ఐక్యూ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ని ఇండియాలో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఆ గ్యాడ్జెట్ పేరు ఐక్యూ నియో 10. ఈ మోడల్ని మే 26న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు సంస్థ ధృవీకరించింది. ఐక్యూ ఈ డివైజ్ ధరని అధికారికంగా ధృవీకరించనప్పటికీ, ఇది వన్‌ప్లస్ 13ఆర్, రాబోయే రియల్మీ జీటీ 7, పోకో ఎఫ్7 సహా మార్కెట్లోని ఇతర పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ గ్యాడ్జెట్స్‌తో పోటీపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐక్యూ నియో 10పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఐక్యూ నియో 10 స్మార్ట్‌ఫోన్ కొత్త క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. సూపర్ కంప్యూటింగ్ క్యూ 1 చిప్‌తో ఇది కనెక్ట్ చేసి ఉంటుంది. ఐక్యూ ఈ పరికరాన్ని పరిశ్రమకు చెందిన మొదటి 144 ఎఫ్‌పీఎస్ గేమింగ్ ఫోన్‌గా మార్కెటింగ్ చేయడం ప్రారంభించింది.
ఐక్యూ నియో 10లో 7000 ఎంఎం2 వేపర్ కూలింగ్ ఛాంబర్, బైపాస్ ఛార్జింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ కూడా ఇందులో ఉండనున్నాయి.
120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఈ ఐక్యూ నియో 10 స్మార్ట్‌ఫోన్‌లో అందించనున్నారు. ఈ ఫోన్ థిక్నెస్ 8.9 ఎంఎంగా ఉండనుంది.
ఐక్యూ నియో 10 రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ ధృవీకరించింది. అవి.. టైటానియం క్రోమ్, ఇన్ఫెర్నో రెడ్ (డ్యూయల్-టోన్ డిజైన్). కొత్త గ్యాడ్జెట్ డిజైన్ ఐక్యూ నియో 10ఆర్ని పోలి ఉండొచ్చు. ఇందులో స్క్విరికల్ కెమెరా కటౌట్, దిగువన ఐక్యూ బ్రాండింగ్‌తో ప్లాస్టిక్ బ్యాక్ ఉంటుంది.
కంపెనీ అధికారికంగా ధృవీకరించలేదు కానీ ఈ కొత్త పరికరం గత నెలలో చైనాలో లాంచ్ అయిన ఐక్యూ జెడ్ 10 టర్బ్రో ప్రో రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు!
6.78 ఇంచ్ 1.5కే అమోఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఈ ఫోన్ రానుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఐక్యూ నియో 10 డ్యూయల్ కెమెరా సెటప్‌తో 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటి 600 ప్రైమరీ షూటర్ విత్ ఓఐఎస్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో రావచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ని ఇందులో అందించారు తెలుస్తోంది.
ఈ ఐక్యూ కొత్త స్మార్ట్‌ఫోన్ పూర్తి ఫీచర్స్, ధరతో పాటు ఇతర వివరాలు లాంచ్ టైమ్ నాటికి అందుబాటులోకి వస్తాయి. వాటిని మేము మీకు తెలియజేస్తాము. స్టే ట్యూన్డ్ టు హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం