తుత డిస్నీ + హాట్ స్టార్ ప్లాన్ లోని మిగిలిన రోజులు మాత్రమే మీకు జియో హాట్ స్టార్ లభిస్తుంది.
  • యాక్టివ్ జియోసినిమా సబ్ స్క్రిప్షన్: డిస్నీ+ హాట్ స్టార్ మాదిరిగానే, యాక్టివ్ జియోసినిమా సబ్ స్క్రిప్షన్ ఉన్న వినియోగదారులు ఆటోమేటిక్ గా జియో హాట్ స్టార్ కు మైగ్రేట్ అవుతారు. వారికి కూడా ప్రస్తుత జియో సినిమా వ్యాలిడిటీ ఎన్ని రోజులు మిగిలి ఉందో అన్ని రోజులు జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ కొనసాగుతుంది.
  • మొబైల్ లేదా బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ లతో సబ్ స్క్రిప్షన్: మొబైల్ లేదా బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లలో భాగంగా డిస్నీ + హాట్ స్టార్ లేదా జియోసినిమా ప్రీమియం ఉన్న వినియోగదారులు కూడా జియో హాట్ స్టార్ కు యాక్సెస్ పొందుతారు.

మీ జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ కు ఇలా చెక్ చేసుకోండి?

మీరు కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కు అర్హత పొందారో లేదో తెలుసుకోవడానికి, మీ ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ చిరునామాను ఉపయోగించి జియో హాట్ స్టార్ యాప్ లోకి లాగిన్ అవ్వండి. మీకు యాక్టివ్ సబ్ స్క్రిప్షన్ ఉంటే, మీ ప్లాన్ చెల్లుబాటు అయ్యే వరకు ఖచ్చితమైన తేదీని యాప్ మీకు తెలియజేస్తుంది.

జియోసినిమా ఆటోపే క్యాన్సిలేషన్

మరో ముఖ్యమైన అప్ డేట్ ను వినియోగదారులు గమనించాలి. జియో తన ఆటోపే ఫీచర్ ను ఇప్పటికే ఉన్న జియో సినిమా సబ్ స్క్రిప్షన్ ప్లాన్ లకు నిలిపివేస్తోంది. అంటే వినియోగదారులు తమ ప్రస్తుత ప్లాన్ గడువు ముగిసిన తర్వాత ఇకపై జియో సినిమా కోసం ఆటోమేటిక్ గా ఛార్జీలు వసూలు చేయరు. ప్లాట్ఫామ్ లో కంటెంట్ ను ఆస్వాదించడాన్ని కొనసాగించడానికి, వినియోగదారులు మళ్లీ జియో హాట్ స్టార్ కు సబ్ స్కైబ్ చేయాల్సి ఉంటుంది.

Sudarshan V

eMail
He has experience and expertise in national and international politics and global scenarios. He is interested in political, economic, social, automotive and technological developments. He has been associated with Hindustan Times digital media since 3 years. Earlier, He has worked with Telugu leading dailies like Eenadu and Sakshi in various editorial positions.
Whats_app_banner

సంబంధిత కథనం