ITR Refund : మీరు ఐటీఆర్ ఫైల్ చేసి రిఫండ్ కోసం వెయిట్ చేస్తుంటే కచ్చితంగా ఈ వార్త మీకోసమే-itr refund status check if you have filed itr and waiting for refund then this news is definitely for you ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Itr Refund : మీరు ఐటీఆర్ ఫైల్ చేసి రిఫండ్ కోసం వెయిట్ చేస్తుంటే కచ్చితంగా ఈ వార్త మీకోసమే

ITR Refund : మీరు ఐటీఆర్ ఫైల్ చేసి రిఫండ్ కోసం వెయిట్ చేస్తుంటే కచ్చితంగా ఈ వార్త మీకోసమే

Anand Sai HT Telugu
Aug 15, 2024 08:17 AM IST

ITR Refund Status : ఐటీఆర్ ఫైల్ చేసి చాలా మంది రిఫండ్ కోసం వెయిట్ చేస్తున్నారా? కొందరికేమో ఐటీఆర్ ఫైల్ చేసిన కొన్ని రోజులకే వచ్చేస్తే.. మరికొందరేమో ఇంకా రాలేదని చూస్తున్నారు. అయితే ఇలా రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మీ సమస్యలను చెప్పుకొనేందుకు కూడా వీలు ఉంది. ఆ వివరాలు మీకోసం..

ఐటీఆర్ రిఫండ్ కోసం చూస్తున్నారా?
ఐటీఆర్ రిఫండ్ కోసం చూస్తున్నారా?

ఆదాయపు పన్ను రిఫండ్ ఆలస్యం కావడానికి కారణాలు అనేకం ఉండవచ్చు. కానీ ప్రధాన కారణాలు బ్యాంకు ఖాతా తప్పుడు వివరాలు, బ్యాంకు ఖాతాను ముందుగా ధృవీకరించకపోవడం, ఐటీఆర్‌లో సరైన సమాచారం ఇవ్వకపోవడం, ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్‌ను తనిఖీ చేయడం లేదా పన్ను చెల్లింపుదారుడిపై చెల్లించాల్సిన మునుపటి పన్ను ప్రభావం కూడా ఉంటుంది. ఇలా అనేక రకాల కారణాలతో మీకు రిఫండ్ లేట్ అవ్వొచ్చని సీఏ అజయ్ బగారియా చెప్పుకొచ్చారు.

మీ పాన్‌తో లింక్ చేసిన పేరు మీ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయబడిన పేరుతో సరిపోలనప్పుడు కూడా ఐటీఆర్ రిఫండ్ సమస్య వస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, రెండు రికార్డులు ఒకేలా ఉన్నాయని నిర్ధారించుకోండి. మీరు మీ పాన్‌లో మీ పేరును అప్డేట్ చేయాల్సి ఉంటుంది లేదా మీ బ్యాంకుతో మీ పేరు వివరాలను సవరించాల్సి ఉంటుంది.

రిఫండ్ ఆలస్యమైతే పన్ను చెల్లింపుదారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ప్రశ్నకు సీఏ అభినందన్ పాండే సమాధానమిచ్చారు. ముందుగా మీ ఈ-మెయిల్ చెక్ చేసుకోండి. ఆదాయపు పన్ను శాఖ ఎటువంటి రిఫండ్ లేదా ఎటువంటి నోటీసును పంపకుండా. ఐటీఆర్ స్టేటస్‌లో రిఫండ్ క్లెయిమ్ తిరస్కరణకు గురైతే, పన్ను చెల్లింపుదారుడు రిఫండ్ రీ ఇష్యూ కోసం అభ్యర్థించవచ్చు. క్లెయిమ్ పెండింగ్లో ఉంటే, మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్ / అధికారిని సంప్రదించవచ్చు. దానిని త్వరగా పరిష్కరించాలని అభ్యర్థించవచ్చు.

ఆదాయపు పన్ను శాఖ హెల్ప్‌లైన్ నంబర్ 1800-103-4455కు లేదా ask@incometax.gov.in ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. వారు మీ రిఫండ్ స్థితికి సహాయపడగలరు. రిఫండ్ స్టేటస్ గురించి నేరుగా తెలుసుకోవడానికి స్థానిక ఆదాయపు పన్ను కార్యాలయానికి వెళ్లండి. మీకు సంబంధించిన అవసరమైన డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లండి. అక్కడ వారిని కూడా దీనిపై సమాచారం అడగవచ్చు.