ITC share price : బోనస్ షేర్లతో.. రూ. 1లక్షను- రూ. 1.23కోట్లుగా మార్చిన ఐటీసీ స్టాక్!
ITC share price : ఐటీసీ.. గత 20ఏళ్లల్లో మూడుసార్లు బోనస్ షేర్లు ప్రకటించింది. ఫలితంగా మదుపర్ల రూ. 1లక్ష- రూ. 1.23కోట్లకు పెరిగింది.
ITC share price : దేశీయ స్టాక్ మార్కెట్లో డివిడెండ్లు ఇచ్చే స్టాక్స్‌లో ముందుగా గుర్తొచ్చేది ఐటీసీ సంస్థే. అయితే.. ఈ సంస్థ గతంలో మూడుసార్లు బోనస్ షేర్లు కూడా ప్రకటించింది. ఫలితంగా ఐటీసీ షేర్లతో మదుపర్ల సంపద గత 20ఏళ్లల్లో రూ. 1లక్ష నుంచి రూ. 1.23కోట్లకు పెరిగింది!
ఐటీసీ బోనస్ షేర్లు..
బీఎస్ఈలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. గత రెండు దశాబ్దాల్లో.. ఐటీసీ స్టాక్‌లో మూడుసార్లు ఎక్స్- బోనస్ ట్రేడ్ జరిగింది. 2005 సెప్టెంబర్ 21న 1:2 రేషియోలో బోనస్ షేర్లు ఇచ్చింది ఐటీసీ. అంటే.. రెండు ఐటీసీ షేర్లు ఉన్న మదుపర్లకు అదనంగా 1 స్టాక్ వచ్చి చేరడం. ఇక 2010 ఆగస్టు 3న.. 1:1 రేషియోలో బోనస్‌ను ప్రకటించింది. అంటే.. ఒక స్టాక్ ఉన్న మదుపర్లకు అదనంగా ఇంకో స్టాక్ ఇవ్వడం.
ITC bonus shares history : అదే విధంగా.. 2016 జులై 1న.. 1:2 రేషియోలో బోనస్ షేర్లు ఇచ్చింది ఐటీసీ సంస్థ. అంటే.. రెండు ఐటీసీ స్టాక్స్ ఉన్న వారికి అదనంగా ఇంకో షేరు లభిస్తుంది.
రూ. 1 లక్షతో రూ. 1.23కోట్లు..!
20ఏళ్ల క్రితం ఐటీసీ షేరు ధర రూ. 14గా ఉన్నప్పుడు, ఐటీసీ స్టాక్‌లో రూ. 1లక్ష పెట్టుబడి పెట్టిన మదుపర్లకు.. 7,142 స్టాక్స్ వచ్చేవి. 2005లో 1:2 బోనస్ తర్వాత అవి 10,713గా మారాయి. ఇక 2010లో 1:1 బోనస్ తర్వాత ఆ 10,713 షేర్లు కాస్త.. 21,426 స్టాక్స్‌కి చేరాయి. ఇక చివరిగా.. 2016లో 1:2 బోనస్ అనంతరం 21,426 షేర్లు కాస్త.. ఏకంగా 32,139 ఐటీసీ స్టాక్స్‌గా మారి ఉండేవి.
ITC stock analysis : శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి.. ఐటీసీ షేరు ధర రూ. 383.80 వద్దకు చేరింది. అంటే.. 20ఏళ్ల క్రితం రూ. 1లక్ష పెట్టుబడి పెట్టిన మదుపర్లకు.. ఒక్క బోనస్ షేర్ల రూపంలోనే వారి సంపద రూ. 1.23కోట్లకు చేరుండేది.
డివిడెండ్ల ఐటీసీ..
బోనస్ షేర్ల అంశాన్ని పక్కనపెడితే.. ఐటీసీ సంస్థ ఇప్పటికే అనేకసార్లు డివిడెండ్లు ఇచ్చింది. 2023 ఫిబ్రవరి 15న ఎక్స్- డివిడెండ్ డేట్‌తో షేరుకు రూ. 6 ఇచ్చింది. 2022, 2021లోనూ డివిడెండ్లు ఇచ్చింది. ఇక కొవిడ్ కాలమైన 2020లో జులై 6న.. తమ మదుపర్లకు షేరుకు రూ. 10.15 డివిడెండ్‌గా ప్రకటించింది. 2007 నుంచి ఈ సంస్థ.. మదుపర్లకు డివిడెండ్లు ఇస్తోంది.
ఐటీసీ స్టాక్ ప్రైజ్..
ITC share price target : ఐదు రోజుల్లో ఐటీసీ స్టాక్ 2.9శాతం పెరిగింది. ఒక నెలలో 14.5శాతం వృద్ధిచెందింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15.16శాతం పెరిగింది. అయితే.. ఏడాది కాలంలో ఏకంగా 72.14శాతం పెరిగింది ఐటీసీ స్టాక్.
సంబంధిత కథనం