Skoda Kylaq : స్కోడా కైలాక్​లో ఏది వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​? ఇది చూసి డబ్బులు సేవ్​ చేసుకోండి..-is skoda kylaq signature plus the most value for money variant to buy heres why we think so ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Skoda Kylaq : స్కోడా కైలాక్​లో ఏది వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​? ఇది చూసి డబ్బులు సేవ్​ చేసుకోండి..

Skoda Kylaq : స్కోడా కైలాక్​లో ఏది వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​? ఇది చూసి డబ్బులు సేవ్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu
Published Feb 10, 2025 01:32 PM IST

Skoda Kylaq : స్కోడా కైలాక్​ ఎస్​యూవీ కొంటున్నారా? మరి ఈ ఎస్​యూవీలో వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ ఏది? దాని ఫీచర్స్​, స్పెసిఫికేషన్స్​ ఏంటి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్కోడా కైలాక్​లో ఏది వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​?
స్కోడా కైలాక్​లో ఏది వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​?

భారత దేశ ఆటోమొబైల్​ మార్కెట్​లోని సబ్ కాంపాక్ట్ ఎస్​యూవీ సెగ్మెంట్​లో లేటెస్ట్​ ఎంట్రీ స్కోడా కైలక్. స్కోడా నుంచి ఇండియాలోకి వచ్చిన తొలి సబ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీ ఇదే. దీనికి కస్టమర్స్​ నుంచి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. మరి మీరు కూడా కైలాక్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? ఇందులో వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ ఏది? అని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! స్కోడా కైలాక్​ సిగ్నేచర్​ ప్లస్​.. వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ అని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వేరియంట్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

స్కోడా కైలాక్ సిగ్నేచర్ ప్లస్: ఫీచర్లు

సెకండ్ టు టాప్, స్కోడా కైలాక్​ సిగ్నేచర్ ప్లస్ వేరియంట్​లో 10 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్, రేర్ సెంటర్ ఆర్మ్​రెస్ట్, డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్ ఉన్నాయి. క్రూయిజ్ కంట్రోల్, డెకరేటివ్ డ్యాష్​బోర్డ్ ఇన్సర్ట్స్, ప్యాడల్ షిఫ్టర్స్​, క్రోమ్ యాక్సెంట్స్​తో లెథర్ స్టీరింగ్ వీల్ వంటివి ఇందులో ఉన్నాయి. క్యాబిన్​లో టీపీఎంఎస్, రేర్ డీఫాగర్, క్రోమ్ యాక్సెంట్స్, టైప్-సీ యూఎస్​బీ ఛార్జ్ పాయింట్లు ఉన్నాయి.

అంతేకాదు ఈ ఎస్​యూవీలో 16 ఇంచ్​ అల్లాయ్ వీల్స్​ ఉన్నాయి.

సిగ్నేచర్ ప్లస్ మోడల్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్ ఎక్స్​షోరూం ధర రూ .11.40 లక్షలు, ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్ ఆప్షన్​ ఎక్స్-షోరూమ్ ధర రూ .12.40 లక్షలు. ఈ సిగ్నేచర్ ప్లస్.. సిగ్నేచర్ వేరియంట్ కంటే రూ.1.80 లక్షలు ఎక్కువ. అయితే, దీనితో వినియోగదారులు పెద్ద టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, మంచిగా కనిపించే క్యాబిన్, మరెన్నో అదనపు ఫీచర్లను పొందుతారు. టాప్ స్పెక్ మోడల్​తో పోలిస్తే సిగ్నేచర్ ప్లస్ ధర రూ.1.95 లక్షలు తక్కువ. టాప్​ ఎండ్​ వేరియంట్​తో పోల్చితే ఈ స్కోడా కైలాక్​ సిగ్నేచర్​ ప్లస్​ వేరియంట్​లో 17 ఇంచ్​ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్​, ఎలక్ట్రిక్ సన్​రూఫ్ ఉండవు.

స్కోడా కైలాక్ సిగ్నేచర్ ప్లస్: స్పెసిఫికేషన్స్..

కైలాక్ ఎస్​యూవీ అన్ని వేరియంట్లు 1.0 లీటర్ 3 సిలిండర్​ టీఎస్ఐ పెట్రోల్ యూనిట్​తో పనిచేస్తాయి. కైలాక్​లోని 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 114బీహెచ్​పీ పవర్, 178ఎన్ఎమ్ పీక్​ టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

స్కోడా కైలాక్ సిగ్నేచర్ ప్లస్ మాన్యువల్ వెర్షన్లలో 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్​మిషన్, ఆటోమేటిక్ ఆప్షన్​లో 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లభిస్తుంది.

సబ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీ సెగ్మెంట్​లో స్కోడా కైలాక్​కి గట్టి పోటీ తప్పదు! నిస్సాన్​ మాగ్నైట్​, టాటా నెక్సాన్​, కియా సోనెట్​ వంటి బెస్ట్​ సెల్లింగ్​ ప్రాడక్ట్స్​తో స్కోడా కైలాక్​ పోటీపడనుంది. అయితే, అఫార్డిబుల్​ ధర ఉండటం కైలాక్​కి ప్లస్​ పాయింట్​ అవ్వొచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం