IRCTC down : తత్కాల్ వేళ ఐఆర్సీటీసీ సేవలకు తీవ్ర అంతరాయం- నెలలో మూడోసారి, ప్రజల్లో చిరాకు..
IRCTC down today : ఐఆర్సీటీసీ వెబ్సైట్ మరోసారి పనిచేయకుండా పోయింది! మంగళవారం ఉదయం సరిగ్గా తత్కాల్ సేవల సమయంలో ఐఆర్సీటీసీ డౌన్ అయ్యింది. ఫలితంగా టికెట్ బుకింగ్స్‌కి రెడీ అయిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఈ-టికెటింగ్ ప్లాట్‌ఫామ్ మంగళవారం ఉదయం డౌన్ అయ్యింది. సరిగ్గా తత్కాల్ టికెట్ సేవల సమయంలో చాలా మంది వినియోగదారులకు ఈ సైట్ అందుబాటులో లేకుండా పోయింది. ప్లాట్‌ఫామ్ యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు చాలా మందికి "డౌన్‌టైమ్ మెసేజ్" కనిపించింది. ఫలితంగా విస్తృత అంతరాయం కలిగింది. ఈ నెలలో తత్కాల్ సమయంలో ఐఆర్సీటీసీకి అంతరాయం ఏర్పడటం ఇది మూడోసారి. ఈ విషయంపై ప్రజలు తమ నిరాశను వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో ట్వీట్స్ చేశారు.
"డౌన్ టైమ్ మెసేజ్"లో ఏముంది?
“బుకింగ్, క్యాన్సిలేషన్ ఫర్ ఆల్ సైట్ తదుపరి గంట వరకు అందుబాటులో ఉండదు. మీకు కలిగిన అసౌకర్యానికి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రద్దు/ఫైల్ టీడీఆర్ కోసం, దయచేసి కస్టమర్ కేర్ నెంబరు 14646,08044647999 & 08035734999 కాల్ చేయండి లేదా మెయిల్ (eticketshirete.co.in) చేయండి,” అని ఐఆర్సీటీసీ పోర్టల్ ప్రాంప్ట్ పేర్కొంది.
ప్రజలు ఏమంటున్నారు?
ఈ సమస్య కారణంగా టికెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని కోల్పోయామని పలువురు చిరాకు పడుతున్నారు.
“నేను అన్ని సమాచారంతో సిద్ధంగా ఉన్నాను, కానీ ఐఆర్సీటీసీ సైట్ డౌన్ అవ్వడంతో మా నాన్నకి తత్కాల్ టికెట్ బుక్ చేయలేకపోయాను,” అని ఒకరు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
మరొకరు 'ఐఆర్సీటీసీ డౌన్.. తత్కాల్ బుకింగ్స్ లేవు," అని కామెంట్లు వదిలారు. "2024 ముగుస్తుంది కానీ కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు. ఐఆర్సీటీసీలో తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ట్రాఫిక్ కారణంగా సైట్ అందుబాటులో లేదు! తత్కాల్ సేవ కంటే లాటరీలా అనిపిస్తుంది. ఇంకా ఎవరైనా దీనితో ఇబ్బంది పడుతున్నారా?" అని మరొకరు ప్రశ్నించారు.
మరికొన్ని ఎక్స్ పోస్టులు చూడండి:
డౌన్ డిటెక్టర్ డేటా:
డౌన్ డిటెక్టర్ అనేది వివిధ యాప్స్, ఆన్లైన్ సేవలు, వెబ్‌సైట్స్‌కి అంతరాయాలపై రియల్-టైమ్ స్టేటస్ అప్డేట్లను ట్రాక్ చేసే ప్లాట్‌ఫామ్. మంగళవారం ఉదయం 11:40 గంటల వరకు ఈ సైట్ లో దాదాపు 1,600 ఫిర్యాదులు నమోదయ్యాయి.
భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలు ఈ ఐఆర్సీటీసీ డౌన్ సమస్యలను ఎదుర్కొన్నాయి. వీటిలో దిల్లీ, జైపూర్, లక్నో, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్ ఉన్నాయి.
తొలుత వెబ్సైట్లో సమస్యలు వచ్చాయని తెలుస్తోంది. తరువాత యాప్ గురించి, టికెట్ బుకింగ్ గురించి సమస్యలు వచ్చాయి.
సంబంధిత కథనం