ఇజ్రాయెల్- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 573 పాయింట్లు పడి 81,119 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 169 పాయింట్లు పతనమై 24,719 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 555 పాయింట్లు పడి 55,527 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1263.52 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,041.44 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
జూన్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 4821.39 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 44150.72 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 24,850 మార్క్ దిగువన ఉన్నంత వరకు నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నట్టు. 24,500 లెవల్స్ కూడా బ్రేక్ అయితే అమ్మకాల ఒత్తిడి మరింత పెరగొచ్చు," అని కొటాక్ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అమోల్ అథవాలే తెలిపారు.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.79 శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 1.13శాతం పతనమైంది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.30 శాతం పడింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఆర్పీజీ లైఫ్ సైన్సెస్- బై రూ. 2341.5, స్టాప్ లాస్ రూ. 2250, టార్గెట్ రూ. 2500
గుడ్‌లక్ ఇండియా- బైరూ. 997.5, స్టాప్ లాస్ రూ. 960, టార్గెట్ రూ. 1070
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా- బై రూ. 128, స్టాప్ లాస్ రూ. 124, టార్గెట రూ. 138
ఎస్బీఐ- బై రూ. 793, స్టాప్ లాస్ రూ. 782, టార్గెట్ రూ. 815
హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్- బై రూ. 5033, స్టాప్ లాస్ రూ. 4950, టార్గెట్ రూ. 5200
సంబంధిత కథనం