Recharge Plans : మీరు డేటా ఎక్కువగా వాడితే రోజూ 3జీబీ వచ్చే 9 రీఛార్జ్ ప్లాన్స్.. మరెన్నో బెనిఫిట్స్-jio airtel and vi 9 recharge plans that get 3gb daily data and many more benefits list here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Recharge Plans : మీరు డేటా ఎక్కువగా వాడితే రోజూ 3జీబీ వచ్చే 9 రీఛార్జ్ ప్లాన్స్.. మరెన్నో బెనిఫిట్స్

Recharge Plans : మీరు డేటా ఎక్కువగా వాడితే రోజూ 3జీబీ వచ్చే 9 రీఛార్జ్ ప్లాన్స్.. మరెన్నో బెనిఫిట్స్

Anand Sai HT Telugu
Jan 26, 2025 08:00 PM IST

Recharge Plans : మీరు డేటా ఎక్కువగా ఉపయోగిస్తారా? మీ కోసం కొన్ని రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. రోజువారీ 3జీబీ డేటాతో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా(వీఐ) ప్లాన్స్ అందిస్తు్న్నాయి. వాటి గురించి చూద్దాం..

jio airtel and vi all 3gb daily data prepaid plans list
jio airtel and vi all 3gb daily data prepaid plans list

మీరు ఎక్కువగా డేటాను ఉపయోగిస్తుంటే రోజూ 3జీబీ డేటాతో ప్లాన్లు మీకు బెస్ట్ ఆప్షన్. జియో, ఎయిర్‌టెల్, విఐ కంపెనీలు తమ వినియోగదారుల కోసం అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. వీటిలో ప్రతిరోజూ 3జీబీ డేటా లభిస్తుంది. ఈ కంపెనీలకు చెందిన ప్లాన్స్ గురించి తెలుసుకుందాం..

జియో రీఛార్జ్ ప్లాన్స్

రూ.449కు జియో రోజువారీ 3జీబీ డేటా ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 3 జిబి డేటా(మొత్తం 84జీబీ)తో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులు అపరిమిత 5జీ డేటాకు కూడా అర్హులు. దీని ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ లభిస్తుంది.

రూ.1199 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. రోజుకు 3 జీబీ డేటా (మొత్తం 252జీబీ)తో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వినియోగదారులు అపరిమిత 5జీ డేటాకు కూడా అర్హులు. ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ లభిస్తుంది.

రూ.1799 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. రోజుకు 3జీబీ డేటా (మొత్తం 252 జీబీ) తో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. వినియోగదారులు అపరిమిత 5జీ డేటాకు కూడా అర్హులు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్(బేసిక్) సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్స్

ఎయిర్‌టెల్ రోజువారీ 3 జీబీ డేటా ప్లాన్ రూ.449. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్ రోజుకు 3జీబీ డేటా (మొత్తం 84జీబీ)తో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులు అపరిమిత 5జీ డేటాకు కూడా అర్హులు. ఇందులో ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం(22 ఓటీటీ), అపోలో 24/7 సర్కిల్, స్పామ్ మెసేజ్లు, కాల్ అలర్ట్స్, ఉచిత హలోట్యూన్స్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

రూ.549 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్ రోజుకు 3జీబీ డేటా(మొత్తం 84జీబీ)తో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులు అపరిమిత 5జీ డేటాకు కూడా అర్హులు. ఇందులో ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం(22 ఓటీటీ), అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (3 నెలలు) వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

రూ.838 ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. ఈ ప్లాన్ రోజుకు 3జీబీ డేటా (మొత్తం 168జీబీ)తో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. వినియోగదారులు అపరిమిత 5జీ డేటాకు కూడా అర్హులు. ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం(22 ఓటీటీ), స్పామ్ సందేశాలు, కాల్ అలర్ట్స్, అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్(56 రోజులు) వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

రూ.1798 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. రోజుకు 3జీబీ డేటా(మొత్తం 252జీబీ)తో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. వినియోగదారులు అపరిమిత 5జీ డేటాకు కూడా అర్హులు. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్ యాక్సెస్, స్పామ్ మెసేజ్‌లు, కాల్ అలర్ట్స్, అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్, నెట్‌ఫ్లిక్స్ బేసిక్ వంటి ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి.

వీఐ రీఛార్జ్ ప్లాన్స్

రోజుకు 3 జీబీ డేటాతో వీఐ రూ.449 ప్లాన్ అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. రోజుకు 3జీబీ డేటా (మొత్తం 84 జీబీ)తో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. హాఫ్ డే అన్‌లిమిటెడ్ డేటా, వీకెండ్ డేటా రోల్ఓవర్, డేటా డిలైట్, ViMTV సబ్‌స్క్రిప్షన్ వంటి ప్రయోజనాలు దొరుకుతాయి.

రూ.795 ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు వస్తుంది. ఇందులో రోజుకు 3జీబీ డేటా(మొత్తం 168జీబీ)తో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. హాఫ్ డే అన్‌లిమిటెడ్ డేటా, వీకెండ్ డేటా రోల్ ఓవర్, డేటా డిలైట్ వంటి బెనిఫిట్స్ వస్తాయి.

Whats_app_banner