IPOs This Week: టాటా టెక్ సహా ఈ వారం మార్కెట్లోకి మొత్తం ఆరు ఐపీఓలు; మీరు సిద్ధంగా ఉన్నారా..?
IPOs This Week: నవంబర్ 20వ తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలో మొత్తం ఆరు ఐపీఓ (IPO) లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇన్వెస్టర్ల నుంచి మొత్తం రూ. 7,300 కోట్లను సమీకరించే లక్ష్యంతో అవి వస్తున్నాయి.
IPOs This Week: వచ్చే వారం మొత్తం ఆరు ఐపీఓలు ఇన్వెస్టర్లను ఊరిస్తున్నాయి. వాటిలో ఇన్వెస్టర్లు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న టాటా గ్రూప్ సంస్థ టాటా టెక్నాలజీస్ ఐపీఓ కూడా ఉంది. ఎల్ ఐసీ తరువాత మార్కెట్లోకి మరో ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్ఈడీఏ (Indian Renewable Energy Development Agency IREDA) కూడా ఈ వారం మార్కెట్లోకి వస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
Tata Technologies IPO: టాటా టెక్నాలజీస్ ఐపీఓ
టాటా టెక్నాలజీస్ ఐపీఓ నవంబర్ 22వ తేదీన ఓపెన్ అవుతోంది. నవంబర్ 24 వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ను రూ. 475 నుంచి రూ. 500 మధ్య నిర్ణయించారు. దాదాపు 19 ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ నుంచి వస్తున్న IPO ఇది. మార్కెట్లో టాటా టెక్నాలజీస్ సంస్థ విలువ రూ. 20 వేల కోట్ల కన్నా ఎక్కువగా ఉంది. ఈ ఐపీఓ ద్వారా రూ. 3,042.51 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
IREDA IPO: ఐఆర్ఈడీఏ ఐపీఓ
ఐఆర్ఈడీఏ (IREDA) ప్రభుత్వ రంగ సంస్థ. ఇది మినీ రత్న హోదాలో ఉంది. ఈ సంస్థ ఐపీఓ నవంబర్ 21న ఓపెన్ అవుతోంది. నవంబర్ 23 వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ఒక్కో లాట్ లో 460 షేర్లు ఉంటాయి. ప్రైస్ బ్యాండ్ ను రూ. 30 నుంచి రూ. 32 మధ్య నిర్ణయించారు. ఈ ఐపీఓ ద్వారా రూ. 2,150.21 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Gandhar Oil Refinery India IPO: గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఇండియా ఐపీఓ
ఈ ముంబై బేస్డ్ ఆయిల్ రిఫైనరీ సంస్థ ఐపీఓ నవంబర్ 22 న ఓపెన్ అవుతుంది. నవంబర్ 24 వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ప్రైస్ బ్యాండ్ ను రూ. 160 నుంచి రూ. 169 మధ్య నిర్ణయించారు. ఈ ఐపీఓ ద్వారా రూ. 500.69 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Fedbank Financial Services IPO: ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ
ఫెడరల్ బ్యాంక్, ట్రూ నార్త్ ఫండ్ సపోర్ట్ ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ సంస్థ ఐపీఓ నవంబర్ 22 న ఓపెన్ అవుతుంది. నవంబర్ 24 వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ప్రైస్ బ్యాండ్ ను రూ. 133 నుంచి రూ. 140 మధ్య నిర్ణయించారు. ఈ ఐపీఓ ద్వారా రూ. 1,092 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Flair Writing Industries IPO: ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ ఐపీఓ
స్టేషనరీ వస్తువులను ఉత్పత్తి చేసే ప్రముఖ సంస్థ ఫ్లెయిర్. ఇది కూడా ముంబై బేస్డ్ కంపెనీనే. ఈ సంస్థ ఐపీఓ నవంబర్ 22 న ఓపెన్ అవుతుంది. నవంబర్ 24 వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ప్రైస్ బ్యాండ్ ను రూ. 288 నుంచి రూ. 304 మధ్య నిర్ణయించారు. ఈ ఐపీఓ ద్వారా రూ.593 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Rocking Deals Circular Economy IPO: రాకింగ్ డీల్స్ సర్క్యులర్ ఎకానమీ ఐపీఓ
ఈ రాకింగ్ డీల్స్ సర్క్యులర్ ఎకానమీ బీ టు బీ ఈ కామర్స్ (B2B re-commerce) వ్యాపారంలో ఉన్న సంస్థ. ఈ సంస్థ ఐపీఓ నవంబర్ 22 న ఓపెన్ అవుతుంది. నవంబర్ 24 వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ప్రైస్ బ్యాండ్ ను రూ. 136 నుంచి రూ. 140 మధ్య నిర్ణయించారు. ఈ ఐపీఓ ద్వారా రూ.21 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.