Upcoming IPO : వచ్చే వారం రానున్న 5 ఐపీఓలు.. కాస్త జాగ్రత్తగా ఓ లుక్కేసి ఉంచండి!
Upcoming IPO : వచ్చే వారం అంటే జనవరి 20 నుంచి 5 ఐపీఓలు ప్రారంభమవుతున్నాయి. వాటి గురించి వివరాలను తెలుసుకోండి.
ఈ వారం 5 ఐపీఓలు రాబోతున్నాయి. పెట్టుబడిదారులు ఆదాయాన్ని పెంచుకునే అవకాశాన్ని పొందబోతున్నారు. జనవరి 20 నుంచి ఐదు ఐపీఓలు ప్రారంభమవుతున్నాయి. ఏయో ఐపీఓలు రాబోతున్నాయో చూద్దాం..

రెక్స్‌ప్రో ఎంటర్‌ప్రైజెస్ ఐపీఓ
రెక్స్‌ప్రో ఎంటర్‌ప్రైజెస్ ఐపీఓ రూ. 53.65 కోట్ల స్థిర ధర ఇష్యూ. ఈ ఇష్యూలో 32.50 లక్షల కొత్త షేర్లు జారీ అవుతాయి. దీని విలువ రూ.47.13 కోట్లు. రెక్స్‌ప్రో ఎంటర్‌ప్రైజెస్ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.145. దరఖాస్తు కోసం కనీస లాట్ పరిమాణం 1000గా ఉంది. రెక్స్‌ప్రో ఎంటర్‌ప్రైజెస్ ఐపీఓ జనవరి 22న ప్రారంభమై జనవరి 24న ముగుస్తుంది. కేటాయింపు జనవరి 27న జరగనుంది. NSE SMEలో జాబితా అవుతుంది.
క్యాపిటల్ నంబర్స్ ఇన్ఫోటెక్ ఐపీఓ
క్యాపిటల్ నంబర్స్ ఇన్ఫోటెక్ ఐపీఓ రూ. 169.37 కోట్లతో బుక్ బిల్ట్ ఇష్యూకు వస్తుంది. ఐపీఓలో ఒక్కో షేరుకు రూ. 250-263 ధరతో, 400 షేర్ల బిడ్ చేయవచ్చు. ఇష్యూ జనవరి 22న ముగుస్తుంది. షేర్ల లిస్టింగ్ జనవరి 27న BSE SMEలో జరుగుతుంది. జీవైఆర్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాపిటల్ నంబర్స్ ఇన్ఫోటెక్ ఐపీఓ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా ఉంది. లింక్ ఇన్‌టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇష్యూకి రిజిస్ట్రార్‌గా ఉంటుంది.
సీఎల్ఎన్ ఎనర్జీ ఐపీఓ
సీఎల్ఎన్ ఎనర్జీ ఐపీఓ రూ.72.30 కోట్లతో బుక్ బిల్ట్ ఇష్యూ. 28.92 లక్షల షేర్ల ఇష్యూ అవుతాయి. ఈ ఐపీఓ జనవరి 23న తెరుస్తారు. జనవరి 27 2025న ముగుస్తుంది. కేటాయింపు జనవరి 28, 2025న ఖరారు అవుతుంది. CLN ఎనర్జీ BSE SMEలో జనవరి 30న లిస్ట్ అవుతుంది.
డెంటా వాటర్ ఐపీఓ
డెంటా వాటర్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ కోసం జనవరి 22, 2025న ఓపెన్ అవుతుంది. జనవరి 24న ముగుస్తుంది. డెంటా వాటర్ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.279 నుండి రూ.294 వరకు సెట్ అయి ఉంది. దరఖాస్తు కోసం కనీస లాట్ పరిమాణం 50.
జీబీ లాజిస్టిక్స్ కామర్స్ ఐపీఓ
జీబీ లాజిస్టిక్స్ కామర్స్ ఐపీఓ 24.58 లక్షల షేర్ల బుక్ బిల్ట్ ఇష్యూ. 24.58 లక్షల షేర్లు జారీ చేస్తారు. జీబీ లాజిస్టిక్స్ ఐపీఓ జనవరి 24న ఓపెన్ అవుతుంది. జనవరి 28, 2025న ముగుస్తుంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.250 నుండి రూ263గా నిర్ణయించారు. ముకుల్ గుప్తా, విపుల్ గుప్తా, హర్‌ప్రీత్ గుప్తా కంపెనీకి ప్రమోటర్లుగా ఉన్నారు.
గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. కేవలం సమాచారం మాత్రమే. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నది. నిపుణుల సలహా తీసుకోండి.