JIOPHONE PRIMA: మార్కెట్లోకి జియో ఫోన్ ప్రైమా.. ఆధునిక ఫీచర్స్ తో, అందుబాటు ధరలో..
JIOPHONE PRIMA: రిలయన్స్ జియో తాజాగా లేటెస్ట్ 4జీ మోడల్ ఫోన్ జియో ఫోన్ ప్రైమాను మార్కెట్లోకి విడుదల చేసింది.
అత్యాధునిక ఫీచర్లతో, అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ తో జియో ఫోన్ ప్రైమాను రూపొందించారు. ఇందులో 2.4 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది.
23 భాషలకు సపోర్ట్
జియో ఫోన్ ప్రైమాలో 1800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 23 భాషలను సపోర్ట్ చేస్తుంది. అన్ని రిలయన్స్ రిటైల్ స్టోర్స్, రిలయన్స్ ఆన్ లైన్ స్టోర్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఆమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్స్ నుంచి కూడా ఈ జియో ఫోన్ ప్రైమాను కొనుగోలు చేయవచ్చు. ఈ జియో ఫోన్ ప్రైమా 4జీ నెట్ వర్క్ తో పని చేసే కీ ప్యాడ్ స్మార్ట్ ఫోన్.
ధర ఎంతంటే?
ఈ జియో ఫోన్ ప్రైమా (JIOPHONE PRIMA) ధరను రూ. 2,599 గా నిర్ణయించారు. ఈ ఫోన్ లో యూట్యూబ్, ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. వీడియో కాలింగ్ కోసం డిజిటల్ కెమెరాను ఇందులో పొందుపర్చారు. అదనంగా ఇందులో జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, జియో పే (JioPay) జియో డిజిటల్ సర్వీసెస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఈ కీ ప్యాడ్ ఫోన్ తో స్మార్ట్ ఫోన్ అనుభవాన్ని పొందవచ్చు.
2జీ ముక్త్ భారత్..
భారత్ లో 2 జీ ఫోన్లకు ముగింపు పలికే లక్ష్యంతో ఈ ఫోన్ ను జియో తీసుకువచ్చింది. 2జీ ఫోన్ల ధరలోనే, అంతకుమించిన ఫీచర్స్ తో ఈ ఫోన్ లభిస్తుంది. అన్ని వర్గాలు సులభంగా ఉపయోగించేలా దీన్ని తీర్చి దిద్దారు. అద్భుతమైన రంగులతో సరికొత్త స్పేస్ డిజైన్, ఇది సౌకర్యవంతమైన గ్రిప్ తో సౌందర్యాన్ని మిళితం చేసే స్టైలిష్ మరియు ఎర్గోనామిక్ డిజైన్ తో ఈ ఫోన్ ను రూపొందించారు.
టాపిక్