బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! భారత మార్కెట్లో ఇటీవలే ఒక కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది ఐటెల్. దీని పేరు ఐటెల్ జెనో. ఇదొక 5జీ గ్యాడ్జెట్. రోజువారీ వినియోగదారుల కోసం అవసరమైన ఫీచర్లను అందించడం దీని లక్ష్యం. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ఏఐ-ఆధారిత కార్యాచరణలను కలిగి ఉంది. ఈ నేపత్యంలో ఈ మొబైల్‌కి చెందిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
బ్రాండ్ ప్రకారం.. ఐటెల్ జెనో 5G 6.67-ఇంచ్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్‌ప్లేతో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఇది 7.8 ఎంఎం స్లిమ్ ప్రొఫైల్‌ను కలిగి ఉంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఐపీ54 రేటింగ్‌తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. అదనపు స్క్రీన్ మన్నిక కోసం పాండా ఎంఎన్228 గ్లాస్‌ను కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 50ఎంపీ సింగిల్ కెమెరా సెటప్‌ను, సెల్ఫీలు- వీడియో కాలింగ్ కోసం 8ఎంపీ ఫ్రెంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది ఐటెల్ ఏఐ అసిస్టెంట్ 'ఐవానా'ను కూడా అనుసంధానిస్తుంది. రాయడం, అనువాదం, టెక్ట్స్ దిద్దుబాటు పనులకు మద్దతు ఇస్తుంది. వినియోగదారులకు ఉత్పాదకత, కమ్యూనికేషన్‌లో సహాయపడటం దీని లక్ష్యం.
ఐటెల్ జెనో 5G మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనికి 8జీబీ ర్యామ్ (4GB ఫిజికల్ ప్లస్ 4GB వర్చువల్), 128GB స్టోరేజ్‌ని కూడా సంస్థ యాడ్ చేసింది. ఈ పరికరం 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 10వాట్ అడాప్టర్ ద్వారా ఛార్జ్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఔట్ ఆఫ్ ది బాక్స్‌తో పనిచేస్తుంది. డ్యూయల్ 5G సిమ్ కార్డులు, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బీ-సీ కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది.
ఐటెల్ జెనో 5G భారతదేశంలో రూ. 9,299 ధరతో లభిస్తుంది. వినియోగదారులు రూ. 1,000 అమెజాన్ కూపన్‌ను ఉపయోగించి ఈ పరికరాన్ని తక్కువ ధరకు పొందవచ్చు. ఐటెల్ జెనో 5G కాల్క్స్ టైటానియం, షాడో బ్లాక్, వేవ్ గ్రీన్ అనే మూడు రంగులలో అందుబాటులో ఉంది. కొనుగోలు చేసిన 100 రోజులలోపు కంపెనీ ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను కూడా అందిస్తుంది!
ఐటెల్ ఇండియా సీఈఓ అరిజీత్ తలపాత్ర మాట్లాడుతూ.. జెనో 5G తమ బ్రాండ్ ఆవిష్కరణ, రోజువారీ పని- వినోదాన్ని నిర్వహించగల స్మార్ట్‌ఫోన్‌ను అందించడంపై దృష్టిని సూచిస్తుందని అన్నారు. కొత్త శకంలోని స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగదారులకు ఈ ఫోన్ 5G మద్దతు, ఏఐ ఫీచర్లు, ధృడమైన నిర్మాణం కీలక ప్రయోజనాలని ఆయన పేర్కొన్నారు.
సంబంధిత కథనం