ITC Q2 results: ఐటీసీ ఆదాయం అప్-itc q2 results profit rises 24 to rs 4 620 crore beats estimates ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Itc Q2 Results: Profit Rises 24% To <Span Class='webrupee'>₹</span>4,620 Crore, Beats Estimates

ITC Q2 results: ఐటీసీ ఆదాయం అప్

ఐటీసీ లోగో
ఐటీసీ లోగో

ITC Q2 results: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆదాయ ఫలితాలను ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ గురువారం వెల్లడించింది.

సిగరెట్ల నుంచి హోటెల్స్ వరకు.. దాదాపు అన్ని ప్రధాన వ్యాపార రంగాల్లో ఉన్న కోల్ కతా కు చెందిన సంస్థ ఐటీసీ ఈ ఆర్థిక సంవత్సరం Q2 ఫలితాలను విడుదల చేసింది. అంచనాలకు మించి ఆదాయం రావడంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు

ITC Q2 results: 25% పెరిగిన లాభాలు

ఐటీసీ లాభాల్లో ఈ ఆర్థిక సంవత్సరం Q2లో 25% పెరుగుదల నమోదైంది. సెప్టెంబర్ తో ముగిసే త్రైమాసికంలో ఈ సంస్థ రూ. 18,608 కోట్ల లాభాలను ఆర్జించింది. గత సంవత్సరం Q2లో ఈ సంస్థ లాభాలు రూ. 14,844 కోట్లు. అంటే, గత సంవత్సరం Q2తో పోలిస్తే సంస్థ ప్రాఫిట్ 25% పెరిగింది. సంస్థ ‘పన్ను అనంతర ఆదాయా’న్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ Q2లో సంస్థ Q1 సాధించిన రూ. 4389.76 కోట్ల ఆదాయం కన్నా ఐదు శాతం అదనంగా సముపార్జించింది.

ITC Q2 results: రంగాల వారీగా..

సిగరెట్ల పై గత సంవత్సరం Q2 ఆదాయం కన్నా ఈ సంవత్సరం Q2లో ఆదాయం 23.3% అదనం. సిగరెట్లపై పన్ను స్థిరీకరణతో పాటు దర్యాప్తు సంస్థలు అక్రమంగా సిగరెట్ల దిగుమతిని విజయవంతంగా అడ్డుకోవడం వల్ల ఈ ఆదాయం సాధ్యమైందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అదీకాకుండా, ఐటీసీలో నకుల్ ఆనంద్ ను డైరెక్టర్ గా మళ్లీ అవకాశం కల్పించింది. కాగా, గత నాలుగు రోజులుగా ఐటీసీ షేర్ల ధర పెరుగుతూ వస్తోంది.

WhatsApp channel