IRCTC Q3 results: ఐఆర్సీటీసీ డివిడెండ్ ఎంతో తెలుసా?
IRCTC Q3 results: ఐఆర్సీటీసీ (IRCTC) ఈ ఆర్థిక సంవత్సరం (FY23) మూడో త్రైమాసిక (Q3) ఫలితాలను ప్రకటించింది.
IRCTC Q3 results: ఈ ఆర్థిక సంవత్సరం (FY23) మూడో త్రైమాసికం (Q3) లో ఐఆర్సీటీసీ (IRCTC) రూ. 256 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. భారతీయ రైల్వేకు చెందిన టికెటింగ్, టూరిజం విభాగమైన ఐఆర్సీటీసీ (IRCTC) ఈ రంగంలో దాదాపు ఏకఛత్రాధిపత్యం వహిస్తోంది.
IRCTC Q3 results: 22.8% వృద్ధి
డిసెంబర్ నెలతో ముగిసిన ఈ Q3 (Q3FY23) లో ఐఆర్సీటీసీ (IRCTC) లాభం గత Q3 తో పోలిస్తే, 22.8% వృద్ధి చెందింది. గత Q3 లో ఐఆర్సీటీసీ నికర లాభం రూ. 208 కోట్లు. ఈ Q3 లో అది రూ. 256 కోట్లకు పెరిగింది. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరం Q2లో సంస్థ (IRCTC) నికర లాభాలు రూ. 226 కోట్లు. ఐఆర్సీటీసీ (IRCTC) ఆపరేషన్స్ ఆదాయం ఈ Q3 లో సుమారు 70% వృద్ధి చెందింది. ఈ Q3 లో సంస్థ (IRCTC) రూ. 918 కోట్ల నికర ఆదాయం సముపార్జించింది. గత Q3 లో ఇది రూ 540 కోట్లు మాత్రమే. ఆదాయంతో పాటు ఐఆర్సీటీసీ (IRCTC) నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయి. ఈ Q3 లో సంస్థ నిర్వహణ ఖర్చులు రూ. 607 కోట్లు. గత Q3 లో ఇది రూ. 274 కోట్లు మాత్రమే. అంటే, గత Q3 తో పోలిస్తే, ఈ Q3 లో సంస్థ (IRCTC) నిర్వహణ ఖర్చులు 121% పెరిగాయి.
IRCTC Q3 results: డివిడెండ్
Q3 ఫలితాలతో పాటు ఇంటరిమ్ డివిడెండ్ (IRCTC dividend) ను కూడా ఐఆర్సీటీసీ (IRCTC) ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ. 3.50 చొప్పున మదుపర్లకు డివిడెండ్ (IRCTC dividend) అందించనున్నట్లు వెల్లడించింది. డివిడెండ్ చెల్లింపునకు రికార్డు డేట్ గా 22 ఫిబ్రవరిని సంస్థ ప్రకటించింది. ఈ Q3 లో ఒక్క ఇంటర్నెట్ టికెటింగ్ (internet ticketing) విభాగం మినహా అన్ని విభాగాల్లోనూ మెరుగైన ఫలితాలను ఐఆర్సీటీసీ (IRCTC) సాధించింది. కేటరింగ్ (catering) విభాగంలో సంస్థ ఆదాయం రూ. 394 కోట్లు. గత Q3 లో ఇది రూ. 105 కోట్లు మాత్రమే. అంటే, గత Q3 కన్నా ఈ Q3 లో ఐఆర్సీటీసీ (IRCTC) కేటరింగ్ (catering) విభాగంలో 275% అధిక ఆదాయాన్ని సముపార్జించింది. ఇంటర్నెట్ టికెటింగ్ విభాగంలో మాత్రం గత Q3 కన్నా తక్కువ ఆదాయాన్ని సంపాదించింది. గత Q3 లో ఇంటర్నెట్ టికెటింగ్ ద్వారా రూ. 313 కోట్లు సంపాదించగా, ఈ Q3 లో అది రూ. 301 కోట్లు.