ITR filing: ఈ-ఫైలింగ్ పోర్టల్ లో ఇబ్బందుల కారణంగా ఐటీఆర్ ఫైలింగ్ గడువును పొడిగిస్తారా?-itr e filing portal glitches will deadline be extended beyond july 31 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Itr Filing: ఈ-ఫైలింగ్ పోర్టల్ లో ఇబ్బందుల కారణంగా ఐటీఆర్ ఫైలింగ్ గడువును పొడిగిస్తారా?

ITR filing: ఈ-ఫైలింగ్ పోర్టల్ లో ఇబ్బందుల కారణంగా ఐటీఆర్ ఫైలింగ్ గడువును పొడిగిస్తారా?

HT Telugu Desk HT Telugu

ఈ-ఫైలింగ్ పోర్టల్ లో లోపాల కారణంగా పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేటప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఫారం 26 ఎఎస్ / ఎఐఎస్ / టిఐఎస్ ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్క్ష్యంలో ఐటీఆర్ ఫైలింగ్ గడువును జూలై 31 నుంచి మరి కొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉందా?

ఐటీఆర్ ఫైలింగ్ గడువును పొడిగిస్తారా?

2024లో ఆదాయ పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేయడానికి జూలై 31 వరకు గడువు ఉంది. దీంతో పలువురు పన్ను చెల్లింపుదారులు ఫైలింగ్ ప్రక్రియను ప్రారంభించగా, ఇప్పటికే చాలా మంది తమ ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేశారు. 2024 జూలై 14 నాటికి 2.7 కోట్లకు పైగా ఐటీఆర్లు దాఖలయ్యాయని, గత ఏడాది ఇదే సమయంలో దాఖలు చేసిన రిటర్న్లతో పోలిస్తే ఇది 13 శాతం అధికమని ఆదాయ పన్ను (Income Tax) శాఖ వెబ్సైట్ పేర్కొంది. జూలై 13 న ప్రతిరోజూ దాఖలు చేసిన ఐటిఆర్ ల సంఖ్య 13 లక్షలు దాటింది మరియు గడువు తేదీ 31 జూలై 2024 సమీపిస్తున్నందున ప్రతిరోజూ ఆ సంఖ్య పెరుగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కోటి ఐటీఆర్ల (ITR) దాఖలు మైలురాయి 2024 జూన్ 23న చేరుకోగా, 2 కోట్ల మైలురాయి జూలై 7న చేరుకుంది.

ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో సమస్యలు

అయితే పన్ను చెల్లింపుదారులు ఈ-ఫైలింగ్ పోర్టల్ లో పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ లోపాలపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ఆదాయపు పన్ను శాఖకు లేఖ రాసింది. అందులో ఫారం 26 ఎఎస్ / టిఐఎస్ / ఎఐఎస్, ఐటిఆర్ ఫారాల ఇ-ఫైలింగ్ లో ఎదురవుతున్న సమస్యల గురించి ప్రస్తావించింది. ‘‘ఆడిటింగ్ అవసరం లేని వ్యక్తులు, సంస్థలు ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఆఖరు తేదీ జూలై 31. కానీ, ఆదాయ పన్ను ఈ ఫైలింగ్ పోర్టల్ లో లోపాల కారణంగా చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఫారం 26ఏఎస్/ ఏఐఎస్/ టీఐఎస్ (Form 26AS/AIS/TIS) కు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’’ అని ఐసీఏఐ ప్రత్యక్ష పన్నుల కమిటీ చైర్మన్, చార్టర్డ్ అకౌంటంట్ పియూష్ ఎస్ చాజేద్ వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా ఈ కింది సమస్యలు..

ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేసే సమయంలో పన్ను చెల్లింపుదారులు ప్రధానంగా ఈ కింది విషయాలలో సమస్యలు ఎదుర్కొంటున్నారు.

  • ఫారం 26ఎఎస్ / ఎఐఎస్ / టిఐఎస్ (Form 26AS/AIS/TIS) ను యాక్సెస్ చేయడంలో ఇబ్బంది.
  • స్టేట్ మెంట్లలోని గణాంకాల మధ్య వ్యత్యాసం.
  • ఎఐఎస్ / టిఐఎస్ లో రెస్పాన్స్ ఆప్షన్స్ పరిమితంగా ఉండడం.
  • ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ లో సాంకేతిక లోపాలు.
  • ముందుగా నింపిన డేటాలో అసమతుల్యత.
  • ఐటిఆర్ ఫైలింగ్ సమయంలో తప్పుడు సందేశాలు.
  • రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లకు సమయానికి ఓటీపీలు రాకపోవడం.
  • ఫైల్ చేసిన ఐటిఆర్ రసీదులను డౌన్లోడ్ చేయడంలో ఇబ్బంది.