సింగిల్ ఛార్జ్‌తో 120 కి.మీ రేంజ్- సిటీ డ్రైవ్‌కి ఈ ఫీచర్ లోడెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్!
Electric scooter for city drive : సిటీ డ్రైవ్‌కి ఉపయోగపడే విధంగా, ఫీచర్ లోడెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు బిగాస్ ఆర్‌యూవీ 350 ఈ-స్కూటర్ గురించి తెలుసుకోవాల్సిందే..
సిటీ డ్రైవ్‌కి ఉపయోగపడే మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! బిగాస్ అనే సంస్థకు చెందిన ఆర్‌యూవీ 350 ఈ-స్కూటర్ గురించి మీరు తెలుసుకోవాలి. ఆర్‌యూవీ అంటే ‘రైడర్ యుటిలిటీ వెహికిల్’. ఇదొక ఫీచర్ లోడెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ మోడల్ ఫీచర్స్, రేంజ్, ధరతో పాటు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బిగాస్ ఆర్‌యూవీ 350- రేంజ్..
బిగాస్ ఆర్‌యూవీ 350 ఎలక్ట్రిక్ స్కూటర్ 3.5 కిలోవాట్ల (4.6 బీహెచ్పీ) ఎలక్ట్రిక్ మోటార్‌తో 165 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇందులో 3 వేరియంట్లు ఉన్నాయి. వీటి టాప్ స్పీడ్ 75కేఎంపీహెచ్. లోయర్ ఎండ్ వేరియంట్లలో పవర్ 2.3 కిలోవాట్ల రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ నుంచి వస్తుంది. ఇది 90 కిలోమీటర్ల రియల్ రేంజ్‌ని హామీ ఇస్తుంది. టాప్-స్పెక్ మ్యాక్స్ వేరియంట్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల ట్రూ రేంజ్‌ని ఇస్తుంది. ఇందులో 3 కిలోవాట్ల ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బిగాస్ 500 వాట్ల ఛార్జర్‌ను స్టాండర్డ్‌గా అందిస్తోంది. వినియోగదారులు ఫాస్ట్ ఛార్జర్‌ని కూడా ఎంచుకోవచ్చు. ఛార్జింగ్ సమయం స్టాండర్డ్ ఛార్జర్‌పై దాదాపు ఆరు గంటలు! ఫాస్ట్ ఛార్జర్‌పై సుమారు రెండు గంటల వరకు ఉంటుంది.
బిగాస్ ఆర్‌యూవీ 350- డిజైన్..
ఆర్‌యూవీ 350 ఈ స్కూటర్ క్రాస్ బాడీ స్టైల్‌ని కలిగి ఉంది. స్టెప్-త్రూ స్టైలింగ్ స్పష్టంగా కనిపిస్తుంది! అయితే ట్రెడీషనల్ ఈ-స్కూటర్ల మాదిరిగానే ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్ కూడ ఉంది. ఇందులో 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. టీవీఎస్ యూరోగ్రిప్ నుంచి సేకరించిన ట్యూబ్‌లెస్ టైర్లలో చక్రాలు ఇందులో ఉంటాయి. టార్మాక్, విరిగిన రోడ్లపై మరింత స్థిరత్వం- మెరుగైన మెయిన్టేనెన్స్కి ఇవి ఉపయోగపడతాయి.
బిగాస్ ఆర్‌యూవీ 350- స్టోరేజ్..
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఓపెన్ గ్లోవ్ బాక్స్, మల్టిపుల్ హుక్స్, హాఫ్-ఫేస్ హెల్మెట్‌ని కలిగి ఉండగల అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్‌తో సహా అనేక స్టోరేజ్ ఆప్షన్స్‌ని ఈ బిగాస్ ఆర్‌యూవీ 350 ఎలక్ట్రిక్ స్కూటర్ అందిస్తోంది. అయితే, ఛార్జర్‌కి అనుగుణంగా రూపొందించిన ఫ్లోర్‌బోర్డు కింద అదనపు స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది.
బీగాస్ యూవీ 350- ఫీచర్లు..
ఈ ఆర్‌యూవీ 350 ఒక ఫీచర్ లోడెడ్ ఈ-స్కూటర్ని చెప్పుకోవచ్చు. బేస్ వేరియంట్లో స్టాండర్డ్ ఎల్సీడీ డిస్ప్లే, టాప్ ఎండ్ మ్యాక్స్ వేరియంట్లో 5 ఇంచ్ టీఎఫ్టీ డిస్ప్లేను సంస్థ అందించింది. ఇది టచ్ స్క్రీన్ కాదు కానీ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి స్విచ్ గేర్ ఆధారిత కంట్రోలర్స్ని ఇచ్చింది. టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఇన్కమింగ్ కాల్ అలర్ట్స్, రైడింగ్ స్టాటిస్టిక్స్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ లభిస్తుంది. క్రూయిజ్ కంట్రోల్, ఫాల్ సేఫ్, రివర్స్ మోడ్, హిల్ హోల్డ్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
బిగాస్ ఆర్‌యూవీ 350- ధర, ప్రత్యర్థులు..
ఈ బిగాస్ ఆర్‌యూవీ 350 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.10లక్షల నుంచి రూ. 1.30లక్షల మధ్యలో ఉంటుంది. టీవీఎస్ ఐక్యూబ్, అథర్ రిజ్టా, బజాజ్ చేతక్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కి గట్టి పోటీనిస్తుంది.
సంబంధిత కథనం