iPhone SE 4 : మోస్ట్ అఫార్డిబుల్ యాపిల్ ఐఫోన్ లాంచ్ రేపేనా? ఈ స్మార్ట్‌ఫోన్ విశేషాలు ఇవే..!
iPhone SE 4 launch date : ఐఫోన్ ఎస్ఈ 4 ఫిబ్రవరి 11న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మోస్ట్ అఫార్డిబుల్ ఐఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని వివరాలను ఇక్కడ చూసేయండి..

మచ్ అవైటెడ్ ఐఫోన్ ఎస్ఈ 4 రేపు, మంగళవారం లాంచ్ అయ్యే అవకాశం ఉంది! లాంచ్ డేట్‌ని సంస్థ కరెక్ట్‌గా చెప్పకపోయినా, ఈ వారంలో స్మార్ట్‌ఫోన్‌ని విడుదల అవుతుందని యాపిల్ ఎనలిస్ట్ మార్క్ గర్మెన్ తెలిపారు. ఇక ఇప్పుడు ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ డేట్ ఫిబ్రవరి 11 అని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే యాపిల్ వెబ్‌సైట్స్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాల్సిందే. ఎందుకుంటే, ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ కోసం యాపిల్ స్పెషల్ ఈవెంట్‌ని ఏర్పాటు చేయడం లేదు! ఒకవేళ ఈవెంట్ ఉండి ఉంటే, ఈపాటికే నోటిఫికేషన్ వచ్చుండేది! ఈ నేపథ్యంలో ఈ ఐఫోన్ ఎస్ఈ 4పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఐఫోన్ ఎస్ఈ 4- అంచనాలు..
ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ సమీపిస్తున్న కొద్దీ, యాపిల్ తన మోస్ట్ అఫార్డిబుల్ ఐఫోన్ కోసం ఏం ప్లాన్ చేస్తోందో అనే ఆసక్తి కనిపిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ మంగళవారం లాంచ్ కానుండటంతో ఆ నిరీక్షణకు తెరపడనుందని మాక్‌రూమర్స్ నివేదిక తెలిపింది.
ఐఫోన్ ఎస్ఈ 4.. ఐఫోన్ 14 మాదిరిగానే ఉంటుంది! పైన నాచ్, అల్యూమినియం ఫ్రేమ్, గ్లాస్ బిల్డ్‌తో ఆల్-డిస్ప్లే ఫ్రంట్ ప్యానెల్, వాల్యూమ్, మ్యూట్ బటన్ వంటివి ఉంటాయి. అయితే యూఎస్బీ-సీ ఛార్జింగ్ పోర్టులతో కొన్ని అప్‌గ్రేడ్స్ వస్తున్నాయి. 6.1 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఎల్సీడీ డిస్ప్లే టెక్నాలజీతో ఈ స్మార్ట్‌ఫోన్ రానుంది. యాపిల్ ఎట్టకేలకు ఐఫోన్ ఎస్ఈ 4తో టచ్ ఐడీని వదిలించుకుంటుంది, మెరుగైన రక్షణ కోసం ఫేస్ ఐడీ అన్లాకింగ్ సిస్టెమ్ వస్తుందని అంచనాలు ఉన్నాయి.
ఐఫోన్ ఎస్ఈ 4 స్మార్ట్‌ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, ఏ18 ప్రాసెసర్ ఉండొచ్చు. ఈ కాంబినేషన్ ఫ్లాగ్షిప్ ఐఫోన్ 16 మోడ్స్‌లో కూడా ఉంది. కాబట్టి, తక్కువ ఖర్చుతో శక్తివంతమైన పర్ఫార్మెన్స్ని ఆశించవచ్చు. ఐఫోన్ ఎస్ఈ 3గా 64 జీబీ స్టోరేజ్‌కి బదులుగా 128 జీబీ బేస్ స్టోరేజ్ ఆప్షన్ని యాపిల్ అందించవచ్చు. యాపిల్ తన కొత్త 5జీ మోడెమ్‌ని తీసుకురావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే దీనిని ఇంకా ధ్రువీకరించలేదు.
ఐఫోన్ ఎస్ఈ 4 వర్సెస్ గూగుల్ పిక్సెల్ 9ఏ- పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
కెమెరా ఫీచర్ల విషయానికొస్తే, ఐఫోన్ ఎస్ఈ 4లో 48 మెగాపిక్సెల్‌తో కూడిన సింగిల్ రేర్ కెమెరా, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండొచ్చు. చివరిగా, ఈ స్మార్ట్‌ఫోన్.. ఐఫోన్ 14 మాదిరిగానే బ్యాటరీని కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అందువల్ల, ఇది 20 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. టెక్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి..
సంబంధిత కథనం