Jio: కొత్త తరహా బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్ తీసుకొచ్చిన జియో: ఐపీఎల్‍కు ముందు.. వివరాలివే
Jio Fiber broadband Back-up plan: బ్రాడ్‍బ్యాండ్ బ్యాక్-అప్ ప్లాన్‍ను జియో ఫైబర్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ స్పీడ్ పెంచుకునేందుకు ప్రత్యేకమైన పాస్‍లు కూడా అందుబాటులో ఉంటాయి.
PJio Fiber broadband Back-Up plan: పాపులర్ క్రికెట్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) ముంగిట.. జియో ఫైబర్ సరికొత్త ప్లాన్‍ను తీసుకొచ్చింది. జియోఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ బ్యాక్-అప్ ప్లాన్‍ను లాంచ్ చేసింది. నెలకు కేవలం రూ.198 ఖర్చయ్యేలా ఈ ప్లాన్ ఉంది. మార్చి 30వ తేదీ నుంచి ఈ ప్లాన్ ఎంపిక చేసుకునేందుకు అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఉన్న జియో ఫైబర్ కనెక్షన్ పని చేయకుండా ఉన్నా.. మెయింటెన్స్ లేక డౌన్ అయినా ఈ బ్యాక్-అప్ సర్వీస్ ను ఎంపిక చేసుకోవచ్చు. ఇక ఈ ప్లాన్ తీసుకున్న వారు ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకునేందుకు పాస్‍లను జియో తీసుకొస్తోంది. పూర్తి వివరాలివే..
జియోఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ బ్యాక్-అప్ ప్లాన్ వివరాలు
Jio Fiber broadband Back-Up plan: జియోఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ బ్యాక్-అప్ ప్లాన్ నెలకు రూ.198 ధరతో ప్రారంభం అవుతుంది. ఈ ప్లాన్ తీసుకుంటే 10 Mbps వేగంతో అన్‍లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. ఈ స్పీడ్‍ను ప్రత్యేకమైన పాస్‍ల ద్వారా పెంచుకునే సదుపాయం కూడా ఉంది. రూ.21 పాస్ తీసుకుంటే ఒక రోజుకు 30 mbps వేగాన్ని, రూ.32 పాస్ తీసుకుంటే 100 mbps స్పీడ్ పొందవచ్చు. రెండు రోజులు, ఏడు రోజులకు కూడా ఈ స్పీడ్ బూస్టర్ పాస్‍లు ఉంటాయి.
Jio Fiber broadband Back-Up plan: ఈ జియో ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ బ్యాకప్ ప్లాన్ కావాలంటే కస్టమర్లు ముందుగా రూ.1,490 (ఐదు నెలలకు గాను రూ.990, ఇన్‍స్టాలేషన్‍కు రూ.500) చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తానికి జీఎస్‍టీ అదనంగా ఉంటుంది.
ఈ రూ.198 ప్లాన్ తీసుకున్న వారు ఎంటర్‌టైన్‍మెంట్ అప్‍గ్రేడ్ కూడా తీసుకోవచ్చు. నెలకు రూ.100, రూ.200 అప్‍గ్రేడ్ ప్లాన్లు ఉన్నాయి. రూ.100 ఎంటర్‌టైన్‍మెంట్ అప్‍గ్రేడ్ ఎంచుకుంటే 6 ఓటీటీ యాప్స్, 400 లైవ్ టీవీ చానెల్స్ సహా మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు. రూ.200 ఎంపిక చేసుకుంటే 14 ఓటీటీ యాప్స్ సబ్‍స్క్రిప్షన్, 550 లైవ్ టీవీ చానెల్స్ సహా మరిన్ని ప్రయోజనాలు దక్కుతాయి.
జియో వెబ్‍సైట్ లేదా దగ్గర్లోని జియో రిటైల్ స్టోర్‌లో కస్టమర్లు ఈ క్యాప్-అప్ కనెక్షన్‍ను బుక్ చేసుకోవచ్చు. రూ.99 చెల్లించి బుక్ చేసుకునే సదుపాయం ఉంది.
ఐపీఎల్ 2023 టోర్నీ మార్చి 31వ తేదీన మొదలుకానుంది. జియో సినిమా యాప్‍లో ఐపీఎల్ 2023 మ్యాచ్ లు లైవ్ స్ట్రీమ్ అవుతాయి. ఈ యాప్‍లో యూజర్లు ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‍ల లైవ్ చూడవచ్చు. ఎలాంటి సబ్‍స్క్రిప్షన్ అవసరం లేదు.
టాపిక్