Stock Market : సెన్సెక్స్ దూసుకెళ్తున్న ఈ సమయంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా?-is this right time to invest money in the rise of stock market what expert says continue buying good or bad ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market : సెన్సెక్స్ దూసుకెళ్తున్న ఈ సమయంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా?

Stock Market : సెన్సెక్స్ దూసుకెళ్తున్న ఈ సమయంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా?

Anand Sai HT Telugu
Jul 04, 2024 01:57 PM IST

Stock Market : బీఎస్ఈ సెన్సెక్స్ కొద్ది రోజులుగా దూసుకెళ్తోంది. 7 నెలల్లోనే 70000 పాయింట్ల నుంచి 80000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. రానున్న రోజుల్లో లక్ష వరకూ వెళ్లగలదని అంచనా వేస్తు్న్నారు నిపుణులు.

స్టాక్ మార్కెట్ పెట్టుబడులు
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు

స్టాక్ మార్కెట్ ఇదే ఊపులో కొనసాగుతుందా? ఇటీవలి కాలంలో ఆకాశమే హద్దుగా వెళ్తున్న సెన్సెక్స్ చూసి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచిదేనా? డబ్బులు పెట్టుబడి పెట్టాలా? లేదంటే సైలెంట్‌గా చూస్తూ ఉండాలా? ఇలా చాలా మందికి అనేక రకాల ప్రశ్నలు ఉన్నాయి. దీనిపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

2006 ఫిబ్రవరిలో సెన్సెక్స్ తొలిసారిగా 10,000 స్థాయిని తాకింది. 1986లో ఆరంభమైన సెన్సెక్స్ మెుదటి పది వేల పాయింట్లకు వచ్చేందుకు చాలా టైమే పట్టింది. కానీ అప్పుడు 80 వేలు దాటుతుందని ఎవరు అనుకుని ఉండరు. మరికొద్ది రోజుల్లో లక్షవైపు పయనిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ స్టాక్ మార్కెట్ ఈ జోరు కొనసాగుతుందా? సెన్సెక్స్ తుపానులో ఇన్వెస్టర్లు ఏం చేస్తారు? మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టండి లేదా వేచి ఉండాలా? ఈ సమయంలో మార్కెట్ కు దూరంగా ఉండాలా లేక దాని వేగంతో పరుగులు తీయాలా అని నిపుణులను అడిగి తెలుసుకుందాం.

ఇదే జోరు కొనసాగితే అతి త్వరలోనే సెన్సెక్స్ 100000 స్థాయిని దాటుతుందని స్టాక్ మార్కెట్ నిపుణుడు కవిందర్ సచన్ చెబుతున్నారు. ఈ రోజు సెన్సెక్స్ 80300 స్థాయిని దాటింది. మార్కెట్ లో ఈ ఊపు చూస్తుంటే.. గత రికార్డులన్నీ బద్దలయ్యేలా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్ నిలదొక్కుకుంటుందో లేదోనని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. మళ్ళీ యథాతథంగా వచ్చే దాకా వెయిట్ చేయాలా అని ఆలోచిస్తున్నారు.

సచన్ ప్రకారం, సెన్సెక్స్ ఈ స్థాయి ఆచరణాత్మకమైనది. ఇక్కడ కృత్రిమంగా సెన్సెక్స్ పెరిగింది లేదు. నిఫ్టీ-50లో కూడా పెద్దగా కరెక్షన్ లేదు. బ్యాంక్ నిఫ్టీ కూడా 53000 స్థాయిని దాటడంలో విజయవంతమైంది. వారం రోజుల పాటు ఈ స్థాయిలో కొనసాగిన తర్వాత మంచి ర్యాలీని చూడవచ్చు. నిఫ్టీ వారం రోజుల పాటు 24000 పైన కొనసాగితే మార్కెట్ మళ్లీ పరుగులు తీస్తుంది.

ఈ స్థాయిలో ఇన్వెస్ట్ చేయాలని లేదా మార్కెట్ కు దూరంగా ఉండాలని ఇన్వెస్టర్లకు సూచించడంపై సచన్ మాట్లాడుతూ.. 'మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూనే ఉండండి. గత 18 ఏళ్లలో సెన్సెక్స్ 70,000 పాయింట్లు ఎగబాకింది. రాబోయే కొన్నేళ్లలో లక్ష మార్కును దాటుతుందని అంచనా.' అని చెప్పుకొచ్చారు.

భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమ పనితీరు కనబరుస్తోందని చాలా మంది స్టాక్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దేశ కరెంట్ ఖాతా లోటు కూడా తగ్గింది. దీంతో దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కూడా సానుకూల సంకేతాలు అందుతుండటంతో మార్కెట్లు పుంజుకుంటున్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపు ప్రకటనపై అందరి దృష్టి పడింది. ఒకవేళ కోత విధిస్తే స్టాక్ మార్కెట్లు జోరందుకుంటాయి.

సెన్సెక్స్ 80,000కు చేరుకున్న తర్వాత ఇన్వెస్టర్లు ఆచితూచి ముందుకు సాగాలని స్మాల్ కేస్ అండ్ స్టాక్ మార్కెట్ ఫౌండర్ ఆశిష్ కుమార్ ఇన్వెస్టర్లను హెచ్చరించారు. బడ్జెట్ నెల, క్యూ1 ఎఫ్‌వై 25 ఆదాయాల సీజన్ పరిశీలిస్తే, ఆర్థిక విధానాలు, కార్పొరేట్ ఫలితాలపై అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. పెట్టుబడులను ఒకేదానిలో పెట్టకపోవడం, ప్రాథమికంగా బలమైన స్టాక్‌పై దృష్టి పెట్టడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు. పెట్టుబడిన పెట్టిన స్టాక్ గురించి ఎప్పుడూ రిసెర్చ్ చేస్తూ ఉండాలి. పాక్షిక లాభాలను బుకింగ్ చేయడాన్ని పరిగణించండి. వీటితో పాటు వృద్ధికి సిద్ధంగా ఉన్న రంగాల్లో అవకాశాల కోసం అన్వేషించాలి. మార్కెట్ అస్థిరతను గమనించాలి. స్థూల ఆర్థిక సూచికలు, ప్రపంచ సూచనలపై నిఘా ఉంచండి.

గమనిక : నిపుణుల సిఫార్సులు, సలహాలు, అభిప్రాయాలు వారివి. HT Teluguవి కావు. ఇది స్టాక్ పనితీరు గురించి మాత్రమే, పెట్టుబడి గురించి సలహా కాదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ కు లోబడి ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించండి.

WhatsApp channel