Jio 749 prepaid plan: జియో కొత్త 749 ప్లాన్.. వ్యాలిడిటీ ఇతర సేవల వివరాలు ఇవే
Jio 749 prepaid plan: జియో కొత్తగా 749 ప్రీపెయిడ్ ప్లాన్‌తో వచ్చింది. పూర్తి వివరాలు ఇవే.
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త రూ. 749 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో వస్తోంది. డేటాతో పాటు అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అంతేకాకుండా, వినియోగదారులు ఈ ప్లాన్‌తో పాటు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా జియోసెక్యూరిటీ, జియోటీవీ, జియోసినిమా వంటి వాటికి యాక్సెస్ పొందుతారు.
జియో రూ. 749 ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత స్థానిక, జాతీయ కాలింగ్ సౌకర్యం అందిస్తోంది. ఇది వినియోగదారులకు రోజువారీ 2జీబీ డేటాను కూడా అందిస్తుంది. ఈ డేటా పరిమితి దాటిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64కేబీపీఎస్‌కు పడిపోతుంది. ఈ 90 రోజుల ప్లాన్‌లో రోజుకు 100 ఎస్ఎంఎస్ ఉచితం.
ఎయిర్‌టెల్ కూడా జియో లాంటి ప్లాన్‌ను ఆఫర్ చేయడం గమనార్హం. ఎయిర్‌టెల్ రూ. 779 ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 1.5జీబీ రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్‌తో రోజుకు 100 ఎస్ఎంఎస్ ఉచితంగా చేసుకునే సదుపాయాన్ని అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 90 రోజులు. వినియోగదారులు ఫాస్ట్‌ట్యాగ్‌లో రూ. 100 క్యాష్‌బ్యాక్‌తో పాటు మూడు నెలల అపోలో సర్కిల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందుతారు.