iQoo Z7 5G Sale Today: ఐకూ జెడ్7 5జీ సేల్ నేడే: ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్ల వివరాలివే-iqoo z7 5g price in india sale today offers details
Telugu News  /  Business  /  Iqoo Z7 5g Price In India Sale Today Offers Details
iQoo Z7 5G Sale Today: ఐకూ జెడ్7 5జీ సేల్ నేడే (Photo: iQoo)
iQoo Z7 5G Sale Today: ఐకూ జెడ్7 5జీ సేల్ నేడే (Photo: iQoo)

iQoo Z7 5G Sale Today: ఐకూ జెడ్7 5జీ సేల్ నేడే: ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్ల వివరాలివే

21 March 2023, 7:37 ISTChatakonda Krishna Prakash
21 March 2023, 7:37 IST

iQoo Z7 5G First Sale Today: ఐకూ జెడ్7 5జీ ఫోన్ తొలిసేల్ నేడు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా బ్యాంక్ కార్డు ఆఫర్ అందుబాటులో ఉంటుంది. OIS కెమెరాతో ఈ మొబైల్ వస్తోంది.

iQoo Z7 5G First Sale Today: ఐకూ జెడ్7 5జీ ఫోన్ నేడు (మార్చి 21) సేల్‍కు రానుంది. నేటి మధ్యాహ్నం 1 గంటకు ఈ ఫోన్ సేల్ ప్రారంభం అవుతుంది. తొలి సేల్ సందర్భంగా బ్యాంక్ కార్డు ఆఫర్ ఉంది. రూ.20వేలలోపు ధరతో 5జీ, అమోలెడ్ డిస్‍ప్లే, ఆప్టికల్ ఇమేజ్‍ స్టెబిలైజేషన్ (OIS) కెమెరా ఉండడం ఈ మొబైల్‍కు హైలైట్‍గా ఉంది. మీడియాటెక్ డైమన్సిటీ 920 ప్రాసెసర్ ఐకూ జెడ్7 5జీ మొబైల్‍లో ఉంటుంది. ఐకూ జెడ్7 5జీ సేల్ టైమ్, ధర, ఆఫర్లు, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు ఇక్కడ చూడండి.

ఐకూ జెడ్7 5జీ ధర, సేల్, ఆఫర్లు

iQoo Z7 5G Price in India: ఐకూ జెడ్7 5జీ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వస్తోంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ టాప్ వేరియంట్ రూ.19,999 ధరతో వస్తోంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‍లో నేటి (మార్చి 21) మధ్యాహ్నం 1 గంటకు ఈ ఫోన్ సేల్‍కు వస్తుంది.

iQoo Z7 5G Offer: ఐకూ జెడ్7 5జీ ఫోన్‍ను ఎస్‍బీఐ, హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొంటే రూ.1,500 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. అంటే బేస్ వేరియంట్‍ను రూ.17,499కే సొంతం చేసుకోవచ్చు.

అమోలెడ్ డిస్‍ప్లేతో..

iQoo Z7 5G Specifications: 6.38 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ AMOLED డిస్‍ప్లేను ఐకూ జెడ్7 5జీ కలిగి ఉంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. ఇన్ డిస్‍ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో ఈ ఫోన్ వస్తోంది.

ప్రాసెసర్, ఓఎస్

iQoo Z7 5G Specifications: ఐకూ జెడ్7 5జీ మొబైల్‍లో మీడియాటెక్ డైమన్సిటీ 920 ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‍టచ్ ఓఎస్ 13పై రన్ అవుతుంది. 2 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‍గ్రేడ్లను ఈ ఫోన్‍కు ఇవ్వనున్నట్టు ఐకూ తెలిపింది.

OIS ప్రైమరీ కెమెరా

iQoo Z7 5G Specifications: ఐకూ జెడ్7 5జీ వెనుక రెండు కెమెరాల సెటప్ ఉంది. OIS సపోర్ట్ ఉండే 64 మెగాపిక్సెల్ ISOCELL GW3 ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ మొబైల్ కలిగి ఉంది.

44వాట్ల ఫాస్ట్ చార్జింగ్

ఐకూ జెడ్7 5జీ ఫోన్‍లో 4,500mAh బ్యాటరీ ఉంది. 44వాట్ల పాస్ట్ చార్జింగ్‍కు సపోర్టు చేస్తుంది. డ్యుయల్ సిమ్ 5జీ, 4జీ ఎల్‍టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‍బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లను ఈ ఐకూ నయా ఫోన్ కలిగి ఉంది.

సంబంధిత కథనం