Isuzu D Max EV : సింగిల్ ఛార్జింగ్‌తో 300 కి.మీ రేంజ్.. 1000 కిలోల సరుకును మోసుకెళ్లే ఈవీ ట్రక్కు!
Isuzu D Max EV : ఇసుజు డీ మ్యాక్స్ ఈవీ ట్రక్కు విడుదలైంది. సరుకులను తీసుకెళ్లేవారికి ఈ ట్రక్ ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది. దీనికి సంబంధించిన వివరాలేంటో చూద్దాం..
భారత్ మొబిలిటీ ఆటోఎక్స్‌పోలో ఇసుజు తన డీ మ్యాక్స్ పికప్ ట్రక్ ఎలక్ట్రిక్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇప్పటికీ కాన్సెప్ట్ కారు అయినప్పటికీ.. ఉత్పత్తి త్వరలో ప్రారంభం కానుంది. డీ మ్యాక్స్ ఈవీ కాన్సెప్ట్‌లో 66.9kWh బ్యాటరీ, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఇది 175బిహెచ్‌పీ పవర్, 325ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌పై 300 కి.మీల రేంజ్‌ను అందిస్తుంది. 3.5 టన్నుల టోయింగ్ కెపాసిటీ, 1,000కిలోల మోసే కెపాసిటీతో రూపొందించారు.

డీ మ్యాక్స్ వెలుపలి భాగంలో డిజైన్ మార్పులతో వచ్చింది. అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేసిన హెడ్‌లైట్లు, అప్డేట్‌గా వచ్చిన టెయిల్‌లైట్‌లు, బ్లూ కలర్‌లో కొత్త గ్రిల్‌ను కలిగి ఉంది. ఈ మార్పులు వాహనానికి ఆకర్శణియంగా చేశాయి. డీ మ్యాక్స్ ఇంటీరియర్ గురించి ఇసుజు ఇంకా వివరాలను వెల్లడించలేదు. అయితే కొత్త అప్‌హోల్స్టరీ, బ్లూ హైలైట్‌ల వంటి చిన్న అప్‌డేట్‌లు ఇంటీరియర్‌లో కూడా ఉండే అవకాశం ఉంది.
డీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఎడిషన్‌ను మంచి సామర్థ్యంతో తీసుకొచ్చారు. ఇది లోడ్లు, టోయింగ్ పనులను సమర్థవంతంగా నిర్వహించగలదు. ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాలవైపు చూస్తుండటంతో ఇసుజుకి కూడా కస్టమర్లకు నచ్చే విధంగా డీ మ్యాక్స్ తయారు చేసింది.
మారుతున్న వినియోగదారుల అవసరాలు, పర్యావరణ అనుకూలతగా ఇసుజు ఈ వెహికల్‌ను తీసుకొచ్చింది. డీ మ్యాక్స్ ఎడిషన్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. త్వరలో దీనిని మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈవీలకు పెరుగుతున్న ఆదరణ కారంగా ఇసుజు డీమ్యాక్స్ కూడా మంచి అమ్మకాలు చేసే అవకాశం ఉంది.