Personal loan : ఉన్నత విద్య కోసం పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిదేనా? ఇది తెలియకపోతే నష్టపోతారు..
Personal loan for education : ఉన్నత విద్య కోసం పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిదేనా? లేకపోతే మన మీద భారం పెరుగుతుందా? పూర్తి వివరలను ఇక్కడ తెలుసుకోండి..
భారతదేశంలో చాలా మంది విద్యార్థులకు ముఖ్యమైన సవాళ్లలో ఒకటి.. ఉన్నత విద్యకు నిధులు సమకూర్చడం! నేటి ప్రపంచంలో మంచి గ్రేడ్స్‌తో పాటు చదువుకు తగిన నిధులు ఉండటం కూడా చాలా ముఖ్యం. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల కలను నెరవేర్చడానికి తమ పొదుపు మొత్తాన్ని ఖర్చు చేస్తారు. అయితే, కొన్నిసార్లు.. చేసిన పొదుపు విద్యా ఖర్చులకు సరిపోదు! మరి ఇలాంటప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవచ్చా? ఉన్నత విద్య కోసం పర్సనల్ లోన్ ఉపయోగపడుతుందా? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
పర్సనల్ లోన్ అంటే ఏంటి?
పర్సనల్ లోన్ అనేది అన్సెక్యూర్డ్ రుణం. ఇది వడ్డీ రూపంలో డబ్బు మొత్తాన్ని అందిస్తుంది. దీనిని నెలవారీ వాయిదాల్లో చెల్లించాలి. ఈ రుణాన్ని అనేక ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చు.
ఉన్న విద్య కోసం పర్సనల్ లోన్ తీసుకోవచ్చా?
ఇందాక చెప్పినట్టు పర్సనల్ లోన్ని అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. అందువల్ల, దీనిని ఉన్నత విద్యకు నిధులు సమకూర్చడానికి సైతం వాడుకోవచ్చు. ట్యూషన్ ఫీజులు, వసతి ఖర్చులు, పుస్తకాలు, ఇతర ఖర్చులు వంటిని ఈ రుణం కవర్ చేస్తుంది. చదువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎడ్యుకేషన్ లోన్‌తో పోలిస్తే పర్సనల్ లోన్ కొన్ని వెసులుబాట్లను కల్పిస్తుంది. ఎడ్యుకేషన్ లోన్‌కు నిధుల వినియోగంపై ఆంక్షలు ఉండవచ్చు. పర్సనల్ లోన్ని మీ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు!
ఉన్నత విద్య కోసం వ్యక్తిగత రుణాలను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు..
- ఉపయోగం: వివిధ ఖర్చుల కోసం పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. పర్సనల్ లోన్ తీసుకుని దేని కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నారు? అన్న విషయంపై ఎలాంటి పరిమితి లేదు. అందువల్ల, ఇది విద్యకు సంబంధించిన ఖర్చులను కవర్ చేయడానికి ఉపయోగించవచ్చు.
- వేగవంతమైన ఆమోదం: పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసే ప్రక్రియ సులభంగా, వేగంగా ఉంటుంది. అందువల్ల, అత్యవసరంగా నిధులు అవసరమైన విద్యార్థులకు ఇది సౌకర్యవంతంగా ఉంటుంది.
3. సెక్యూరిటీ అవసరం లేదు: ఇతర రుణాల మాదిరిగా కాకుండా, వ్యక్తిగత రుణానికి సెక్యూరిటీగా పూచీకత్తు అవసరం లేదు.
4. రీపేమెంట్ నిబంధనలు: వ్యక్తిగత రుణాలు ఫిక్స్డ్ రీపేమెంట్ నిబంధనలను కలిగి ఉంటాయి. దీనివల్ల రుణగ్రహీతలు తమ భవిష్యత్తు బడ్జెట్‌ని సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు.
5. మార్జిన్ మనీ అవసరం లేదు: టోటల్ అమౌంట్‌పై డౌన్‌పేమెంట్‌గా భావించే మార్జిన్ మనీ.. పర్సనల్ లోన్‌కి అవసరం లేదు. కొన్ని విద్యా రుణాలకు మార్జిన్ మనీ అవసరం కావచ్చు. అయితే, ఇది బ్యాంకును బట్టి మారవచ్చు.
ఇవి తెలుసుకోండి..
- వడ్డీ రేట్లు: ఇతర రకాల రుణాలతో పోలిస్తే, ముఖ్యంగా విద్యా రుణంతో పోలిస్తే, పర్సనల్ లోన్ అధిక వడ్డీ రేటును కలిగి ఉంటుంది. ఇది రుణ చెల్లింపు మొత్తాన్ని పెంచుతుంది.
- రీపేమెంట్ టైమ్: ఎడ్యుకేషన్ లోన్ మాదిరిగా కాకుండా పర్సనల్ లోన్‌కు తక్కువ రీపేమెంట్ పీరియడ్ ఉంటుంది. దీని అర్థం ప్రతి నెలా ఈఎంఐలు ఎక్కువగా ఉంటాయి! దీనివల్ల విద్యార్థులు వారి ఖర్చులను నిర్వహించడం కష్టమవ్వొచ్చు.
- అర్హత సమస్యలు: రుణం మంజూరు చేయడానికి కొన్ని రుణదాతలు చాలా కఠినమైన అర్హత ప్రమాణాలను కలిగి ఉంటారు. రుణదాతలు ఆదాయ పరిమితిని అర్హత ప్రమాణంగా కూడా నిర్ణయించవచ్చు. స్థిరమైన ఆదాయ వనరు లేనందున విద్యార్థులకు రుణం పొందడం కష్టమవుతుంది.
చివరిగా.. మీ ఉన్నత విద్యకు నిధులు సమకూర్చడానికి వ్యక్తిగత రుణాన్ని ఎంచుకునే ముందు.. స్కాలర్షిప్స్, గ్రాంట్లు, విద్యార్థి రుణాలు వంటి అందుబాటులో ఉన్న అన్ని ఆర్థిక సాధనాలను అన్వేషించండి. వ్యక్తిగత రుణంతో పోలిస్తే ఇలాంటి సాధనాలు మరింత అనుకూలమైన నియమనిబంధనలను అందిస్తాయి. మీరు మీ విద్యకు నిధులు సమకూర్చడానికి వ్యక్తిగత రుణాన్ని ఎంచుకోవాలనుకుంటే.. వడ్డీ రేట్లు, రీపేమెంట్ నిబంధనలు, మీ క్రెడిట్ స్కోరుపై సంభావ్య ప్రభావం వంటి అంశాలను పరిగణించండి.
(గమనిక: పర్సనల్ లోన్ రిస్కీ అని గుర్తుపెట్టుకోండి)
సంబంధిత కథనం