IRCTC Q2 results : క్యూ2లో.. 42.5శాతం పెరిగిన ఐఆర్​సీటీసీ నికర లాభం-irctc q2 results net profit up 42 5 to 226 cr revenue soars nearly 100 percent ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Irctc Q2 Results: Net Profit Up 42.5% To 226 Cr; Revenue Soars Nearly 100 Percent

IRCTC Q2 results : క్యూ2లో.. 42.5శాతం పెరిగిన ఐఆర్​సీటీసీ నికర లాభం

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 15, 2022 07:46 AM IST

IRCTC Q2 results 2022 : క్యూ2లో ఐఆర్​సీటీసీ నెట్​ ప్రాఫిట్​ 42.5శాతం పెరిగింది. ఈ మేరకు త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది ఐఆర్​సీటీసీ.

క్యూ2లో.. 42.5శాతం పెరిగిన ఐఆర్​సీటీసీ నికర లాభం
క్యూ2లో.. 42.5శాతం పెరిగిన ఐఆర్​సీటీసీ నికర లాభం (PTI)

IRCTC Q2 results 2022: 2023 ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది ఐఆర్​సీటీసీ(ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​). క్యూ2లో ఐఆర్​సీటీసీ నెట్​ ప్యాట్​(ప్రాఫిట్​ ఆఫ్టర్​ ట్యాక్స్​).. 42.5శాతం పెరిగి రూ. 226కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 158.5కోట్లుగా ఉండేది. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంతో(రూ. 245.5కోట్లు) పోల్చుకుంటే.. లాభాలు ఈసారి 7.7శాతం తగ్గాయి.

ట్రెండింగ్ వార్తలు

ఐఆర్​సీటీసీ రెవెన్యూ ఫ్రం ఆపరేషన్స్​ 99శాతం పెరిగి.. రూ. 805.8కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 404.9కోట్లుగా ఉండేది. ఇక తాజా త్రైమాసికంలో ఐఆర్​సీటీసీ ఖర్చులు రూ. 524కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఇది రూ. 207.4కోట్లుగా నమోదైంది.

LIC Q2 results 2022 పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IRCTC Q2 results : క్యాటరింగ్​లో సేల్స్​ 368శాతం వృద్ధి చెందడం విశేషం. గతేడాది అది రూ. 71.4కోట్లుగా ఉండగా.. ఈసారి ఏకంగా రూ. 334కోట్లుగా నమోదైంది. అదే సమయంలో ఇంటర్నెట్​ టికెటింగ్​.. వైఓవై(ఇయర్​ ఆన్​ ఇయర్​)లో 13శాతం పెరిగి రూ. 300కోట్లకు చేరింది. ఐఆర్​సీటీసీ మొత్తం ఆదాయం 105శాతం వృద్ధి చెంది రూ. 832కోట్లుగా రికార్డు అయ్యింది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ.405కోట్లుగా ఉంది.

ఐఆర్​సీటీసీ షేరు..

IRCTC share price : సోమవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి ఐఆర్​సీటీసీ షేరు 1.50శాతం పెరిగి రూ. 759 వద్ద స్థిరపడింది. కానీ గత ఐదు రోజుల్లో ఈ స్టాక్​ 1.46శాతం పతనమైంది. నెల రోజుల్లో 4.26శాతం పెరిగింది. ఆరు నెలల్లో ఐఆర్​సీటీసీ స్టాక్​ ప్రైజ్​ 16.10శాతం వృద్ధి చెందింది. కాగా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈ స్టాక్​ 10.25శాతం పతనమైంది.

Coal India Q2 results పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం