Mid range smartphone : సూపర్ ఫీచర్స్‌తో ఐక్యూ కొత్త స్మార్ట్‌ఫోన్- ధర కూడా తక్కువే!
iQOO Z10 launch : ఐక్యూ జెడ్10 స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కి రెడీ అవుతోంది. మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లో దీనికి మంచి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఐక్యూ జెడ్10 ధరకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఐక్యూ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు రెడీ అవుతోంది. దీని పేరు ఐక్యూ జెడ్10. ఈ గ్యాడ్జెట్‌కి సంబంధించి అనేక వివరాలను సంస్థ టీజ్ చేస్తూ వస్తోంది. ఇది ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ అయినప్పటికీ, ఇందులో కొన్ని ప్రీమియం ఫీచర్లు కూడా వస్తున్నాయని తెలుస్తోంది. ఇది మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మంచి ఆప్షన్ అవ్వొచ్చు. ప్రస్తుతానికి, ఐక్యూ జెడ్10 లాంచ్ కావడానికి ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అనేక లీకులు ఇప్పటికే స్పెసిఫికేషన్లు, ఫీచర్లను వెల్లడించాయి. తాజా లీక్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర కూడా బయటకు వచ్చింది. ఏప్రిల్ 11న ఐక్యూ జెడ్10 లాంచ్‌కు ముందు ఈ గ్యాడ్జెట్‌కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారతదేశంలో రాబోయే ఐక్యూ జెడ్10 ధర..
స్మార్ట్‌ప్రిక్స్ నివేదిక ప్రకారం, ఐక్యూ జెడ్10 రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌తో అందుబాటులోకి వస్తుంది. అవి.. 128 జీబీ. 256 జీబీ . బేస్ స్టోరేజ్ మోడల్ ధర భారతదేశంలో రూ.21,999 ఉండవచ్చని అంచనా. ఇది గత జనరేషన్ స్మార్ట్‌ఫోన్ కంటే కొంచెం ఎక్కువ. అయితే రూ.2000 బ్యాంక్ డిస్కౌంట్‌తో దీని ధర రూ.19,999కు తగ్గింది.
గ్లేసియర్ సిల్వర్, స్టెల్లార్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుందని ఐక్యూ ఇప్పటికే ధృవీకరించింది. అదనంగా, ఐక్యూ జెడ్10 అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
ఐక్యూ జెడ్10- స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..
ఐక్యూ జెడ్10 స్మార్ట్‌ఫోన్‌లో 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే ఉంటుందని సంస్థ వెల్లడించింది. స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేయనుంది. ఐక్యూ జెడ్10లో 90వాట్ ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్ చేసే 7,300 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 33 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుందని సంస్థ పేర్కొంది.
ఐక్యూ జెడ్10 డ్యూయల్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉండవచ్చు. ముందు భాగంలో సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
రానున్న రోజుల్లో, అధికారిక లాంచ్ సమయంలో ఐక్యూ అన్ని వివరణాత్మక స్పెసిఫికేషన్లను ధృవీకరించనుంది. కాబట్టి ఏప్రిల్ 11 వరకు ఆగాల్సిందే.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. టెక్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి..
సంబంధిత కథనం