Aadhaar misuse: మీ ఆధార్ దుర్వినియోగం అవుతోందని అనుమానంగా ఉందా? ఇలా చెక్ చేసుకోండి..!-is your aadhaar being misused know how to track usage report fraud and secure your identity with these simple steps ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Aadhaar Misuse: మీ ఆధార్ దుర్వినియోగం అవుతోందని అనుమానంగా ఉందా? ఇలా చెక్ చేసుకోండి..!

Aadhaar misuse: మీ ఆధార్ దుర్వినియోగం అవుతోందని అనుమానంగా ఉందా? ఇలా చెక్ చేసుకోండి..!

Sudarshan V HT Telugu
Feb 01, 2025 05:08 PM IST

Aadhaar misuse: ఆధార్ దుర్వినియోగం కాకుండా, సురక్షితంగా ఉంచుకోవడం చాలా అవసరం. మీకు తెలియకుండా ఎవరైనా మీ ఆధార్ ను వాడుతున్నారని అనుమానంగా ఉందా? అయితే, అధార్ వినియోగాన్ని ఎలా ట్రాక్ చేయాలో, దుర్వినియోగం కాకుండా ఎలా రక్షించాలో ఇక్కడ చూడండి.

మీ ఆధార్ దుర్వినియోగం అవుతోందని అనుమానంగా ఉందా? ఇలా చెక్ చేసుకోండి..!
మీ ఆధార్ దుర్వినియోగం అవుతోందని అనుమానంగా ఉందా? ఇలా చెక్ చేసుకోండి..! (Aadhaar card)

Aadhaar misuse: బ్యాంకింగ్, ట్రావెల్, ప్రభుత్వ ప్రయోజనాలతో సహా వివిధ సేవలకు ఆధార్ విస్తృతంగా ఉపయోగించే గుర్తింపు పత్రంగా మారింది. గుర్తింపును ధృవీకరించడానికి 12 అంకెల ఆధార్ తరచుగా అవసరం పడుతోంది. ఇది రోజువారీ లావాదేవీలలో ముఖ్యమైన భాగంగా మారింది. అయితే ఇతరుల ఆధార్ ను మోసగాళ్లు ఆర్థిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దుర్వినియోగం చేస్తున్నారనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. మన ఆధార్ ను ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు ఉపయోగించారో హిస్టరీ ఒక దగ్గర ఉంటుంది. అది ఎక్కడ అంటే..?

మై ఆధార్ పోర్టల్లో..

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మై ఆధార్ పోర్టల్లో "ఆథెంటికేషన్ హిస్టరీ" అనే ఫీచర్ ఉంటుంది. ఇక్కడ మీ ఆధార్ ను ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు ఉపయోగించారో హిస్టరీ ఉంటుంది. ఈ ఆన్లైన్ టూల్ వినియోగదారులకు ఆధార్ సంబంధిత కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి, ఏదైనా అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడానికి వీలు కల్పిస్తుంది.

ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీని చూడడం ఎలా?

  1. మై ఆధార్ పోర్టల్ ను సందర్శించండి: అధికారిక మై ఆధార్ వెబ్ సైట్ https://myaadhaar.uidai.gov.in/portal ను యాక్సెస్ చేయండి.
  2. ఓటీపీతో లాగిన్: మీ ఆధార్ నెంబర్, స్క్రీన్ పై కనిపించే క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. 'లాగిన్ విత్ ఓటీపీ'పై క్లిక్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వచ్చిన వన్ టైమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి.
  3. ఆథెంటికేషన్ హిస్టరీ చెక్ చేయండి: "ఆథెంటికేషన్ హిస్టరీ" అనే ఆప్షన్ ఎంచుకోండి. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీ ఆధార్ హిస్టరీ కావాలో ఎంచుకోండి.
  4. కార్యకలాపాలను సమీక్షించండి: ఆ సంబంధిత తేదీల మధ్య మీ ఆధార్ లావాదేవీలను జాగ్రత్తగా చదవండి. ఏదైనా తెలియని లేదా అనధికార కార్యకలాపాలు కనిపిస్తే, వెంటనే చర్యలు తీసుకోండి.

అనధికారిక కార్యకలాపాలను ఇలా నివేదించాలి

అనధికారిక లావాదేవీలను గుర్తిస్తే, వినియోగదారులు వాటిని ఈ క్రింది మార్గాల ద్వారా నివేదించవచ్చు. అవి

  • యుఐడిఎఐ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1947 కు కాల్ చేయండి
  • లేదా సమస్య వివరాలను help@uidai.gov.in కు ఈమెయిల్ పంపండి.

ఆధార్ బయోమెట్రిక్స్ ను ఇలా లాక్ చేయండి

మీ ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉండడానికి ఆధార్ బయోమెట్రిక్స్ ను లాక్ చేసే అవకాశాన్ని కూడా యూఐడీఏఐ అందిస్తుంది. అలా లాక్ చేస్తే, ఎవరివద్దనైనా మీ ఆధార్ నంబర్ ఉన్నా.. మీ అనుమతి లేకుండా వారు మీ బయోమెట్రిక్ డేటాను ఉపయోగించలేరు.

ఆధార్ బయోమెట్రిక్స్ లాకింగ్

  1. యుఐడిఎఐ వెబ్సైట్ https://myaadhaar.uidai.gov.in/portal లో"లాక్ / అన్లాక్ బయోమెట్రిక్స్" విభాగానికి నావిగేట్ చేయండి.
  2. మీ వర్చువల్ ఐడీ (వీఐడీ), పేరు, పిన్ కోడ్, క్యాప్చా కోడ్ తదితర వివరాలను నమోదు చేయాలి.
  3. "సెండ్ ఓటిపి" పై క్లిక్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీ ని నమోదు చేయండి.
  4. బయోమెట్రిక్ డేటాను లాక్ చేసే ప్రక్రియను పూర్తి చేయండి.

అందరూ ఆధార్ వినియోగ చరిత్రను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం మంచిది. అలాగే, బయోమెట్రిక్ లాక్ చేసుకోవడం సురక్షితం.

Whats_app_banner