IT salary hikes : ఐటీ ఉద్యోగులకు బ్యాడ్​ న్యూస్​! ఈసారి శాలరీ హైక్​..-it sector bracing for flat salary hikes at 8 4 9 muted hiring in 2024 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  It Sector Bracing For Flat Salary Hikes At 8.4-9%, Muted Hiring In 2024

IT salary hikes : ఐటీ ఉద్యోగులకు బ్యాడ్​ న్యూస్​! ఈసారి శాలరీ హైక్​..

Sharath Chitturi HT Telugu
Mar 19, 2024 11:17 AM IST

IT employees salary hike : దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఐటీ సెక్టార్​లో ‘జీతాల’ వ్యవహారం ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. అయితే.. ఉద్యోగులకు ఈసారి కాస్త బ్యాడ్​ న్యూస్​ తప్పెడట్టు లేదు!

ఐటీ ఉద్యోగులకు బ్యాడ్​ న్యూస్​ తప్పదా?
ఐటీ ఉద్యోగులకు బ్యాడ్​ న్యూస్​ తప్పదా?

IT sector salary hike news : ఇంకొన్ని రోజుల్లో కొత్త ఆర్థిక ఏడాది మొదలవుతుంది. వేతన జీవులు అందరు.. “శాలరీ హైక్”​ కోసం ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా.. భారత దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఐటీ సెక్టార్​లో జీతాల పెంపు విషయం ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. ఈసారి కూడా.. ఐటీ ఉద్యోగుల శాలరీ హైక్​పై పలు వార్తలు జోరుగా సాగుతున్నాయి. నివేదికలు చెబుతున్నవి నిజమే అయితే.. ఉద్యోగులు నిరాశ పడక తప్పదని చెప్పుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు

ఐటీ ఉద్యోగుల జీతాల పెంపు..

టీమ్​లీజ్​ డిజిటల్​ రిపోర్ట్​ ప్రకారం.. రానున్న ఆర్థిక ఏడాది ఐటీ సెక్టార్​కు సవాలుగానే ఉండొచ్చు. శాలరీల పెంపు ఫ్లాట్​గా ఉండొచ్చు. హైరింగ్​ ప్రక్రియ కూడా పుంజుకునే అవకాశం లేదు! రిక్రూట్​మెంట్​, కాంపన్సెషన్​ విషయంలో.. సంస్థలన్నీ ఆచితూచి వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. పైగా.. ఈ శాలరీ హైక్​ అనేది.. కొత్త ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికం పూర్తైన తర్వాతే ఉద్యోగులకు అందొచ్చు.

"2024లో.. ఐటీ సెక్టార్​లో సగటు వేతనాల పెంపు ఈసారి 8.4శాతం నుంచి 9శాతం మధ్యలో ఉండొచ్చు. గతేడాది ఇది 8.5శాతం- 9.1శాతంగా ఉంది. అంటే.. ఈసారి కాస్త తగ్గినట్టే. అంతేకాకుండా.. సాధారణంగా ఏప్రిల్​లో పడాల్సిన ఇంక్రిమెంట్​.. ఈసారి, వచ్చే ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికం తర్వాత పడొచ్చు," అని తమ నివేదిక చెబుతోందని, టీమ్​లీజ్​ డిజిటల్​కి చెందిన మునిరా లోలివాలా చెప్పారు.

మరి ఈ రిపోర్టులో ఎంత నిజం ఉందనేదది తెలియాల్సి ఉంది.

Salary hike in it sector : "హెడ్​కౌంట్​ని స్టెబిలైజ్​ చేయడంపై ఐటీ సెక్టార్​ ఇప్పుడు ఫోకస్​ చేయొచ్చు. ఉద్యోగుల సంఖ్య పరంగా.. ఈ ఏడాదిలో చాలా సంస్థలు ఫ్లాట్​గా, లేదా నెగిటివ్​గా ఉండొచ్చు," అని లోలివాలా చెప్పారు.

దిగ్గజ ఐటీ సంస్థలు ఇన్ఫోసిస్​, విప్రో, హెచ్​సఎల్​ టెక్​లు గతేడాది ఆచితూచి వ్యవహరించాయి. జీతాల పెంపును అనేక నెలల పాటు వాయిదా వేశాయి. లేదా.. ఎంపిక చేసిన కొద్దిమందికే ముందుగా వేశాయి. ఇన్ఫోసిస్​లో శాలరీ హైక్​ 10శాతం కన్నా తక్కువగానే ఉంది. ఇది నవంబర్​లో అమల్లోకి వచ్చింది.

టీసీఎస్​ ఉద్యోగులకు.. ఈసారి ఎంత హైక్​?

గతేడాది.. టీసీఎస్​ ఉద్యోగులు 6శాతం నుంచి 8శాతం మధ్యలో హైక్​ అందుకున్నారు. కొందరు టాప్​ పర్మార్మర్లకు మాత్రమే డబుల్​ డిజిట్​ హైక్​ కనిపించింది.

Indian IT sector : కాగా.. ఈసారి శాలరీ హైక్​కి సంబంధించిన ఓ నివేదిక బయటకు వచ్చింది. ఆఫ్​ సైట్​ ఉద్యోగులకు 7శాతం నుంచి 8శాతం మధ్యలో హైక్​ ఇవ్వాలని, అదే ఆన్​ సైట్​ ఉద్యోగులకు అది 2 నుంచి 4 శాతం మధ్యలో ఉంచాలని సంస్థ భావిస్తోందట. హై పర్ఫార్మర్స్​కి మాత్రమే 12శాతం నుంచి 15శాతం మధ్యలో శాలరీ హైక్​ అందొచ్చు!

ఆ సెక్టార్​లలో మాత్రం.. సూపర్​ హైక్​!

మరోవైపు.. బ్యాంకింగ్​, ఫైనాన్షియల్​ సెక్టార్​ ఉద్యోగులకు.. ఐటీతో పోల్చుకుంటే ఈసారి శాలరీ హైక్​ పర్సెంటేజ్​ ఎక్కువగానే ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. కనీసం 11.1శాతం ఇంక్రిమెంట్​ ఉంటుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం