రూ.6,499కే కొత్త ఐటెల్ ఏ90 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు కూడా అదుర్స్!-itel a90 smartphone launched in india starting price 6499 rupees 5000mah battery know other specifications ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  రూ.6,499కే కొత్త ఐటెల్ ఏ90 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు కూడా అదుర్స్!

రూ.6,499కే కొత్త ఐటెల్ ఏ90 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు కూడా అదుర్స్!

Anand Sai HT Telugu

అతితక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే మీ కోసం మార్కెట్‌లోకి కొత్త ఫోన్ వచ్చింది. బడ్జెట్ ధరలో ఐటెల్ ఏ90 స్మార్ట్‌ఫోన్‌ తీసుకోవచ్చు.

ఐటెల్ ఏ90 స్మార్ట్‌ఫోన్

టెల్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఐటెల్ A90ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇటీవల విడుదలైన ఐటెల్ ఏ80కి అప్డేట్ వెర్షన్‌గా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫీచర్లు చాలానే ఉన్నాయి. కొత్త ఐటెల్ ఏ90 స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని ముఖ్య లక్షణం డైనమిక్ బార్, ఇది నోటిఫికేషన్‌లు, ఇతర అలర్ట్‌లను సులభంగా చూడటానికి సహాయపడుతుంది.

ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఐటెల్ ఏ90 ఆక్టా-కోర్ Unisoc T7100 ప్రాసెసర్‌తో వస్తుంది. 4జీబీ ర్యామ్ ఉంది. అవసరమైతే దీనిని 8జీబీ వర్చువల్ ర్యామ్‌కి విస్తరించవచ్చు. ఇది అప్లికేషన్లను సజావుగా అమలు చేయడంలో, మల్టీ టాస్కింగ్‌లో సహాయపడుతుంది. ఈ ఫోన్‌లో 128జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ ఉంది. ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ ఆధారంగా రూపొందించిన ఐటెల్ ఓఎస్14పై నడుస్తుంది.

కెమెరా, ఇతర ఫీచర్లు

ఐటెల్ A90 స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 13-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5,000mAh సామర్థ్యం గల బ్యాటరీని కలిగి ఉంది. ఇది 15W వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఐటెల్ A90 స్మార్ట్‌ఫోన్‌లో ఇవానా 2.0 అనే స్మార్ట్ ఏఐ అసిస్టెంట్ ఉంది. మెరుగైన ఆడియో అనుభవం కోసం ఈ ఫోన్‌లో డీటీఎస్ సౌండ్ టెక్నాలజీ కూడా ఉంది. ఫోన్ ఫేస్ అన్‌లాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం ఐపీ54 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.

ధర

భారతదేశంలో ఐటెల్ ఏ90 ధర 4జీబీ ప్లస్ 64జీబీ మోడల్‌కు రూ.6,499 కాగా, 4జీబీ ప్లస్ 128జీబీ మోడల్ ధర రూ.6,999. ఇది స్టార్‌లిట్ బ్లాక్, స్పేస్ టైటానియం రంగులలో లభిస్తుంది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు కంపెనీ 100 రోజుల ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్, మూడు నెలల ఉచిత జియోసావ్న్ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.