సింగిల్​ ఛార్జ్​తో 120కి.మీ రేంజ్​- మిడిల్​ క్లాస్​ వారికి ది బెస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇది!-is ather 450 s electric scooter best for middle class customers check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  సింగిల్​ ఛార్జ్​తో 120కి.మీ రేంజ్​- మిడిల్​ క్లాస్​ వారికి ది బెస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇది!

సింగిల్​ ఛార్జ్​తో 120కి.మీ రేంజ్​- మిడిల్​ క్లాస్​ వారికి ది బెస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇది!

Sharath Chitturi HT Telugu
Published Feb 17, 2025 07:20 AM IST

Ather 450 S range : మీరు ఒక మంచి ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే మీరు ఏథర్​ 450 ఎస్​ గురించి తెలుసుకోవాల్సిందే! ఈ మోడల్​ ఫీచర్స్​, రేంజ్​తో పాటు పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

మిడిల్​ క్లాస్​ వారికి ది బెస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇదేనా?
మిడిల్​ క్లాస్​ వారికి ది బెస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇదేనా?

భారతీయ ఆటోమొబైల్​ ఇండస్ట్రీలోని ఎలక్ట్రిక్​ 2 వీలర్​ సెగ్మెంట్​పై ఇటీవలి కాలంలో కస్టమర్స్​ ఫోకస్​ పెరిగింది. అందుకు తగ్గట్టుగానే మార్కెట్​లో చాలా ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఆప్షన్స్​ అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో ఒకటి ఎంచుకోవడం ఇప్పుడు కాస్త కష్టంగా మరిందనే చెప్పుకోవాలి. మరి మీరు కూడా ఒక మంచి ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే మీరు ఏథర్​ 450 ఎస్​ గురించి తెలుసుకోవాల్సిందే! మిడిల్​క్లాస్​ పాకెట్స్​కి ఉపయోగపడే విధంగా మంచి రేంజ్​తో పాటు వివిధ ఫీచర్స్​ కలిగి ఉన్న ఈ ఏథర్​ 450ఎస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఏథర్​ 450 ఎస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​..

ఏథర్​ 450 ఎస్​ ఈ-స్కూటర్​లో సింగిల్​ సీట్​, క్యారీ హుక్​, ప్యాసింజర్​ ఫుట్​రెస్ట్​, 22 లీటర్​ అండర్​సీట్​ స్టోరేజ్​, డిస్టెన్స్​ ఎంప్టీ ఇండికేటర్​ వంటివి ఉన్నాయి.

ఇక సేఫ్టీ ఫీచర్స్​ విషయానికొస్తే ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో కాంబీ బ్రైక్​ సిస్టెమ్​, ఛార్జింగ్​ స్టేషన్​ లోకేటర్​, స్పీడోమీటర్​, ఓడోమీటర్​, ఈబీఎస్​ వంటివి ఉన్నాయి.

అంతేకాదు ఈ ఏథర్​ 450 ఎస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో కాస్టింగ్​ రీజెన్​, పార్క్​ అసిస్ట్​, సైడ్​ స్టాండ్​ మోటార్​ కటాఫ్​, 7 ఇంచ్​ డీప్​వ్యూ డిస్​ప్లే డాష్​బోర్డ్​ (8జీబీ స్టోరేజ్​, 1జీబీ ర్యామ్​), ఐపీ65 వాటర్​ అండ్​ డస్ట్​ రెసిస్టెన్స్​, రివర్స్​ అసిస్ట్​ వంటి అడిషనల్​ ఫీచర్స్​ వంటివి ఉన్నాయి.

ఎలక్ట్రిక్​ స్కూటర్​ గ్రౌండ్​ క్లియరెన్స్​ 170ఎంఎం. వీల్​బేస్​ 1296 ఎంఎం. కర్బ్​వెయిట్​ 108కేజీ.ఇందులో హెడ్​లైట్​, టెయిల్​లైట్​, టర్న్​ సిగ్నల్​ ల్యాంప్​ వంటివి ఎల్​ఈడీ ఆప్షన్​లో వస్తున్నాయి.

ఏథర్​ 450 ఎస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​- రేంజ్​, టాప్​ స్పీడ్​..

ఏథర్​ 450 ఎస్​లో పీఎంఎస్​ఎం మోటార్​ ఉంటుంది. ఇది 22 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఈ మోటార్​కి 2.9 కేడబ్ల్యూహెచ్​ లిథియం-ఐయాన్​ బ్యాటరీ ప్యాక్​ కనెక్ట్​ చేసి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 122 కి.మీ రేంజ్​ని ఇస్తుంది.

ఈ బ్యాటరీని 0-80శాతం ఛార్జ్​ చేసేందుకు 5 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. పూర్తిగా ఛార్జ్​ చేసేందుకు 7 గంటల 45 నిమిషాల సమయం పడుతుంది.

బ్యాటరీకి 3ఏళ్లు లదా 30వేల కిలోమీటర్ల వ్యారంటీని ఇస్తోంది సంస్థ. ఈ-స్కూటర్​ టాప్​ స్పీడ్​ 90కేఎంపీహెచ్​. 0-40 కేఎంపీహెచ్​ని 3.9 సెకన్లలో అందుకుంటుంది.

ఏథర్​ 450 ఎస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​- ధర..

ఈ ఏథర్​ 450 ఎస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి.. స్టాండర్డ్​, ప్రో ప్యాక్​. ఏథర్​ 450 ఎస్​ స్టాండర్డ్​ ఎక్స్​షోరూం ధర రూ. 1.29 లక్షలు. ప్రో ప్యాక్​ ఎక్స్​షోరూం ధర రూ. 1.43 లక్షలు.

ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ కాస్మిక్​ బ్లాక్​, స్టిల్​ వైట్​, స్టెల్త్​ బ్లూ, స్పేస్​ గ్రే వంటి కలర్స్​లో అందుబాటులో ఉంది.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం