SRH net worth : సన్ ​రైజర్స్​ హైదరాబాద్​ నెట్​ వర్త్​ ఎంతో తెలుసా? సంపదలో ఆ ప్లేయర్​ టాప్​!-ipl 2025 kavya maran srh net worth revealed this player stands top in wealth ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Srh Net Worth : సన్ ​రైజర్స్​ హైదరాబాద్​ నెట్​ వర్త్​ ఎంతో తెలుసా? సంపదలో ఆ ప్లేయర్​ టాప్​!

SRH net worth : సన్ ​రైజర్స్​ హైదరాబాద్​ నెట్​ వర్త్​ ఎంతో తెలుసా? సంపదలో ఆ ప్లేయర్​ టాప్​!

Sharath Chitturi HT Telugu

SRH net worth : సన్​ రైజర్స్​ హైదరాబాద్​ నెట్​ వర్త్​ ఎంతో తెలుసా? ఓనర్​, సీఈఓ కావ్య మారన్​ సంపద ఎంతో తెలుసా? ఎస్​ఆర్​హెచ్​ ప్లేయర్స్​లో సంపద విషయంలో టాప్​లో ఉన్న ప్లేయర్​ ఎవరో మీకు తెలుసా? ఇలాంటి ఆసక్తికర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎస్​ఆర్​హెచ్​ ఓనర్​, సీఈఓ కావ్య మారన్​ (PTI)

తెలుగు ప్రజల గుండెల్లో సన్​ రైజర్స్​ హైదరాబాద్​కి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఐపీఎల్​ హిస్టరీలో అత్యంత లాయల్​ ఫ్యాన్​ బేస్​ ఉన్న టీమ్స్​లో ఎస్​ఆర్​హెచ్​ ఒకటని అనడంలో సందేహం లేదు. విధ్వంసకర అభిషేక్​ శర్మ వంటి యువ క్రికెటర్ల​ నుంచి క్లాసెన్​, ప్యాట్​ కమిన్స్​, మహమ్మద్​ షమీ వంటి వరల్డ్​ క్లాస్​​ ప్లేయర్ల వరకు చూసుకుంటే, ఎస్​ఆర్​హెచ్​ వెల్-​ బిల్ట్​ టీమ్​గా కనిపిస్తుంది. సన్​ రైజర్స్​ హైదరాబాద్​ ఓనర్​, సీఈఓ కావ్య మారన్​ సైతం నిత్యం తన టీమ్​ని సపోర్ట్​ చేస్తూ ఉంటారు. అంతా బాగానే ఉంది కానీ, ఎస్​ఆర్​హెచ్​ నెట్​ వర్త్​ ఎంతో మీకు తెలుసా? కావ్య మారన్​ నెట్​ వర్త్​ ఎంతో మీకు తెలుసా? క్రికెటర్స్​లో ఎవరి సంపద ఎక్కవో మీకు తెలుసా? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఇక్కడ చూసేయండి..

కావ్య మారన్​ సన్​ రైజర్స్​ హైదరాబాద్​ నెట్​ వర్త్​..

ఎస్​ఆర్​హెచ్​ని 2012లో సన్​ టీవీ నెట్​వర్క్​ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ డీల్​ వాల్యూ అప్పట్లో 158 మిలియన్​ డాలర్లు. అప్పటి నుంచి ఈ ఐపీఎల్​ టీమ్​ నెట్​ వర్త్​ పెరుగుతూ వచ్చింది. ఇంకా చెప్పాలంటే చాలా రెట్లు పెరిగింది. 2024 నాటికి ఎస్​ఆర్​హెచ్​ నెట్​ వర్త్​ రూ. 735 కోట్లుగా ఉంది. ఈ ఐపీఎల్​ 2025 ముగిసే సరికి ఈ టీమ్​ నెట్​ వర్త్​ మరింత పెరగొచ్చు అని అంచనాలు ఉన్నాయి.

అంతేకాదు, 2024 మార్చ్​తో ముగిసిన ఆర్థిక ఏడాదిలో సన్​ టీవీ నెట్​వర్క్​ ఆదాయం రూ. 4,630.19 కోట్లుగా నమోదైంది. ఇందులో రూ. 659 కోట్ల వాటా కేవలం ఎస్​ఆర్​హెచ్​ ఆదాయమే అని తెలుస్తోంది.

సన్​ రైజర్స్​ హైదరాబాద్​ ఆదాయంలో ఎక్కువ భాగం బ్రాడ్​క్యాస్టింగ్​ రైట్స్​, స్పాన్సర్​షిప్​ డీల్స్​ వంటివి ఉంటాయి. టీమ్​ జెర్సీ స్పాన్సర్స్​, మెర్చెండైజ్​ బిజినెస్​ వేరుగా ఉంటుంది. మ్యాచ్​ టికెట్ల రూపంలోనూ టీమ్​కి ఆదాయం వస్తుంది.

ఇక సన్​ రైజర్స్​ హైదరాబాద్​ సీఈఓ కావ్య మారన్​ టీమ్​ని సపోర్ట్​ చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. సన్​ టీవీ ఓనర్​ కలానిథి మారన్​ కుమార్తె అయిన కావ్య మారన్​ నెట్​ వర్త్​ రూ. 400కోట్ల కన్నా ఎక్కువే ఉంటుంది. కావ్య మారన్​ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

సన్​ రైజర్స్​ హైదరాబాద్​ ప్లేయర్ల నెట్​ వర్త్​..

ఇక ప్లేయర్ల విషయానికొస్తే, ఎస్​ఆర్​హెచ్​కి సాలిడ్​ టీమ్​ ఉంది. దేశీయ, అంతర్జాతీయ ప్లేయర్లు ఫ్యాన్స్​ని ఎప్పుడూ అలరిస్తూనే ఉంటారు. అయితే నెట్​ వర్త్​ లిస్ట్​లో మాత్రం ఆస్ట్రేలియన్​ కెప్టెన్​, ప్రముఖ ఫాస్ట్​ బౌలర్​ ప్యాట్​ కమిన్స్​ మొదటి స్థానంలో, ఎవరికి అందనంత దూరంలో ఉన్నాడు! ఇంకొందరు స్టార్​ ప్లేయర్ల నెట్​ వర్త్​ వివరాలు ఇలా ఉన్నాయి..

పలు మీడియా నివేదికల ప్రకారం (అంచనా)..

ఆస్ట్రేలియన్​ బౌలర్​ ప్యాట్​ కమిన్స్​ నెట్​ వర్త్​ 43 మిలియన్​ డాలర్లు. అంటే సుమారు రూ. 370 కోట్లు. ఈ ఐపీఎల్​ 2025 కోసం కమిన్స్​ని రూ. 18కోట్లకు ఎస్​ఆర్​హెచ్​ రీటైన్​ చేసుకుంది.

మరో ఆస్ట్రేలియన్​ క్రికెటర్​​ ట్రావిస్​ హెడ్​ నెట్​ వర్త్​ రూ. 43 కోట్ల వరకు ఉంటుంది. ఈ విధ్వంసకర బ్యాటర్​ని రూ. 14కోట్లకు సన్​ రైజర్స్​ హైదరాబాద్​ రీటైన్​ చేసుకున్నట్టు సమాచారం.

వికెట్​ కీపర్​, బ్యాటర్​ హెన్రిక్​ క్లాసన్​ నెట్​ వర్త్​ రూ. 50కోట్ల వరకు ఉంటుంది. ఇతడిని ఎస్​ఆర్​హెచ్​ రూ. 23కోట్లు పెట్టి రీటైన్​ చేసుకుంది.

యువ సంచలనం అభిషేక్​ శర్మ నెట్​ వర్త్​ రూ. 15కోట్ల కన్నా ఎక్కువే ఉండొచ్చు. ఈ బ్యాటర్​ని ఎస్​ఆర్​హెచ్​ రూ. 14కోట్లు పెట్టి రీటైన్​ చేసుకుంది.

ఐపీఎల్​ 2025లో ఆల్​రౌండర్​ నితీశ్​ కుమార్​ని రూ. 6కోట్లకు సన్​ రైజర్స్​ హైదరాబాద్​ కొనుగోలు చేసింది. అతడి నెట్​ వర్త్​ రూ. 8కోట్లు- రూ. 15కోట్ల మధ్యలో ఉండొచ్చు.

ప్రముఖ బౌలర్​ మహమ్మద్​ షమీ నెట్​ వర్త్​ రూ. 50కోట్ల వరకు ఉండొచ్చు. ఈ డ్యాషింగ్​ బౌలర్​ని రూ. 10కోట్లకు ఐపీఎల్​ 2025లో ఎస్​ఆర్​హెచ్​ కొనుగోలు చేసింది.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం