ఇండియాలో జీప్‌కి ఉన్న బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో ఒకటి కంపాస్. ఇప్పుడు, ఈ జీప్ కంపాస్‌కి స్పెషల్ ఎడిషన్‌ని తీసుకొచ్చింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. దీని పేరు జీప్ శాండ్‌స్టార్మ్. ప్రధానంగా ఎక్స్టీరియర్, ఇంటీరియర్, ఫీచర్ల జాబితాను జోడించే యాక్సెసరీస్ ప్యాకేజీ, శాండ్‌స్టార్మ్ ఎడిషన్ దాని ఆధారిత స్టాండర్డ్ మోడల్ వేరియంట్ కంటే రూ .50,000 ప్రీమియంతో వస్తోంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ అని సంస్థ వెల్లడించింది. జీప్ కంపాస్ శాండ్‌స్టార్మ్ ఎడిషన్ ప్రారంభ ధర రూ .19.64 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ నేపథ్యంలో ఈ జీప్ కంపాస్ శాండ్‌స్టార్మ్ ఎడిషన్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
జీప్ కంపాస్ శాండ్‌స్టార్మ్ ఎడిషన్ లెవల్ స్పోర్ట్స్, లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ (ఓ) వేరియంట్లలో లభిస్తుంది. కంపాస్ శాండ్‌స్టార్మ్ ఎడిషన్ ధర రూ .27.33 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
కొత్త జీప్ కంపాస్ శాండ్‌స్టార్మ్ ఎడిషన్ బానెట్, సైడ్ ప్రొఫైల్స్‌పై కొన్ని కస్టమ్, శాండ్‌స్టార్మ్ థీమ్ బాడీ డెకాల్స్‌తో వస్తుంది. జీప్ కంపాస్ రెగ్యులర్ వర్షెన్‌తో పోలిస్తే ఈ స్పెషల్ ఎడిషన్ ఎస్యూవీ ఫ్రెంట్ ఫెండర్పైన శాండ్‌స్టార్మ్ బ్యాడ్జ్‌ను కలిగి ఉంది.
జీప్ కంపాస్ శాండ్‌స్టార్మ్ ఎడిషన్ ఎక్స్టీరియర్ మాత్రమే కాదు, ఇంటీరియర్ కూడా సాధారణ ఎస్‌యూవీకి భిన్నంగా కొన్ని విలక్షణమైన స్టైలింగ్ ఎలిమెంట్స్‌ని కలిగి ఉంది. లిమిటెడ్ రన్ జీప్ కంపాస్ ఎస్‌యూవీలో కొత్త సీట్ కవర్లు, ప్రోగ్రామబుల్ యాంబియంట్ లైటింగ్, ఫ్రెంట్- రేర్ డాష్‌క్యామ్‌లు, కొత్త ఫ్లోర్ మ్యాట్స్, క్యాబిన్ లోపల అదనపు శాండ్‌స్టార్మ్ బ్యాడ్జ్ ఉన్నాయి.
జీప్ కంపాస్ స్పోర్ట్స్ వేరియంట్లో 8.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, కనెక్టివిటీ ఆప్షన్లు, ఎల్ఈడీ రిఫ్లెక్టర్ లైట్లు, 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్పోర్ట్స్ వేరియంట్‌పైన ఉన్న ఈ ఎస్యూవీ లాంగిట్యూడ్ ట్రిమ్‌లో కనెక్టివిటీ ఫీచర్లు, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ వంటి అనేక ఫీచర్లతో 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ లభిస్తుంది. దీనికి ఇన్-కార్ కనెక్టివిటీ సూట్ కూడా లభిస్తుంది.
ఇటివలి కాలంలో ఇండియాలో స్పెషల్ ఎడిషన్స్ లాంచ్‌లు పెరుగుతున్నాయి. ఈ లిస్ట్‌లోకి తాజాగా జీప్ కంపాస్ కూడా చేరింది. మరి భారత కస్టమర్లను ఇది ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
సంబంధిత కథనం