iPhone storage full?: ఐ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిందా?.. ఇలా క్లియర్ చేసుకోండి..-iphone storage full this quick trick will make more space know how to do it ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Iphone Storage Full? This Quick Trick Will Make More Space; Know How To Do It

iPhone storage full?: ఐ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిందా?.. ఇలా క్లియర్ చేసుకోండి..

HT Telugu Desk HT Telugu
Nov 14, 2023 05:32 PM IST

iPhone storage full?: ఫొటోలు, సోషల్ మీడియా కంటెంట్ తో చూస్తుండగానే ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతోంది. 256 జీబీ స్టోరేజ్ కూడా సరిపోని వారు చాలా మంది ఉన్నారు. అయితే, చాలా ఫోన్స్ లో అవసరం లేనివి చాలా ఉంటాయి. వాటిని తొలగించుకుంటే, సమస్య చాలా వరకు సాల్వ్ అవుతుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

iPhone storage full?: ఐ ఫోన్ లో చాలా మంది స్టోరేజ్ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ప్రతి వీడియోను, ప్రతీ ఫోటోను చెక్ చేసి డిలీట్ చేయడం శ్రమతో కూడుకున్న విషయం. అంతేకాదు, అందుకు చాలా సమయం కూడా పడుతుంది. అయితే, ఐ ఫోన్ లోని అస్సలు ఎప్పుడూ ఉపయోగించని యాప్‌లు, అవసరం లేని ఫైల్స్ చాలా స్టోరేజ్ ని యూజ్ చేసుకుంటూ ఉంటాయి. వాటిని గుర్తించి డిలీట్ చేస్తే సమస్య దాదాపు పరిష్కారమవుతుంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ ఫీచర్ చాలా యూజ్ ఫుల్

ఐ ఫోన్ (iPhone) లో స్టోరేజ్ సమస్యను ఎదుర్కొంటున్నవారు ఒక ఇన్ బిల్డ్ ఫీచర్ ను ఉపయోగించడం ద్వారా తమ ఫోన్లోని అవసరం లేని ఫైల్స్, యాప్స్ ను తొలగించుకోవచ్చు. ఆ ఫీచర్ పేరు “Offload Unused Apps”. నిజానికి ఐ ఫోన్ లో స్టోరేజ్ ను ఫ్రీ చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అయితే, ఎక్కువ సమయం, ఎక్కువ శ్రమ అవసరం లేకుండానే చాలా ఎక్కువ స్టోరేజ్ ను ఫ్రీ చేసుకోవడానికి ఈ “Offload Unused Apps” ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే, ఈ ఫీచర్ మొత్తం యాప్ ను డిలీట్ చేయదు. మీ ఫోన్ లో నుంచి ఆ యాప్ ఫిజికల్ గా మాయమవుతుంది. కానీ, ఆ యాప్ లోని మీ డేటా, మీ ఫైల్స్ , ఇతర వివరాలు క్లౌడ్ స్టోరేజ్ (cloud storage) లో సేవ్ అయి ఉంటాయి. అవసరమైనప్పుడు వాటిని మళ్లీ తిరిగి పొందవచ్చు.

ఇలా చేయండి

  • మీ ఐ ఫోన్ లోని అనవసర యాప్స్ ను తొలగించడానికి, మరింత స్టోరేజ్ ను ఫ్రీ చేసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో కావాలి.
  • మీ ఐ ఫోన్ లోని సెట్టింగ్స్ ను ఓపెన్ చేయండి.
  • “App Store” బటన్ ను సెలెక్ట్ చేసుకుని, దానిపై క్లిక్ చేయాలి.
  • మీకు “Offload Unused Apps” ఫీచర్ కనిపిస్తుంది.
  • ఉపయోగించని యాప్స్ ను ఆటోమేటిక్ గా డిలీట్ చేయడానికి ఆ ఫీచర్ ను ఆన్ (on) చేయండి.
  • ఇలా చేయగానే, మీ ఫోన్ లోని అన్ యూజ్డ్ యాప్స్ అన్నీ డిలీట్ అవుతాయి. కానీ, వాటిలోని కంటెంట్ మీ క్లౌడ్ స్టోరేజ్ లో సేఫ్ గా ఉంటుంది.
  • ఆ డేటాను మీరు అవసరమైనప్పుడు మళ్లీ యాక్సెస్ చేసుకోవచ్చు.
  • అలాగే, మీకు అవసరమైనప్పుడు ఆ యాప్ ను మళ్లీ పూర్తి డేటాతో రీ ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

WhatsApp channel