Jio plans and offers : 'జియో'కు 7 వసంతాలు- ఈ ప్లాన్స్‌పై అదిరిపోయే ఆఫర్స్!
Jio plans and offers : మీరు జియో వాడుతున్నారా? అయితే ఈ అదిరిపోయే వార్త మీకోసమే! 7వ వార్షికోత్సవం సందర్భంగా.. కొన్ని ప్లాన్స్‌పై స్పెషల్ బెనిఫిట్స్‌ను ప్రకటించింది జియో. ఆ వివరాలు..
Jio plans and offers : జియో 7ఏళ్ల వార్షికోత్సవం నేపథ్యంలో కస్టమర్లకు ఓ గుడ్ న్యూస్ ఇచ్చింది. పలు ప్లాన్స్‌పై డేటాతో పాటు ఇతర బెనిఫిట్స్‌ని అందిస్తున్నట్టు ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ చూద్దాము..
ట్రెండింగ్ వార్తలు
జియో ప్లాన్స్- 'ఎక్స్ట్రా బెనిఫిట్స్'..
రూ. 299 రీఛార్జ్:- ఈ ప్యాక్‌తో 28 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను పొందవచ్చు. ఇక స్పెషల్ బెనిఫిట్స్ కింద 7 జీబీ ఎక్స్ట్రా డేటాను ఇస్తోంది జియో.
రూ. 749 రీఛార్జ్:- ఈ ప్లాన్‌తో 90 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తున్నాయి. ఇక స్పెషల్ ఆఫర్ల భాగంగా 14జీబీ ఎక్స్ట్రా డేటా (7జీబీx 2కూపాన్స్)ను పొందవచ్చు.
Jio latest plans : రూ. 2,999 రీఛార్జ్:- ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజుల పాటు రోజుకు 2.5జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ సేవలను పొందవచ్చు.
ఇక ఈ ప్లాన్‌తో పాటు స్పెషల్ ఆఫర్స్/ బెనిఫిట్స్ కింద.. 21 జీబీ ఎక్స్ట్రా డేటా (7జీబీx3 కూపాన్స్), ఏజీయోలో రూ. 200 వరకు ఆఫ్, నెట్‌మెడ్స్‌లో రూ. 800 వరకు 20శాతం ఆఫ్, స్విగ్గీలో 100శాతం తగ్గింపు, మెక్‌డీలో రూ. 149 అంతకన్నా ఎక్కువ బిల్లు ఉచితం, రిలయన్స్ డిజిటల్లో 10శాతం ఆఫ్, ఫ్లైట్స్‌పై రూ. 1500 తగ్గింపు, హోటల్స్‌పై 15శాతం డిస్కౌంట్, యాత్రాలో రూ. 4000 వరకు ఆఫ్ వస్తోంది.
ఇవి గుర్తుపెట్టుకోవాలి..
Jio 7th anniversary : 7వ వార్షికోత్సవం నేపథ్యంలో జియో ఇస్తున్న ఈ బెనిఫిట్స్‌ను పొందాలని అనుకునే వారు కొన్ని విషయాలు గమనించాలి. అవేంటంటే..
- ఈ నెల 5 నుంచి 30 మధ్యలో రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకే ఈ బెనిఫిట్స్ లభిస్తాయి. సెప్టెంబర్ 30 తర్వాత చేసే రీఛార్జ్‌లపై ఇవి ఉండవు.
- రీఛార్జ్ చేసిన వెంటనే.. ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి ‘మైజియో’ అకౌంట్లో వెంటనే క్రెడిట్ అయిపోతాయి. ఎక్స్ట్రా డేటా అనేది డేటా వోచర్ కింద మైజియో యాప్‌లో క్రెడిట్ అవుతుంది. కస్టమర్లు వీటిని రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం