Recharge Plans : అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా ఎంజాయ్ చేయాలనుకుంటే జియో, ఎయిర్‌టెల్ యూజర్లకు ఛాన్స్
Recharge Plans : ఫ్రీగా ఓటీటీలు చూడాలనుకునేవారికి కోసం వివిధ రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. జియో, ఎయిర్‌టెల్ ఇలాంటి అనేక ప్లాన్లను అందిస్తున్నాయి. రీఛార్జ్‌పై అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా పొందుతున్నాయి.
టెలికాం కంపెనీలు కస్టమర్లను ఆకర్శించేందుకు వివిధ ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి. ఓటీటీ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కోసం మార్కెట్‌లో అనేక ప్లాన్లను అందిస్తున్నారు. ఇందులో పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ఉన్నాయి. దేశంలోని రెండు అతిపెద్ద టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్‌టెల్ తమ అనేక ప్లాన్లతో ఓటీటీని అందిస్తున్నాయి. రీఛార్జ్ చేసుకునే కస్టమర్లు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ అందించే ప్లాన్లు ఉన్నాయి. వాటి గురించి చూద్దాం..

జియో ప్లాన్
84 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఉచిత అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్ స్క్రిప్షన్ తో రిలయన్స్ జియో అందిస్తున్న ఏకైక ప్లాన్ జియో రూ.1029 ప్లాన్. రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, రోజుకు 2 జీబీ డేటా వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్ యాప్స్‌కు యాక్సెస్ లభిస్తుంది.
ఎయిర్‌టెల్ ప్లాన్స్
ఎయిర్ టెల్ రూ.1199 ప్లాన్‌తో కస్టమర్లు 84 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ చేసుకుంటే అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. రోజుకు 2.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దీనితో పాటు అన్ని నెట్ వర్క్‌లకు అపరిమిత కాలింగ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
రూ.838 ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 3జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది. రీఛార్జ్ చేసుకున్న తర్వాత అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పంపించుకునే సదుపాయం కూడా ఉంది. ఈ ప్లాన్ ద్వారా అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్‌ను 56 రోజుల పాటు అందిస్తోంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తారు. ఇది వినియోగదారులను 22ప్లస్ ఓటీటీలను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.
ఈ రెండు ఎయిర్‌టెల్ ప్లాన్‌లతో అపోలో 24/7 సర్కిల్‌కు మూడు నెలల యాక్సెస్, ఉచిత హలోట్యూన్స్ లభిస్తాయి.