JioMotive : 'జియోమోటివ్'​ లాంచ్​.. ఇక మీ కారు మరింత భద్రం- మరింత స్మార్ట్​!-jio launches affordable car accessory jiomotive check details ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Jio Launches Affordable Car Accessory, Jiomotive Check Details

JioMotive : 'జియోమోటివ్'​ లాంచ్​.. ఇక మీ కారు మరింత భద్రం- మరింత స్మార్ట్​!

Sharath Chitturi HT Telugu
Nov 05, 2023 01:45 PM IST

JioMotive : జియోమోటివ్​ పేరుతో ఓ కొత్త డివైజ్​ని లాంచ్​ చేసింది రిలయన్స్​ జియో. ఈ గ్యాడ్జెట్​.. మీ కారు భద్రతకు ఉపయోగపడుతుంది.

జియోమోటివ్​ లాంచ్​.. ఇక మీ కారు మరింత భద్రం- మరింత స్మార్ట్​!
జియోమోటివ్​ లాంచ్​.. ఇక మీ కారు మరింత భద్రం- మరింత స్మార్ట్​!

JioMotive 2023 : ఇండియాలో సరికొత్త డివైజ్​ని లాంచ్​ చేసింది రిలయన్స్​ జియో. దీని పోరు జియోమోటివ్ (2023)​. ఇదొక ప్లగ్​ అండ్​ ప్లే ఓబీడీ గ్యాడ్జెట్​. ఈ డివైజ్​తో కారు సేఫ్టీతో పాటు అనేక స్మార్ట్​ ఫీచర్స్​ని పొందొచ్చు. ఈ నేపథ్యంలో ఈ జియోమోటివ్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

జియోమోటివ్​ ఫీచర్స్​ ఇవే..

ఓబీడీ (ఆన్​- బోర్డ్​ డయగ్నాస్టిక్స్​)ను కారుకు ఫిక్స్​ చేస్తే, రియల్​-టైమ్​ పర్ఫార్మెన్స్​ డేటాతో పాటు ఎవైనా సమస్యలు ఉంటే.. వాటి గురించి వివరాలు తెలుస్తాయి. ఈ డేటాను ముందే తెలుసుకుంటే.. రిపైర్​ ఖర్చులు తగ్గించుకుని, మెయిన్​టేనెన్స్​ని పెంచుకోవచ్చు. ఫలితంగా కారు డ్రైవింగ్​ సాగిపోతుంది. జియోమోటివ్​ ఫీచర్స్​..

JioMotive device : రియల్​ టైమ్​ వెహికిల్​ ట్రాకింగ్​:- ఈ జియోమోటివ్​ని కారుకు కనెక్ట్​ చేస్తే, జియోథింగ్స్​ యాప్​ ద్వారా.. వెహికిల్​ని 24 గంటల పాటు ట్రక్​ చేసుకోవచ్చు.

వెహికిల్​ హెల్త్​ మానిటరింగ్​:- జియోమోటివ్​ డివైజ్​తో కారు హెల్త్​ని ట్రాక్​ చేయవచ్చు. 100కుపైగా డీటీసీ(డయగ్నాస్టిక్​ ట్రబుల్​ కోడ్స్​)కు అలర్ట్స్​ పొందొచ్చు. ఫలితంగా.. సమస్య పెద్దగా అయ్యే ముందే.. దానిని పసిగట్టొచ్చు.

What is JioMotive : డ్రైవింగ్​ బిహేవియర్​ ఎనాలసిస్​:- ఈ డివైడ్​తో డ్రైవర్​ డ్రైవింగ్​ బిహేవియర్​ని కూడా ఎనలైజ్​ చేయవచ్చు. ఫ్యూయెల్​ ఎఫీషియెన్సీ, హార్ష్​ డ్రైవింగ్​- బ్రేకింగ్​, హార్ష్​ యాక్సలరేషన్​ వంటి అంశాలపై అలర్ట్​ పొందొచ్చు. ఫలితంగా డ్రైవింగ్​ హాబిట్స్​ మెరుగుపరుచుకోవచ్చు.

ఇతర ఫీచర్స్​:- జియోమోటివ్​ ద్వారా.. ఇన్​ కార్​ వైఫై, టోయింగ్​, టాంపరింగ్​, యాక్సిడెంట్​ అలర్ట్స్​, స్పీడ్​ ట్రాకింగ్​, 10 సెకెండ్​ లేటెన్సీ వంటి ఫీచర్స్​ కూడా పొందొచ్చు.

జియోమోటివ్​ (2023) ధర ఎంతంటే..

JioMotive price in India : ఇండియాలో ఈ జియోమోటివ్​ ధర రూ. 4,999గా ఉంది. అమెజాన్​, రిలయన్స్​ డిజిటల్​, జియో.కామ్​ సైట్స్​ ద్వారా ఈ డివైజ్​ని కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మోడల్​ సేల్​ ఇప్పటికే మొదలైంది. ఇది కారుకు చాలా ఉపయోగపడుతుందని ఈ డివైజ్​ కొన్నవారందరు చెబుతున్నారు.

జియో వరల్డ్ ప్లాజా ప్రారంభం..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముంబైలో విలాసవంతమైన జియో వరల్డ్ ప్లాజాని ఇటీవలే ఆవిష్కరించింది. ముంబై నడిబొడ్డున బాంద్రా-కుర్లా కాంప్లెక్స్​లో ఈ లగ్జరీ ప్లాజా ఉంది. ఈ ప్లాజా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్‌లలో భాగంగా, విజిటర్స్ కు ఒక సమగ్ర డెస్టినేషన్ గా ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం