Safest jobs in IT: ఐటీలో ఈ జాబ్స్ చాలా సేఫ్; లే ఆఫ్ భయం లేని సేఫెస్ట్ జాబ్స్ ఇవే-it layoffs these are the most riskiest safest jobs in tech industry ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  It Layoffs: These Are The Most 'Riskiest, 'Safest' Jobs In Tech Industry

Safest jobs in IT: ఐటీలో ఈ జాబ్స్ చాలా సేఫ్; లే ఆఫ్ భయం లేని సేఫెస్ట్ జాబ్స్ ఇవే

HT Telugu Desk HT Telugu
Feb 11, 2023 02:20 PM IST

Safest job in IT: ప్రస్తుతం ఐటీ మార్కెట్లో లే ఆఫ్ (lay off) సీజన నడుస్తోంది. పెద్ద పెద్ద టెక్ కంపెనీల నుంచి చిన్నాచితక కంపెనీలు కూడా కాస్ట్ కటింగ్ లో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Safest jobs in IT: ఇన్నాళ్లూ ఐటీ జాబ్స్ (IT Jobs) అంటే ఉన్న క్రేజ్ వేరు. ఆరు అంకెల జీతం. ఐదు రోజులే వర్క్. ఆఫ్ షోర్ ప్రాజెక్ట్స్.. ఇలా ఐటీ జాబ్స్ ఆకర్షణలే వేరు. కానీ ఇప్పుడు ఆ క్రేజ్ క్రమక్రమంగా తగ్గుతోంది. దశాబ్దాల అనుభవం ఉన్నా.. ఎప్పుడు పింక్ స్లిప్ (pink slip) చేతికి అందుతుందో తెలియని భయాందోళనల్లో ఐటీ ఉద్యోగులు ప్రస్తుతం ఉన్నారు. గత రెండేళ్లలో 58 వేల మందిని కొత్తగా ఉద్యోగాల్లో చేర్చుకున్న మైక్రోసాఫ్ట్ (microsoft).. ఈ ఏడాది 10 వేల మందిని తొలగించబోతున్నట్లు (lay off) ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

Safest jobs in IT: లే ఆఫ్ ముప్పు

అయితే, ఐటీ సెక్టార్ లోనూ కొన్ని జాబ్స్ (IT Jobs) ఉన్నాయి. మిగతా వాటితో పోలిస్తే, ఆ జాబ్స్ చాలా సేఫ్. ఆ విభాగాల్లోని ఉద్యోగులకు లే ఆఫ్ భయం తక్కువ. సంస్థ నిర్వహణలో, సంస్థ బిజినెస్ కార్యకలాపాల్లో ఈ విభాగాల్లోని ఉద్యోగుల పాత్ర చాలా కీలకం. కనుక లే ఆఫ్ (lay off) కత్తి వీరి మెడపై ఉండదు. అందువల్ల కొత్తగా ఐటీ లో ఉద్యోగాలు (IT Jobs) సంపాదించాలనుకునే ఔత్సాహికులు ఆ విభాగాల్లో నైపుణ్యం, అనుభవం సంపాదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Safest jobs in IT: ఈ జాబ్స్ సేఫ్

ఐటీ రంగంలో ఐటీ మేనేజర్స్ (IT managers), ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్స్ (information security analysts), వెబ్ డెవలపర్స్ (web developers), డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్స్ (database administrators) మొదలైన కెరీర్స్ కు లే ఆఫ్ భయాలు తక్కువ. ముఖ్యంగా 2023లో ఈ రంగాల్లోని ఉద్యోగులకు తమ జాబ్స్ పోతాయేమోనన్న భయం అక్కర్లేదు. వీటితో పాటు లీగల్ (legal), స్ట్రాటెజీ రోల్స్(strategy roles), క్లయింట్ ఫేసింగ్ టీమ్స్ (client facing jobs) జాబ్స్ కూడా సేఫ్. అయితే, వీరి జాబ్స్ పోకపోయినా.. వీరి బోనస్ (bonus), వేరియబుల్ పే (variable pay) వంటి వాటికి కత్తెర పడే అవకాశముంది.

Risky jobs in IT:ఈ జాబ్స్ కాస్త రిస్క్

బేసిక్ కోడింగ్ (basic coding), కస్టమర్ సపోర్ట్ (customer support), మెయింటెనెన్స్ (maintenance), అడ్మిన్ (admin), సేల్స్ (sales), సపోర్ట్ స్టాఫ్ (support staff) తదితర విభాగాల ఉద్యోగులు కాస్త రిస్క్ లో ఉన్నట్లే. సాధారణంగా లే ఆఫ్ సమయంలో ఎక్కువ మంది ఉద్యోగులున్న విభాగాలతో పాటు బేసిక్ కోడింగ్ (basic coding), కస్టమర్ సపోర్ట్ (customer support), మెయింటెనెన్స్ (maintenance), అడ్మిన్ (admin), సేల్స్ (sales), సపోర్ట్ స్టాఫ్ (support staff) విభాగాల ఉద్యోగులను కూడా తొలగించాలని యాజమాన్యాలు భావిస్తుంటాయి. ఏ విభాగంలోనైనా ఎప్పటికప్పుడు స్కిల్స్ ను అప్ డేట్ చేసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, కృత్రిమ మేథ (AI), మెషీన్ లెర్నింగ్ (machine learning) విభాగాల్లో స్కిల్స్ పెంచుకోవడం మేలని సూచిస్తున్నారు.

WhatsApp channel