Jeep Compass: భారత్ లో జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ లాంచ్; ధర ఎంతంటే?-jeep compass anniversary edition launched in india heres what is different ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jeep Compass: భారత్ లో జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ లాంచ్; ధర ఎంతంటే?

Jeep Compass: భారత్ లో జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ లాంచ్; ధర ఎంతంటే?

Sudarshan V HT Telugu
Published Oct 03, 2024 10:15 PM IST

Jeep Compass Anniversary Edition: భారత్ లో జీప్ ఇండియా కంపాస్ యానివర్సరీ ఎడిషన్ ను విడుదల చేసింది. దీని ఎక్స్ షో రూమ్ ధరను రూ .25.26 లక్షలుగా నిర్ణయించారు. జీప్ కంపాస్ కు భారత్ లో 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, పలు కాస్మెటిక్ అప్ డేట్ లతో ఈ స్పెషల్ ఎడిషన్ ను లాంచ్ చేశారు.

భారత్ లో జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ లాంచ్
భారత్ లో జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ లాంచ్

Jeep Compass Anniversary Edition: జీప్ ఇండియా కొత్త కంపాస్ యానివర్సరీ ఎడిషన్ ను, సరికొత్త అప్ డేట్స్ తో అక్టోబర్ 3 గురువారం రోజు లాంచ్ చేసింది. ఈ జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.25.26 లక్షలుగా నిర్ణయించారు. ఈ కొత్త ఎడిషన్ లో కాస్మెటిక్, యాక్సెసరీ అప్డేట్స్ ఉన్నాయి. లిమిటెడ్ ఎడిషన్ జీప్ కంపాస్ బ్రాండ్ కు భారత్ లో ఎనిమిదేళ్ళు పూర్తి అయిన సందర్భంగా యానివర్సరీ ఎడిషన్ ను ప్రకటించారు. కొత్త ఎడిషన్ తో ఇంజిన్ తో పాటు మొత్తం డిజైన్ లో ఎటువంటి మార్పులు లేవు.

జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్: అప్ డేట్స్

ఎక్స్టీరియర్: హుడ్ లేదా బానెట్ డిజైన్ ను ఎస్ యూవీ తరహాలో రూపొందించడం జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ లోని అత్యంత ముఖ్యమైన అప్ డేట్ గా భావిస్తున్నారు. హుడ్ మధ్య భాగంలో డెకాల్ ను అప్లై చేయడం వల్ల హుడ్ కొత్త డ్యూయల్-టోన్ లో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫ్రంట్-గ్రిల్ లోని ఏడు స్లాట్లలో రెండవ స్లాట్లో మాత్రమే వెల్వెట్ రెడ్ యాక్సెంట్ కనిపిస్తుంది.

ఇంటీరియర్స్: జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ ఇంటీరియర్స్ ను కూడా మార్చారు. ఈ లేటెస్ట్ ఎడిషన్ ప్రముఖ వెల్వెట్ రెడ్ సీట్ కవర్లతో మరింత అధునాతనంగా, స్పోర్టీగా కనిపిస్తుంది. ఇందులో మరికొన్ని యాక్ససరీలను కూడా యాడ్ చేశారు. వీటిలో డ్యూయల్-ఛానల్ రికార్డింగ్ సామర్థ్యం, వైట్ యాంబియంట్ లైటింగ్ కలిగి ఉన్న ఇంటిగ్రేటెడ్ డాష్ కామ్ ముఖ్యమైనది.

జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్: కలర్ ఆప్షన్స్

జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ కోసం ఏడు ఎక్స్టీరియర్ పెయింట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పెర్ల్ బ్లూ, సిల్వేరీ మూన్, బ్రిలియంట్ బ్లాక్, ఎక్సోటికా రెడ్, మెగ్నీషియో గ్రే, టెక్నో మెటాలిక్ గ్రీన్, గెలాక్సీ బ్లూ ఉన్నాయి.

జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్: ముఖ్య ఫీచర్లు

కొత్త జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ లోని ఫీచర్లు సాధారణ ఎడిషన్ జీప్ కంపాస్ లో అందించే ఫీచర్లకు చాలా భిన్నంగా ఏమీ లేవు. కొత్త ఎడిషన్ లో కూడా 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, డ్యూయల్ ప్యాన్ పనోరమిక్ సన్ రూఫ్, జీప్ లైఫ్ కనెక్టివిటీ సూట్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి. కంపాస్ ఇతర వేరియంట్ల మాదిరిగానే 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇందులో ఉన్నాయి.

Whats_app_banner