ITC Q3 results: ఐటీసీ లాభాల్లో 21% వృద్ధి; డివిడెండ్ ఎంతో తెలుసా..?-itc q3 net profit up 21 to rs 5 031 cr declares interim dividend ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Itc Q3 Net Profit Up 21% To <Span Class='webrupee'>₹</span>5,031 Cr, Declares Interim Dividend

ITC Q3 results: ఐటీసీ లాభాల్లో 21% వృద్ధి; డివిడెండ్ ఎంతో తెలుసా..?

HT Telugu Desk HT Telugu
Feb 03, 2023 09:38 PM IST

ITC Q3 results: ఐటీసీ లిమిటెడ్ (ITC ltd)శుక్రవారం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3) ఫలితాలను విడుదల చేసింది. గత Q3 తో పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరం Q3లో 21% అధిక నికర లాభాలను నమోదు చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ITC Q3 results: ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) రంగంలో అగ్రగామిగా ఉన్న ఐటీసీ లిమిటెడ్ (ITC ltd) ఈ Q3 లో రూ. 5,031.01 నికర లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం Q3 లో ఐటీసీ నికర లాభాలు రూ. 4,156.2 కోట్లు. అంటే, గత Q3 తో పోలిస్తే, ఈ Q3 లో ఐటీసీ నికర లాభాలు 21% వృద్ధి చెందాయి.

ట్రెండింగ్ వార్తలు

ITC dividend: డివిడెండ్ ప్రకటన

Q3 ఫలితాలతో పాటు ఈ ఆర్థిక సంవత్సరం మరో ఇంటరిమ్ డివిడెండ్ (interim dividend) ను మదుపర్లకు అందించనున్నట్లు ఐటీసీ (ITC) వెల్లడించింది. రూ. 1 ముఖ విలువ కలిగిన ప్రతీ ఒక్క ఈక్విటీ షేరుకు రూ. 6 డివిడెండ్ (interim dividend) గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇందుకు రికార్డు తేదీని (record date) ఈ ఫిబ్రవరి 15గా నిర్ధారించింది. ఈ మొత్తాన్ని అర్హులైన అందరు షేర్ హోల్డర్లకు మార్చి 3 నుంచి మార్చి 5వ తేదీలోగా చెల్లించనున్నట్లు వెల్లడించింది.

ITC Q3 sectorwise results: రంగాల వారీగా..

ఐటీసీ (ITC) గ్రూప్ లోని వివిధ విభాగాల వారీగా చూస్తే, సిగరెట్ల అమ్మకంపై ఆదాయం ఈ Q3 లో, గత Q3 తో పోలిస్తే, 16.7% పెరిగింది. సిగరెట్ విభాగం ఆదాయం ఈ Q3 లో రూ. 7,288 కోట్లు కాగా, గత Q3 లో రూ. 6,244.11 కోట్లు. హోటల్స్ విభాగంలో ఆదాయం గత Q3 తో పోలిస్తే, ఈ Q3 లో 50.48% పెరిగింది. ఈ Q3 లో హోటల్స్ ద్వారా రూ. 712.39 కోట్ల ఆదాయాన్ని ఐటీసీ (ITC) పొందింది. ఇది గత Q3 లో రూ. 473.39 కోట్లు. అగ్రి బిజినెస్ నుంచి వచ్చిన ఆదాయం ఈ Q3 లో రూ. 3,123.77 కోట్లు కాగా, గత Q3 లో అది రూ. 4,962.37 కోట్లు. అలాగే పేపర్ బోర్డ్స్,పేపర్, ప్యాకేజింగ్ విభాగం నుంచి ఈ Q3 లో రూ. 2,305.54 కోట్ల ఆదాయాన్ని ఐటీసీ ((ITC)) సముపార్జించింది. గత Q3 లో ఇది రూ. 2,046.48 కోట్లు. Q3 ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు విలువ బీఎస్సీలో (BSE) 0.50% పెరిగి రూ. 380.50 కి చేరింది.

WhatsApp channel